మీకు విభిన్న జీవితమార్గాల నుండి ప్రశంసలు , పతకాలు లభించడానికి మీ తెలివితేటలు సహాయపడతాయి. మీరు వృత్తిలోను, వ్యాపారంలోను బాగా రాణిస్తారు. కుటుంబంలో పసిబిడ్డ జన్మించడంతో మీకు సంతోషం కలగడమే కాక, కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ సమయం మీకు మంచి జ్ఞానం, మతవిషయాల బోధలు దొరకడాన్ని సూచిస్తున్నది. ఇక మీరు మత సంబంధమైన లేక వినోదాత్మక ప్రయాణాలు చేస్తారు. పాలకులనుండి, మీ పై అధికారులనుండి, గౌరవాన్ని పొందుతారు.
Jan 1, 2023 - Feb 01, 2023
ఎంతో విజయవంతమైన కాలం అనుకూలమై భవిష్యత్తులో ఎదురు చూస్తున్నది. సృజనాత్మకతదృక్పథం, అదనపు ఆదాయానికిఅవకాశాలు ఎదురువస్తున్నాయన్నమాటే. మీరు మీ సీనియర్లతోను, సూపర్ వైజర్లతోను సత్సంబంధాలను కలిగి ఉంటారు.మీ ఆదాయంలో చెప్పుకోదగిన పెరుగుదలకనిపిస్తుంది. వ్యాపారం,అలాగే కీర్తి కూడా వృద్ధి చెందుతాయి.మొత్తంమీద,ఈ దశమీకు అనుకూలమనే చెప్పవచ్చును.
Feb 01, 2023 - Feb 22, 2023
మీ పై అధికారులనుండి లేదా బాధ్యతాయుతమైన లేదా పరపతిగల వ్యక్తుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. వృత్తిపరంగా మీరు రాణిస్తారు. ఉద్యోగంలోను, కుటుంబంలోనుకూడా ముఖ్యమైన బాధ్యతలను స్వీకరించవలసి ఉంటుంది. అలాగే, మీ ఉద్యోగజీవితంలో, నిష్ణాతులైనవారిని మీ ప్రయాణ సమయాలలో కలిసే చక్కటి అవకాశం వస్తుంది. మీరు విలువైన లోహాలు, రత్నాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ సంతానానికి ఈ సమయంలో మీ ప్రత్యేక శ్రద్ధ అవసరమౌతుంది.
Feb 22, 2023 - Apr 18, 2023
ఈ సమయం మీకు అన్నివిధాలా (నిలువుగా) ఎదగడానికి కెరియర్ లో ఎదగడానికి ఒక చక్కని సోపానం లేదా మెట్టు గా అద్భుతంగా పనికివస్తుంది. వ్యాపార భాగస్వాములతోను, సహోద్యోగులతోను లాభసాటిగా ఉండే కాలం. అన్యాయంగా ఆర్జించడానికి మీరు మొగ్గుచూపవచ్చును. అప్పుడు మీ క్రమశిక్షణ, స్వయం పర్యవేక్షణ, ఇంకా, మీ రోజువారీ దినచర్యలపై అదుపులు, బాగా ఉపయోగపడతాయి. ఆరోగ్య సంబంధమైన చికాకులు మీ మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తాయి
Apr 18, 2023 - Jun 05, 2023
ఈ దశ మీకు, అన్ని పెత్తనాలను తప్పనిసరిగా తేనున్నది. ఒక విదేశీ పరిచయం, లేదా సంబంధం, మీకు ఉపయోగపడనున్నది. వారు, మీరు ఎంతోకాలంగా పొందడానికై తపన పడినట్టి స్థాయి, అధికారం మరియు అనుకోని విధంగా చక్కని ఆదాయం కలగడానికి మూలకారణం అవుతారు. మీరు స్వ శక్తిని నమ్మడం, అదే భావనని కొనసాగించండి. ఈ ఏడాది, మిమ్మల్ని సంపూర్ణంగా ఒక క్రొత్త స్థాయిని అందుకునేలా చేస్తుంది. కుటుంబ వాతావరణం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూర ప్రయాణం ప్రయోజనకరం కాగలదు. మతంపట్ల మీరు ఇష్టాన్ని చూపడం , తత్సంబంధ దానాది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.
Jun 05, 2023 - Aug 02, 2023
ఆటంకాలతో మీ ఈ దశ మొదలవుతున్నది. దానికి కారణం, మీ పని ప్రదేశంలో గల పోటీ కారణంగా తెలెత్తిన వత్తిడులు . ఈ పరిస్థితులని నెట్టుకురావడానికి మీరు మరింత సరళతనుపాటించాలి. క్రొత్త ప్రాజెక్ట్ లు, రిస్క్ లు మానాలి. వివాదాలు, లేదా ఉద్యోగమార్పు ఆలోచన మానాలి. మీ మాట తీరు, కమ్యునికేషన్ లని సానుకూల (పాజిటివ్) దృక్పథంతో తోను, అహింసాయుతంగానుఉంచుకోవాలి. దీనివలన మాట, వ్రాత పలుకులవలన కలిగే ఇబ్బందులను అధిగమించవచ్చును. ఇతర స్త్రీ పురుషులతోమీకుసత్సంబంధాలు ఉండవు. జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కలత పెడుతుంది. వీలైనంతవరకు అనవసరమైన ప్రయాణాలు మానాలి. మీరు అనుకోని విచారాలు, నిరాధారమైన నీలాపనిందలు కూడా ఎదుర్కోవలసి రావచ్చును
Aug 02, 2023 - Sep 23, 2023
ఆరోగ్య సమస్యలతో బాధ పడతారు. మీ వద్ద డబ్బును నిలవ ఉంచుకోవడం కష్టమే అవుతుంది. ఏమంటే, మీకు విలాసాలకు, సుఖ సంతోషాలకోసం డబ్బును ఖర్చు పెట్టేసే గుణం ఉన్నది. ఈ సమయంలో మీరు స్పెక్యులేషన్లకు, విరివిగా ఖర్చుపెట్టడం తగదు. చిన్నపాటి తగాదాలు, అపార్థాలు, ఇంకా వాదనలు మీ కుటుంబ వాతావరణాన్ని, దాని ప్రశాంతతను దెబ్బతీస్తాయి. మీరంటే అసూయ ఉన్నవారు, సమస్యలను సృష్టిస్తారు. దాంతో, కుటుంబంలో నీలాపనిందలను, అసంతోషాన్ని ఎదుర్కొనాల్సి వస్తుంది. అటువంటివారిపట్ల జాగ్రత్త వహించండి. స్త్రీలవలన సమస్యలు రావచ్చును, హెచ్చరికగా ఉండడం అవసరం.
Sep 23, 2023 - Oct 14, 2023
ప్రయాణ అభిలాష ఉండడం వలన కొంత వరకు మీ ప్రయాణపు సరదా వలన కలిగిన అలసట ఉంటుంది. మీకు ఒకమూల ఉండిపోవడం ఇష్టం ఉండదు. దాంతో అలసట తప్పదు. మీ ఆలోచనల్ మతంవైపుకు మరలడంతో పుణ్య క్షేత్ర దర్శనం చేయగలరు. ఈ దశలో కెరీయర్ గురించి మీకు మార్పు(వొలాటిలిటీ,) , వత్తిడిలతో ఉంటుంది. మీ స్వంత మనుషులతోను, బంధువర్గంతోను, అనుబంధాలు కొంచెం పాడవుతాయి. రోజువారీ పనులు బాధ్యతలగురించి సరైన శ్రద్ధపెట్టండి. మీ కుటుంబ సభ్యుల అంచనాల మేరకు మీరు సంతృప్తి పరచలేరు. ఏ విధమైన వ్యాపార లావాదేవీల లోను మీరి చేయిపెట్టవద్దు. మీ అమ్మగారికి ఇది పరీక్షా సమయం.
Oct 14, 2023 - Dec 14, 2023
మీ తెలివికి, పరిజ్ఞానానికి సృజనాత్మకతకు ఇది శక్తినినిరూపించుకునే కాలం. మీకు చాలా ఆహ్లాదకరంగా అనిపించడంతో, మీ పనిని కళాత్మకంగా భావిస్తారు. క్రొత్త ఆలోచనలు చేస్తారు. పరిచయాలు, సంబంధాలు మరెన్నోఅవకాశాలను తెచ్చి, విస్తృతికి కారణమౌతాయి. ధైర్యంతో చేపట్టిన చర్యలు మీ తెలివికి తోడై, మీకు ఆదాయాన్నిస్తాయి. అంతే స్థాయిలో ఆధ్యాత్మికతను కలిగిస్తాయి. కుటుంబంలో సామరస్యత నెలకొంటుంది. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చును. ఇల్లుకట్టడం, వాఅనం కొనుగోలు, జరగవచ్చును. మీకిది చాలా ఆశాజనకమైన కాలం.
Dec 14, 2023 - Jan 01, 2024
మీరు ఏది చేపట్టినా విజయం సాధిస్తారు. మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. మీరు కష్టాలన్నిటినీ దాటెస్తారు. మీ శతృవులు ఓటమిని ఎదుర్కొంటారు. మీ కు ప్రమోషన్ రావచ్చును. గౌరవాన్ని, మంచి కీర్తిని పొందుతారు. వ్యాజ్యాలు గెలుస్తారు. మొత్తంమీద విజయవంతమైన కాలం. వాపులు, కంటిసంబంధ సమస్యలనుండి కాస్త జాగ్రత్త పడవలసిఉంది. తల్లికి లేదా అత్తవారి తరఫు బంధువులు ఎవరికేనా అనారోగ్యం కలగవచ్చును.