ఈ రాశి వారిని విరోధులు మరియు వ్యతిరేకులు ఎదురుపడడానికి కూడా సాహసించరు. న్యాయపరమైన వివాదాలు మీకు అనుకూలంగా ఉంటాయి. పేరు, ప్రతిష్ఠ ధనలాభం ఇంకా ఆర్థికసంబంధ వ్యవహారాలలో విజయాలు మీ రు అనుభవిస్తారు. బంధువులు, సోదరుల నుండి మంచి సహకారం అందే సూచనలున్నాయి. మతపరంగా పవిత్ర స్థల దర్శనం చేస్తుండడం, ప్రజల సహాయం మీకు అందడం జరుగుతుంది. మీప్రయత్నాలు ఫలిస్తాయి, శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు.
Apr 20, 2025 - May 20, 2025
ఎంతో విజయవంతమైన కాలం అనుకూలమై భవిష్యత్తులో ఎదురు చూస్తున్నది. సృజనాత్మకతదృక్పథం, అదనపు ఆదాయానికిఅవకాశాలు ఎదురువస్తున్నాయన్నమాటే. మీరు మీ సీనియర్లతోను, సూపర్ వైజర్లతోను సత్సంబంధాలను కలిగి ఉంటారు.మీ ఆదాయంలో చెప్పుకోదగిన పెరుగుదలకనిపిస్తుంది. వ్యాపారం,అలాగే కీర్తి కూడా వృద్ధి చెందుతాయి.మొత్తంమీద,ఈ దశమీకు అనుకూలమనే చెప్పవచ్చును.
May 20, 2025 - Jun 10, 2025
కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగించవచ్చును. ప్రయాణాలు కలిసిరావు కనుక మానవలసింది. అనవసర ఖర్చులు అవుతాయి కనుక జాగ్రత్త గా ఉండాలి. స్నేహితులతోను, సహచరులతోను జాగ్రత్త, కొన్నిసార్లు, మీ న్యాయ నిర్ణయం,విచక్షణ సరిగా ఉండకపోవచ్చును. అగ్ని వలన కానీ, స్త్రీల వలనగానీ గాయపడవచ్చును. హృదయ సంబంధ సమస్యలు తలెత్తవచ్చును కనుక, ఆరోగ్య విషయమై జాగ్రత్త చూపాలి.
Jun 10, 2025 - Aug 04, 2025
ఈ ఏడాది మీరు నష్టాల భర్తీకి క్రొత్త ఆలోచనలు చేస్తారు. కానీ అవి నష్టాలకే దారితీస్తాయి. ఏమంటే, వ్యయంకూడా స్థిరంగా పెరుగుతూ వస్తున్నది. ఇది దీర్ఘకాలంలో నేరుగా అంత లాభసాటికాదు. శత్రువులనుండి, న్యాయ పరమైన సమస్యలు కలగవచ్చును. అయితే మీరు, ఉన్నచోటు నుండే నిరాడంబరంగా ఉంటూ, మీ స్థిరత్వాన్ని పైకి కనపడనివ్వండి. అయితే ఈ ఔట్ లుక్ కొద్దికాలమే పనిచేస్తుంది. మధ్యస్థం మరియు దీర్ఘకాల ప్రోజెక్ట్ లు ఒప్పుకోవడం మొదలుపెట్టడం మంచిది. మీ కంటికి సంబందించిన సమస్యలుండవచ్చును. ఇతర స్త్రీ పురుషులుల తో హార్థికమైన సంబంధాలు త్వరితంగా ఆర్థిక ప్రయోజనాలను ఇస్తాయా అని పరిశీలించుకోవడం ముఖ్యం. మీ గర్ల్ / బాయ్ ఫ్రెండ్ వలన సమస్య రావచ్చును.
Aug 04, 2025 - Sep 22, 2025
మీకు సహాయం అందించడంలో ఇతరులనుండి గట్టి ప్రభావం ఉంటుంది. ఇది మీ భౌతిక అవసరాలను నెరవేర్చడము, అలాగే, మీకు మరింత వ్యక్తిగత రక్షణ కల్పించడం జరుగుతుంది. డబ్బు ఖచ్చితంగా మీకు చేకూరుతుంది, మీ వ్యక్తిగత విశ్వాసాలను, కలలను, మరియు తత్వ విచారాలను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వం, మరియు ఉన్నత అధికారులచే గుర్తింపు పొందుతారు. మీరు స్నేహశీలత కలిగి ఉంటారు,అలాగే, వివిధ సామాజిక పరిస్థితులలో, అవసరమయే సంఘంలోని వివిధ వ్యక్తులతో పరస్పర సద్భావనలు చూపి గ్రూప్ డైనమిక్స్ చూపడాన్ని చాలా సౌకర్యవంతమైన ఎంజాయ్ మెంట్ గా తీసుకుంటారు; కాకపోతే అనారోగ్య సమస్య మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది. బాహ్యంగా కంటే, అంతర్గత మార్పు, పరివర్తన ఎంతో అవసరం.
Sep 22, 2025 - Nov 19, 2025
దీర్ఘ కాల స్నేహాలకు, బంధుత్వాలు మొదలవడానికి ఇది అత్యుత్తమ కాలం కాదు. కొన్ని వృత్తిపరమైన , వ్యక్తిగతమైన అంశాలు కొంత ఆందోళనకు కారకం కావచ్చును. అయినా నిరాశ కంటే ఆశావహ దృక్పథం మంచిది. మీప్రేమ భావనలకు సంతృప్తికరంగా ఉండవు. ప్రేమవ్యవహారాలలో సంతోషందొరకదు. సంతానం కలగటం ఇంట్లోసంతోషం కలిగించగలదు. క్రొత్త సంబంధాలు వివాదాస్పదమయ్యే అవకాశం కొంతవరకు ఉత్పన్నమయేఅవకాశం ఉన్నది. గాలివలన, చల్లదనం వలన కొంత అనారోగ్యం కలిగే అవకాశంఉన్నది. ఈ దశ ఆఖరున , చక్కని మానసిక స్థిరత్వం కానవస్తుంది.
Nov 19, 2025 - Jan 09, 2026
ఈ ఏడాది మీకు పనిభారం పెరిగినా ప్రశంసలు, వృత్తిపరంగా రాణించడంతో యోగిస్తుంది. మీరు మనసుపెట్టి చేసిన పనులు లాభించి విజయాలను సాధించిపెట్టే ఉత్తమమైన కాలమిది. కుటుంబసభ్యుల సహకారం అందుతుంది. కీర్తి పొందుతారు. వృత్తిపరంగాగొప్ప అభివృద్ధి కానవస్తుంది. మీ శతృవులను అధిగమిస్తారు. అందరితోనూసత్సంబంధాలు కొనసాగిస్తారు.
Jan 09, 2026 - Jan 31, 2026
ఇది మీకు మిశ్రమ కాలం. ఈ సమయంలో, మీరు మానసిక వత్తిడిని, అలసటను ఎదుర్కొంటారు. మీ వ్యాపార రీత్యా భాగస్వాములతో సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఈ సమయం మంచిదికాదు. ప్రయాణాలు సఫలం కావు. మీకు అతి దగ్గరివారితో భేదాభిప్రాయాలు రావచ్చును కనుక, ఇటువంటి పరిస్థితుల నుండి తప్పించుకొండి. రిస్క్ లు తీసుకునే బుద్ధిని త్రుంచి, మానుకోవాలి.ఏదిఏమైనా, ఇదిప్రేమకు , రొమాన్స్ కు సరైన సమయం కాదు. మీరు ప్రేమ మరియు, సంబంధాలలో అతి జాగ్రగా ఉండాలి, లేకుంటే, అవి మీకు అగౌరవాన్ని కలిగించి, ఇంకా మన్ననను కూడా పోగొడతాయి
Jan 31, 2026 - Apr 02, 2026
ఈ దశ మీకు ఎన్నోకారణాలవలన అత్యుత్తమ యోగదాయకం. ఎన్నో విషయాలు వాటంతట అవే పరిష్కరింపబడి సఫలం అయేటంతగా ఉండే మీ స్నేహశీలత అద్భుతం. మీ ఇంటికి సంబంధించిన అన్ని విషయాలను ఖచ్చితమైన పరిధిలలో సానుకూలమై పోతుంటాయి. ఈ కాలంలో మీ కుతూహలం, గాఢమైన ఇచ్ఛ మీ పనితనాన్ని ఎప్పటికంటె అత్యున్నతంగా చూపెడతాయి. ఉన్నత వర్గాల సహకారం అందుతుంది. మీ పదవిలో ఉన్నతి కలుగుతుంది. మీ శత్రువులను ఓడించడం జరుగుతుంది. మీ కుటుంబ సభ్యులు మరియు, బంధువుల అనుకూలత మీకు లభిస్తుంది. మీ చుట్టూరా, ఆహ్లాదకరమైన పరిస్థితులు కానవస్తాయి.
Apr 02, 2026 - Apr 20, 2026
చికాకుల సంసారానికి, మరింత శ్రద్ధ, జాగ్రత్త అవసరమౌతాయి. కుటుంబ విషయాలు, టెన్షన్ లను రెండింటినీ నెట్టుకుని రావడం కొంత కష్టమే. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. కుటుంబంలో ఒకరు మరణించవచ్చును. భారీగా ఆర్థిక నష్టాలు, ఆస్తి కోల్పోవడం ఉండవచ్చును. ఆర్థిక విషయాల పట్ల శ్రద్ధను వహించాలి. నోటి మరియు కంటి బాధలు, సమస్యలకు కారణం కావచ్చును.