chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

అమర్త్య సేన్ 2024 జాతకము

అమర్త్య సేన్ Horoscope and Astrology
పేరు:

అమర్త్య సేన్

పుట్టిన తేది:

Nov 3, 1933

పుట్టిన సమయం:

10:40:0

పుట్టిన ఊరు:

Calcutta

రేఖాంశం:

88 E 20

అక్షాంశము:

22 N 30

సమయ పరిధి:

5.5

సమాచార వనరులు:

765 Notable Horoscopes

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

సూచించబడిన


సంవత్సరం 2024 సారాంశ జాతకం

ఈ రాశి వారిని విరోధులు మరియు వ్యతిరేకులు ఎదురుపడడానికి కూడా సాహసించరు. న్యాయపరమైన వివాదాలు మీకు అనుకూలంగా ఉంటాయి. పేరు, ప్రతిష్ఠ ధనలాభం ఇంకా ఆర్థికసంబంధ వ్యవహారాలలో విజయాలు మీ రు అనుభవిస్తారు. బంధువులు, సోదరుల నుండి మంచి సహకారం అందే సూచనలున్నాయి. మతపరంగా పవిత్ర స్థల దర్శనం చేస్తుండడం, ప్రజల సహాయం మీకు అందడం జరుగుతుంది. మీప్రయత్నాలు ఫలిస్తాయి, శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు.

Nov 3, 2024 - Dec 04, 2024

మీరు ఎంతో ఎత్తుకు ఎదగడానికి, వృత్తిలో రాణించడానికి ఈ కాలం యోగదాయకంగా ఉన్నది. వ్యాపార భాగస్వాములతోను, సహోద్యోగులతోను లాభసాటిగా ఉండే కాలం. జీవిత భాగస్వామితో అనురాగం సంతోషం కలుగుతుంది. వ్యాపార వాణిజ్యాలు మరియు విదేశీ ప్రయాణాల వలన లాభాలు కలగవచ్చును. ఆరోగ్య సంబంధమైన చికాకులు మీ మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తాయి. మీ క్రమశిక్షణ, స్వయం పర్యవేక్షణ, ఇంకా, మీ రోజువారీ దినచర్యలపై అదుపులు, బాగా ఉపయోగపడతాయి. జ్వరం, కీళ్ళనొప్పుల గురించి జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినే సూచనలున్నాయి.

Dec 04, 2024 - Dec 25, 2024

మీకు ఇది శారీరకంగాను మానసికంగాను అనుకూలమైన కాలం . మీ బంధువులకు ప్రత్యేకించి మీ సోదరులకి ఎదగడానికి మంచి సమయం. సఫలత ఖచ్చితమే కాబట్టి, మీ జీవితానికి సంబంధించిన ప్రయత్నాలు చెయ్యండి. వస్తు సంచయం కలుగుతుంది. మీ శతృవులెవరూ మీముందు కుప్పిగంతులు వేయలేరు. ఈ సమయంలో మీ కోరిన ది నెరవేరగలదు. విజేతగా నిరూపితమౌతారు.

Dec 25, 2024 - Feb 18, 2025

ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉండి పైకి ఎదుగుతారు. మీరు ఈ కాలంలో, దాంపత్య సౌఖ్యాన్ని పొందుతారు. పరపతిగల వారితో మీ పరిచయాలు తప్పక ఇంకా పెరుగుతాయి. మీ వైరివర్గం, మీవైపుకు కనీసం ఎదురుపడడానికి కూడా సాహసంచేయలేరు. సుదీర్ఘ ప్రయాణం ప్రయోజనకరం కాబోతున్నది. ప్రేమ, రొమాన్స్ వరంగా మారనున్నాయై. మీరొక నాయకునివలె, మీ శతృవులను గెలుస్తారు. చిన్నపాటి అనారోగ్యం కాన వస్తుంది. పిల్లలతో అనుబంధాలు బాగులేకపోయినా మిగతా కుటుంబ సంబంధాలు సంతృప్తికరంగా ఉంటాయి.

Feb 18, 2025 - Apr 07, 2025

ఆధ్యాత్మికంగా మీరు ఎంత అంకితమైతే, అంతగా మీ వ్యక్తిగత అవసరాలు నెరవేర్చుకోగలుగుతారు. ఇంకా, ఎంత గాఢంగా మీరు మీ తత్వ చింతన పరివర్తనని అంగీకరించగలిగిఉంటే, అంత శక్తివంతంగా , మీరు మీ అభివృద్ధికి అనుసంధించబడతారు. మీరు చేస్తున్న డిగ్రీ లేదా సర్టిఫికేట్ కోర్స్ ని పూర్తిచేస్తే, ఎంతో ప్రయోజనం పొందగలరు. మీ వ్యక్తిగత అభివృద్ధిలో గల గాఢమైన మార్పులను వ్యక్తపరచడానికి గల ఉత్సాహం చూపడానికి ఇదే మంచి సమయం. మీ పని సంబంధమైన లేదా సమాజ పరమైన ఉన్నతమైన నియమాలు విలువలను తెలియపరచడంలో సఫలమౌతారు. మీ దృక్పథం, ఆశావహంగా ఉంటుంది. ఈ సమయంలో, మీ శత్రువులు కష్టాలలో పడతారు. మీ పథకాలకు కార్యరూపం ఎప్పుడైతే తీసుకువస్తారో అప్పుడు, ఆదాయం వస్తుందని ఎదురు చూడవచ్చును. మీకు, ప్రభుత్వం, మంత్రివర్గం నుండి , లాభం కలుగుతుంది. పనిజరగడం కోసం, వారితో కలిసి పనికూడా చేయవచ్చును. వ్యాపారం విస్తరించడం, లేదా ఉద్యోగంలో పదోన్నతి రావడం జరుగుతుంది. కుటుంబ సౌఖ్యం తప్పక కలుగుతుంది.

Apr 07, 2025 - Jun 04, 2025

మొత్తంమీద ఈ కాలంలో, పైకి అంతా సాధారణంగా యావరేజి గా కానవస్తుంది. మీరు లాభాలకంటె నైపుణ్యాల పెంపుపై మీ దృష్టి పెట్టండి. ఈ సమయంలో స్వంత పనులు, చిన్న పాటి ఆరోగ్య సమస్యలు పనికి ఆటంకం కలిగించవచ్చును. సవాళ్ళు, క్రొత్త అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఎంచుకోవాలి. క్రొత్త ప్రోజెక్ట్ లను అసలు ఒప్పుకోకుండా, అవాయిడ్ చెయ్యండి. ఈ దశలో,పనికి ఇమడలేక, అక్కడ పోటీకి తట్టుకోలేక ఆటంకాలుగా అనిపిస్తాయి. భూమికొనుగోలుకానీ, యంత్ర పరికరాల్ కొనుగోలు కానీ కొంతకాలం వరకు వాయిదావెయ్యండి.

Jun 04, 2025 - Jul 26, 2025

ఇది మీకు మంచి యోగదాయకమైన కాలం. మీరు సాధించినదానిపట్ల ఎంతో తృప్తిని, మీకు కలిగిస్తుంది. ఈసమయంలో, మీరు జీవితాన్ని పూర్తి ఆశావహంగానూ, జీవకళ ఉట్టిపడుతూ గడుపుతారు. మీకు ప్రయాణానికి, చదువుకి, జీవితంలో ఎదగడానికి కావలసినంత అవకాశం దొరుకుతుంది. మీ రు మగవారైతే, స్త్రీ వలన, స్త్రీఅయితే పురుషునివలన మీ పరిధిలో, ఉపకారం పొందుతారు. మీకు లభించవలసిన గౌరవంఅంతటి స్థాయిలోనూ,మీకు లభ్యమౌతుంది. జీవితం మరింత స్థిరపడుతుంది. స్పెక్యులేషన్ వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. స్థలం లేదా వాహనం పొందే అవకాశం ఉన్నది. .

Jul 26, 2025 - Aug 16, 2025

వృత్తిలోను, వ్యక్తిగతంగాను ఆటంకాలు ఎదురౌతాయి. కష్టకాలాన్ని తెలివితోను, నిదానంగాను ఎదుర్కొనండి. ఏమంటే, ఈ సమయంలో కఠినంగా ర్యాష్ గా ఉండడం వలన ఏమీ సహాయం జరగదు. ప్రయాణం అనుకూలించదు. కనుక మానడానికి ప్రయత్నిఛండి. మీ కుటుంబం వైపునుండి పూర్తి సపోర్ట్, ఉండదు. సమర్థించరు. సంతాన సమస్యలు ఉంటాయి. మీ శతృవులు మీకు హాని కలిగించగల ఏరాయిని విసరకుండా వదలరు. మీరు ధైర్యంగా స్థైర్యంగా ఉండడం, మీ సవ్యమైన నిర్ణయాలకు కట్టుబడి ఉండడం మంచిది. పొట్టకు సంబంధించి, అసౌకర్యం కొంత ఆందోళనకు దారితీస్తుంది.

Aug 16, 2025 - Oct 16, 2025

మీ తెలివికి, పరిజ్ఞానానికి సృజనాత్మకతకు ఇది శక్తినినిరూపించుకునే కాలం. మీకు చాలా ఆహ్లాదకరంగా అనిపించడంతో, మీ పనిని కళాత్మకంగా భావిస్తారు. క్రొత్త ఆలోచనలు చేస్తారు. పరిచయాలు, సంబంధాలు మరెన్నోఅవకాశాలను తెచ్చి, విస్తృతికి కారణమౌతాయి. ధైర్యంతో చేపట్టిన చర్యలు మీ తెలివికి తోడై, మీకు ఆదాయాన్నిస్తాయి. అంతే స్థాయిలో ఆధ్యాత్మికతను కలిగిస్తాయి. కుటుంబంలో సామరస్యత నెలకొంటుంది. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చును. ఇల్లుకట్టడం, వాఅనం కొనుగోలు, జరగవచ్చును. మీకిది చాలా ఆశాజనకమైన కాలం.

Oct 16, 2025 - Nov 03, 2025

మీరు ఏది చేపట్టినా విజయం సాధిస్తారు. మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. మీరు కష్టాలన్నిటినీ దాటెస్తారు. మీ శతృవులు ఓటమిని ఎదుర్కొంటారు. మీ కు ప్రమోషన్ రావచ్చును. గౌరవాన్ని, మంచి కీర్తిని పొందుతారు. వ్యాజ్యాలు గెలుస్తారు. మొత్తంమీద విజయవంతమైన కాలం. వాపులు, కంటిసంబంధ సమస్యలనుండి కాస్త జాగ్రత్త పడవలసిఉంది. తల్లికి లేదా అత్తవారి తరఫు బంధువులు ఎవరికేనా అనారోగ్యం కలగవచ్చును.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer