బంధువులతోహార్దిక సంబంధాలు నెరపడం మంచిది. ఆరోగ్య విషయిక పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఏమంటే, దీర్ఘ కాలిక వ్యాధి సూచన (స్పెక్యులేషన్)ఉన్నది. ఏ చిన్న అవకాశం వచ్చినా మీ శతృవులు మీకు హాని చేయడానికి ఏరాయి దొరికినా విసరకుండా ఉండరు. అంటే దెబ్బ తీసి హాని కలిగించే ప్రయత్నాలు చేస్తుంటారు. కనుక, వారి నుండి వీలైనంత సురక్షిత దూరంలో ఉండండి.కుటుంబ సభ్యుల అనారోగ్యం కూడా మిమ్మల్ని కలతపెట్టవచ్చును. అప్పులు, చేబదుళ్ళు అదుపు చేసుకోవడం మంచిది. అందువలన ఆర్థికంగా కాస్త సంతోషంగా, ప్రశాంతంగా ఉండవచ్చును. మీకు ఖర్చు, దొంగతనం జరగడం వలన నష్టం , వివాదాలు కలగవచ్చును. అధికారులతో కూడా అభిప్రాయభేదాలు, అనంగీకారాలు పొడచూపవచ్చును.
Jun 30, 2026 - Jul 22, 2026
ఇది మీకు అతి యోగదాయకమైన సమయం కనుక వీలైనంత ప్రయోజనం పొందడానికి ప్రయత్నించండి. మీకు గల అన్ని వత్తిడులు, సమస్యలనుండి విముక్తి పొందుతారు. కుటుంబ మరియు, వృత్తి పరంగా మీకు అనుకూలం . బండి నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్త గా ఉండాలి. మీరు మీ శతృవులను సంపూర్ణంగా అణచేయాలనుకుంటారు కనుక మీ ముందుకు రావడానికి ధైర్యం చేయరు. సాహసం చూపి, వృత్తిపరమైన ఉత్తమ ఫలితాలను పొందుతారు.
Jul 22, 2026 - Sep 14, 2026
మీ పై అధికారులనుండి లేదా బాధ్యతాయుతమైన లేదా పరపతిగల వ్యక్తులనుండి, సంపూర్ణమైన సహకారం లభిస్తుంది. వృత్తిపరంగా మీరు మంచి అభివృద్ధిని చూడగలరు. వ్యాపార / వాణిజ్య అంశాలు చక్కగా సాగుతాయి. ఉద్యోగికి పదోన్నతి/ ప్రమోషన్ కోసం ఆశించవచ్చును. ఇంటా బయటా( ఉద్యోగంలో) బాధ్యతలు ముఖ్యమైనవి నిర్వర్తించాల్సి ఉంటుంది. మీ అధికారిక బాధ్యతలు/ ప్రయాణాలరీత్యా మీకు గొప్ప వారితో సంబంధమేర్పడుతుంది. మీ సంతానం తో సమస్యలున్నా కూడా, మీ సోదరుల, సోదరితో చక్కని అనుబంధం ఉంటుంది.
Sep 14, 2026 - Nov 02, 2026
మీగురించి తగిన జాగ్రత్త తీసుకొండి. మితిమీరిన బాధ్యతలను నెత్తికెత్తుకోవద్దు. అలా అయితే చాలాకాలం పాటు, మీజీవితాన్ని సవ్యంగా గడపగలుగుతారు. కాకపోతే, కొన్ని నిరాశలు ఎదురుకావచ్చును. మీ ధైర్యం అంకితభావన మీ సుగుణాలు. ఇవి కొంతమందిని కించపడేలా చేయవచ్చు. పెద్ద మొత్తంపెట్టుబడులకు పోవద్దు. ఏమంటే, మీరు అనుకున్నట్లుగా పరిస్థితులు అనుకూలించక పోవచ్చును. మీ స్నేహితులు, సహచరులనుండి, అనుకున్నట్లుగా సరైన సహకారం అందకపోవచ్చును. కుటుంబ సభ్యుల దృక్పథం మీకు భిన్నంగా ఉండవచ్చును. ఆరోగ్యం కాస్త చికాకు పరచవచ్చును. తల త్రిప్పటం, జ్వరం దాడులు, చెవి ఇన్ఫెక్షన్ మరియు వాంతులు కలగవచ్చును.
Nov 02, 2026 - Dec 30, 2026
ప్రయాణ అభిలాష ఉండడం వలన కొంత అలసట ఉండవచ్చును. మీకు ఒకమూల కూరొనడం నచ్చదు కనుక కొంత అలసటకు కారణమౌతుంది. కెరియర్ లో మార్పుకు లోనవుతూ వత్తిడులతో మొదలవుతుంది. క్రొత్త ప్రాజెక్ట్ లు, రిస్క్లు తీసుకోకుండా ఉండడలి. క్రొత్త పెట్టుబడులు ఒప్పందాల కమిట్ మెంట్ లు ఆపాలి. లాభాలకు సూచనలున్నాకానీ ఆటు పోట్లుంటాయి. కనుక సౌకర్యవంతంగా అనిపించదు. లౌకిక సుఖాల రీత్యా,ఈ దశ అంతగా మంచిది కాదు. మత సంబంధ ,మరియు ఆధ్యాత్మిక పరంగా ఏ చర్యలు చేపట్టినా కష్టాలను ండి బయట పడెయ్యడానికి, సహాయమవుతుంది. మీ బంధువుల ద్వారా కొంత విచారం కలగ వచ్చును. ఆకస్మిక నష్టాలు, యాక్సిడెంట్లకు అవకాశమున్నది.
Dec 30, 2026 - Feb 19, 2027
ఏది ఏమైనా మీరు మరీఅంతగా అదృష్టంకోసం అర్రులు చాచడం మానాలి. మీ డబ్బు వివిధ రీతులలో చిక్కుకుపోవడం వలన మీకు ఆర్థికంగా గొప్ప ఇబ్బంది కలగవచ్చును. ఆరోగ్య సమస్యకూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చును. ప్రత్యేకించి మీరు దగ్గు, కఫ సంబంధ సమస్యలు, కంటి కలకలు, వైరల్ జ్వరం సోక వచ్చును. బంధువులు, స్నేహితులు, లేదా సహచరులతో వ్యవహరించేటప్పుడు, కాస్త జాగ్రత్త వహించండి. ప్రయాణాలు ఫలవంతం కాకపోవచ్చును. కనుక వీలైనంతవరకు తప్పించుకొండి. చిన్న విషయాలు కూడా, గొడవలకి దారితీయవచ్చును. అజాగ్రత్త వలనలేదా, నిర్లక్ష్యం కారణంగా ఈ సమయం మీకు, సమస్యలను చీకాకు పుట్టించే పరిస్థితులను తీసుకురావచ్చును. ప్రయాణాలు మానాలి. .
Feb 19, 2027 - Mar 13, 2027
మీ వ్యక్తిగత భావ ప్రకటనం, మరియు, మీ సృజనాతకతని వివిధ రంగాలలో ప్రదర్శించడానికి, ఇది మంచి సమయం. ఒక శుభకార్యం మీ ఇంట్లో జరగవచ్చును. మీ వరకు మీకు అతిప్రాముఖ్యత కలిగిన పనిజరిగే ప్రదేశంలో, లేదా, వ్యాపారస్థానాలలో, అసలు ఎదురుచూడని విధంగా సానుకూలమైన మార్పులు సంభవించే అవకాశం ఉన్నది. అలాగే, మీ వ్యాపార సంబంధమైన ప్రయాణాలు , ఎంతో ప్రయోజనకరమై విజయవంతమౌతాయి. ఈ అద్భుతమైన సమయాన్ని సద్వినియోగం చేసుకొనండి. మత సంబంధమైన సంబరాలకు మీరు హాజరౌతారు. దాంతోపాటు, గౌరవనీయులు, మత సంబంధమైన వారు, మీకు పరిచయమౌతారు.
Mar 13, 2027 - May 13, 2027
దీనికి చీకటి కోణంలో, ఇది తగువులకి దారితీసి, ప్రేమించినవారి దూరంఅవడం భగ్న ప్రేమ సంభవించవచ్చును. చేయవలసినదల్లా, ఈ సమయంలో, ఇతరుల విషయాలలో తల దూర్చవద్దు. మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, రిస్క్ లో ఉన్నాయి. ఏదైనా మచ్చవచ్చే స్కాండల్ లో ఇరుక్కోవచ్చును. మీ పరువు దెబ్బతినవచ్చును. ధనాగమనం జరిగినా, చెప్పనవసరం లేకనే ఖర్చులూ అంతగానూ కనిపిస్తాయి. ఈ సమయం ప్రమాదకరం, కనుక మీరు మరింత జాగరూకత వహించాలి. ప్రయాణాలు ఫలవంతంకావు కనుక మానాలి.
May 13, 2027 - May 31, 2027
ఇది మీకు బహు కష్ట కాలం. మీ అదృష్టం మీకు వ్యతిరేకమౌతున్నట్లుంది. మీ వ్యాపార భాగస్వాములు మీకు బహు సమస్యలను సృష్టిస్తారు. మీ వ్యాపార సంబంధ ప్రయాణాలు లాభించకపోవచ్చును. ఇంటి విషయాలలో, మీ తీవ్ర స్వభావాన్ని అదుపులో ఉంచుకొనండి. ఆవిధంగా ఇబ్బందికర పరిస్థితులనుండి తప్పించుకొనవచ్చును. భాగస్వామి అనారోగ్యం, చీకాకులకు కారణం కావచ్చును. మీరు కూడా అనారోగ్యం, మానసిక వత్తిడులకు గురి అయే అవకాశం ఉన్నది. మీకు కూడా, తల, కంటి సంబంధ, పాదాలకు, చేతులకు సంబంధించిన సమస్యలు కలగవచ్చును.
May 31, 2027 - Jun 30, 2027
మీరు ఎన్నో అవకాశాలున్నా కూడా, దారిలో ఎదురు రానున్న అవకాశాలను అంది పుచ్చుకోలేరు, అన్నీ వ్యర్థమే అయిపోతాయి. ఆరోగ్యపరంగా మీకు కానీ, మీ తల్లితండ్రులకు కానీ సమస్యలు ఎదురుకావచ్చును. కనుక తగిన జాగ్రత్త తీసుకొనండి. దూరప్రయాణాలు ఉన్నా ఎక్కువగా లాభించవు. కనుక మానడం మంచిది. ఇది మీకు మిశ్రమ ఫలితాల కాలం. మీ సహోద్యోగులతోను, ఇతరులతోను, వివాదాలు కలగవచ్చును. జలుబు, జ్వరం సోకగలదు. ఏ ప్రత్యేక కారణం లేకుండానే, మానసిక ఆందోళన కలగవచ్చును.