ఇది మీకు బహు అనుకూలమైన కాలం, పట్టినది బంగారమయ్యే కాలం అంటే, ఇక మీరు కార్యోన్ముఖులు కావలసిన(పని చేయవలసిన కాలం). వివిధ రంగాల నుండి అనుకోని విధంగా బహుమతులు, లాభాలు వచ్చి పడిపోతుంటాయి. ఇది మీకు మరింత మెరుగైన కెరియర్ ను , సర్వతో ముఖాభివృద్ధిని అందిస్తుంది. మీ వ్యతిరేకులు, మీ దారిలో ఎదురుపడడానికి కూడా సాహసించరు. ఇక మీ వంతుగా తగినవిధంగా ఆకర్షణను, కీర్తిని పొందుతారు. పాలకుల నుండి, మీ పై అధికారులనుండి, ఉన్నతాధికారులనుండి, అభిమానాన్ని చూరగొంటారు.మీకుచక్కని ఆరోగ్యం, శరీర సౌష్టవం ఉంటాయి. ఈ ఏడాది మీకు, వాహన ప్రాప్తి కూడా సూచిస్తున్నది.
Oct 28, 2025 - Nov 19, 2025
వృత్తిపరంగా కొన్ని సందర్భాలలో స్థంభన ఏర్పడినప్పుడు, అనవసరమైన మానసిక వత్తిడికిగురి కాకుండా రిలాక్స్ అవడం నేర్చుకోవాలి. ఉద్యోగాలు మారిపోతూ ఉండాలన్న వాంఛను ఎదిరించి నిలవండి. అవి, నిరాశ, లేదా నిస్పృహ వలన కలగవచ్చును. అజాగ్రత్త లేదా నిర్లక్ష్యం వలన జరిగే ఆందోళనలు, మరియు అనవసర సమస్యలు కారణంగా తలెత్తే ఆందోళనలు మరియు, చికాకుపరిస్థితులకు దారితీసే కాలమిది. గాయాలు, యాక్సిడెంట్ లు వలన ఆరోగ్యం పట్ల తక్షణ శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. కుటుంబ జీవితంలో అసాధారణ చికాకులు కలగవచ్చును. అలాగే మీరు సెక్స్ రోగాలపట్ల జాగ్రత్తవహించాలి.
Nov 19, 2025 - Jan 12, 2026
ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉండి పైకి ఎదుగుతారు. మీరు ఈ కాలంలో, దాంపత్య సౌఖ్యాన్ని పొందుతారు. పరపతిగల వారితో మీ పరిచయాలు తప్పక ఇంకా పెరుగుతాయి. మీ వైరివర్గం, మీవైపుకు కనీసం ఎదురుపడడానికి కూడా సాహసంచేయలేరు. సుదీర్ఘ ప్రయాణం ప్రయోజనకరం కాబోతున్నది. ప్రేమ, రొమాన్స్ వరంగా మారనున్నాయై. మీరొక నాయకునివలె, మీ శతృవులను గెలుస్తారు. చిన్నపాటి అనారోగ్యం కాన వస్తుంది. పిల్లలతో అనుబంధాలు బాగులేకపోయినా మిగతా కుటుంబ సంబంధాలు సంతృప్తికరంగా ఉంటాయి.
Jan 12, 2026 - Mar 02, 2026
మీ తల్లి తండ్రుల వద్ద నుండి పొందిన సంస్కారం తెలిసినందువలన మీ కుటుంబంతో గాడమైన సంబంధాన్ని, ఉద్వేగభరితమైన బంధాన్ని కొనసాగించాలని అభిలషిస్తారు. కుటుంబంలో మిత్రత, సామరస్యం నిశ్చయం. మీకుగల ఉన్నత వ్యక్తిత్వ విలువలు, ఆదర్శవంతమైన జీవితం, అనే అనే కేవలం కొన్ని కారణాలవలన ఇతరులను ఆకర్షిస్తారు. ఎన్నో కానుకలు, ఆశీస్సులు పొందుతారు. మీకుగల అత్యధిక శక్తి, మీ వ్యక్తిగత సంబంధాలు, భాగస్వామ్యాలకు ఎంతో మహత్వాన్ని ఆపాదిస్తాయి. మీ జీవితంలో సంభవించే మార్పులను మీరు గాఢంగా సుదీర్ఘ కాలం నిలుస్తాయి. ఉన్నతాధికారుల పరిచయంలోకి వస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ బండిని మరింత లాభానికే లేదా మరొక మంచిదానికోసం అమ్మేసెయ్యవచ్చును.
Mar 02, 2026 - Apr 29, 2026
ఇది మీకు అంత సంతృప్తికరమైన కాలం కాదు. ఆర్థికంగా మీకు నష్టాలు కలగవచ్చును. వ్యాజ్యాలవలన, వివాదాలవలన, డబ్బు నష్టపోయే అవకాశమున్నది. వైఫల్యాలు మిమ్మల్నినిరాశకు గురి చేస్తాయి. పని వత్తిడికి మీరు అలసిపోతారు. కుటుంబ విషయాలు కూడా ఆందోళన కారణం కావచ్చును. క్రొత్త వ్యాపార రీత్యా రిస్క్ గల వ్యవహారాలు మానండి.. ఎందుకంటే నష్టాల కాలమిది. సమయం మీకు అనుకూలంగా లేదు. శతృవులు మీ ప్రతిష్టదెబ్బ తీయ చూస్తారు. ధననష్టం కూడా సహజం
Apr 29, 2026 - Jun 19, 2026
ఏది ఏమైనా మీరు మరీఅంతగా అదృష్టంకోసం అర్రులు చాచడం మానాలి. మీ డబ్బు వివిధ రీతులలో చిక్కుకుపోవడం వలన మీకు ఆర్థికంగా గొప్ప ఇబ్బంది కలగవచ్చును. ఆరోగ్య సమస్యకూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చును. ప్రత్యేకించి మీరు దగ్గు, కఫ సంబంధ సమస్యలు, కంటి కలకలు, వైరల్ జ్వరం సోక వచ్చును. బంధువులు, స్నేహితులు, లేదా సహచరులతో వ్యవహరించేటప్పుడు, కాస్త జాగ్రత్త వహించండి. ప్రయాణాలు ఫలవంతం కాకపోవచ్చును. కనుక వీలైనంతవరకు తప్పించుకొండి. చిన్న విషయాలు కూడా, గొడవలకి దారితీయవచ్చును. అజాగ్రత్త వలనలేదా, నిర్లక్ష్యం కారణంగా ఈ సమయం మీకు, సమస్యలను చీకాకు పుట్టించే పరిస్థితులను తీసుకురావచ్చును. ప్రయాణాలు మానాలి. .
Jun 19, 2026 - Jul 11, 2026
వృత్తిలోను, వ్యక్తిగతంగాను ఆటంకాలు ఎదురౌతాయి. కష్టకాలాన్ని తెలివితోను, నిదానంగాను ఎదుర్కొనండి. ఏమంటే, ఈ సమయంలో కఠినంగా ర్యాష్ గా ఉండడం వలన ఏమీ సహాయం జరగదు. ప్రయాణం అనుకూలించదు. కనుక మానడానికి ప్రయత్నిఛండి. మీ కుటుంబం వైపునుండి పూర్తి సపోర్ట్, ఉండదు. సమర్థించరు. సంతాన సమస్యలు ఉంటాయి. మీ శతృవులు మీకు హాని కలిగించగల ఏరాయిని విసరకుండా వదలరు. మీరు ధైర్యంగా స్థైర్యంగా ఉండడం, మీ సవ్యమైన నిర్ణయాలకు కట్టుబడి ఉండడం మంచిది. పొట్టకు సంబంధించి, అసౌకర్యం కొంత ఆందోళనకు దారితీస్తుంది.
Jul 11, 2026 - Sep 10, 2026
మీరు ప్రయత్నించే వ్యక్తిగత సంబంధాలు అంతగా ఫలవంతంకావు పైగా, ఇంటా బయటా పనిచేసే చోట కొంతవరకు చికాకులకు దారితీయవచ్చును. మీ ఆరోగ్యం కోసం జాగ్రత్తను వహించండి. అలాగే మీ ప్రతిష్ట.ను మెరుగు పరుచుకోచూడండి. ఇంద్రియపరమైన (సెన్స్యుఅల్) ఆలోచనలు నిరాశ పరచడమే కాక కొంత అవమానకరంకూడా. ఇతర స్త్రీపురుషులతో సామరస్య ధోరణి కొంత తగ్గవచ్చును. మీ జీవితంలో మీ ఆరోగ్య సమస్యలు కొంత అస్తవ్యస్తతను కలగచేయవచ్చును. అనవసర ఖర్చులకు పాల్పడే అవకాశమున్నది. మొత్తంమీద ఇది మీకు అంతగా సంతోషదాయక కాలం కాదు. శారీరకంగా మీకు నీరసంగా నిస్పృహగా అనిపిస్తుంది.
Sep 10, 2026 - Sep 28, 2026
ఇది మీకు బహు కష్ట కాలం. మీ అదృష్టం మీకు వ్యతిరేకమౌతున్నట్లుంది. మీ వ్యాపార భాగస్వాములు మీకు బహు సమస్యలను సృష్టిస్తారు. మీ వ్యాపార సంబంధ ప్రయాణాలు లాభించకపోవచ్చును. ఇంటి విషయాలలో, మీ తీవ్ర స్వభావాన్ని అదుపులో ఉంచుకొనండి. ఆవిధంగా ఇబ్బందికర పరిస్థితులనుండి తప్పించుకొనవచ్చును. భాగస్వామి అనారోగ్యం, చీకాకులకు కారణం కావచ్చును. మీరు కూడా అనారోగ్యం, మానసిక వత్తిడులకు గురి అయే అవకాశం ఉన్నది. మీకు కూడా, తల, కంటి సంబంధ, పాదాలకు, చేతులకు సంబంధించిన సమస్యలు కలగవచ్చును.
Sep 28, 2026 - Oct 28, 2026
కుటుంబంలో చక్కని సామరస్యత, అవగాహనలతో అనుకూల వాతావరణం కానవస్తున్నది. మీ జ్ఞానాన్ని పెంచుకుని, మీ సహోద్యోగులనుండి కొంత నేర్చుకోవడానికిమనుకూలసమయం. స్నేహితులతోను, విదేశీయులతోను, మంచి సంబంధాలు నెరిపితే ఫలవంతమౌతాయి. ఇది స్థలాలు పొందడానికి వేళ కావచ్చును. దానధర్మాలు చేయగలరు. మీ సంతానంకూడావిజయాలు సాధించి,మీకుఆనందాన్ని కలిగించగలరు. బహు చక్కనిజీవితం మీకోసం భవిష్యత్తులో ఎదురు చూస్తున్నది.