మీరు అభివృద్ధిని, సౌఖ్యాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. మీ కోరికలన్నీ నెరవేరి, సంతృప్తికరమైన జీవితం పొందే అత్యున్నత స్థితి రానున్నది. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతూనే ఉంటాయి. మీరు, ప్రమోషన్ కానీ, హోదా మెరుగు కావడం కానీ జరుగుతుంది. మీరు మంత్రివర్యుల నుండి, ప్రభుత్వం నుండి అభిమానం పొందుతారు. మీరు మీ బంధువులకు, సమాజానికి ఉపకారం చేస్తారు.
Feb 5, 2026 - Apr 01, 2026
ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉండి పైకి ఎదుగుతారు. మీరు ఈ కాలంలో, దాంపత్య సౌఖ్యాన్ని పొందుతారు. పరపతిగల వారితో మీ పరిచయాలు తప్పక ఇంకా పెరుగుతాయి. మీ వైరివర్గం, మీవైపుకు కనీసం ఎదురుపడడానికి కూడా సాహసంచేయలేరు. సుదీర్ఘ ప్రయాణం ప్రయోజనకరం కాబోతున్నది. ప్రేమ, రొమాన్స్ వరంగా మారనున్నాయై. మీరొక నాయకునివలె, మీ శతృవులను గెలుస్తారు. చిన్నపాటి అనారోగ్యం కాన వస్తుంది. పిల్లలతో అనుబంధాలు బాగులేకపోయినా మిగతా కుటుంబ సంబంధాలు సంతృప్తికరంగా ఉంటాయి.
Apr 01, 2026 - May 19, 2026
మీకు సహాయం అందించడంలో ఇతరులనుండి గట్టి ప్రభావం ఉంటుంది. ఇది మీ భౌతిక అవసరాలను నెరవేర్చడము, అలాగే, మీకు మరింత వ్యక్తిగత రక్షణ కల్పించడం జరుగుతుంది. డబ్బు ఖచ్చితంగా మీకు చేకూరుతుంది, మీ వ్యక్తిగత విశ్వాసాలను, కలలను, మరియు తత్వ విచారాలను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వం, మరియు ఉన్నత అధికారులచే గుర్తింపు పొందుతారు. మీరు స్నేహశీలత కలిగి ఉంటారు,అలాగే, వివిధ సామాజిక పరిస్థితులలో, అవసరమయే సంఘంలోని వివిధ వ్యక్తులతో పరస్పర సద్భావనలు చూపి గ్రూప్ డైనమిక్స్ చూపడాన్ని చాలా సౌకర్యవంతమైన ఎంజాయ్ మెంట్ గా తీసుకుంటారు; కాకపోతే అనారోగ్య సమస్య మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది. బాహ్యంగా కంటే, అంతర్గత మార్పు, పరివర్తన ఎంతో అవసరం.
May 19, 2026 - Jul 16, 2026
ఇది మీకు అంత సంతృప్తికరమైన కాలం కాదు. ఆర్థికంగా మీకు నష్టాలు కలగవచ్చును. వ్యాజ్యాలవలన, వివాదాలవలన, డబ్బు నష్టపోయే అవకాశమున్నది. వైఫల్యాలు మిమ్మల్నినిరాశకు గురి చేస్తాయి. పని వత్తిడికి మీరు అలసిపోతారు. కుటుంబ విషయాలు కూడా ఆందోళన కారణం కావచ్చును. క్రొత్త వ్యాపార రీత్యా రిస్క్ గల వ్యవహారాలు మానండి.. ఎందుకంటే నష్టాల కాలమిది. సమయం మీకు అనుకూలంగా లేదు. శతృవులు మీ ప్రతిష్టదెబ్బ తీయ చూస్తారు. ధననష్టం కూడా సహజం
Jul 16, 2026 - Sep 06, 2026
ఆదాయ పరిస్థితి మరియు బ్యాంక్ బ్యాలెన్స్ మెరుగుపడతాయి. క్రొత్త ప్రయత్నాలు చేయడానికి ఇది మంచి కాలం. ఈ సంధికాలంలేదా మార్పు క్రొత్త పరిచయాలకు, బంధుత్వాలకు సూచిస్తున్నది. తద్వారా లాభించవచ్చుకూడా. ఇంతకుముందరి పనులు, క్రొత్తగా మొదలెట్టిన పనులు అన్నీ కోరుకున్న రీతిలోనే శుభ ఫలితాలను సమకూర్చడమే కాకుండా మీ బహుకాల స్వప్నాలన్నీ ఫలిస్తాయి. పైఅధికారులు, లేదా బాధ్యతగల, పరపతిగల వ్యక్తుల పదవులలోగల వ్యక్తులనుండి సహాయం అందుతుంది. ఈ రోజుల్లో అన్నివిధాలా అభివృద్ధి కానవస్తున్నది. మీరు, మీ జీవిత భాగస్వామితో సంబంధాలపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అలాగే, హెచ్చరికగా ఉండడం అవసరం.
Sep 06, 2026 - Sep 27, 2026
వృత్తిలోను, వ్యక్తిగతంగాను ఆటంకాలు ఎదురౌతాయి. కష్టకాలాన్ని తెలివితోను, నిదానంగాను ఎదుర్కొనండి. ఏమంటే, ఈ సమయంలో కఠినంగా ర్యాష్ గా ఉండడం వలన ఏమీ సహాయం జరగదు. ప్రయాణం అనుకూలించదు. కనుక మానడానికి ప్రయత్నిఛండి. మీ కుటుంబం వైపునుండి పూర్తి సపోర్ట్, ఉండదు. సమర్థించరు. సంతాన సమస్యలు ఉంటాయి. మీ శతృవులు మీకు హాని కలిగించగల ఏరాయిని విసరకుండా వదలరు. మీరు ధైర్యంగా స్థైర్యంగా ఉండడం, మీ సవ్యమైన నిర్ణయాలకు కట్టుబడి ఉండడం మంచిది. పొట్టకు సంబంధించి, అసౌకర్యం కొంత ఆందోళనకు దారితీస్తుంది.
Sep 27, 2026 - Nov 27, 2026
మీకు ఎదురయ్యే సవాళ్ల ను అధిగమించడానికి క్రొత్త ఆలోచనలు వస్తాయి. మీకు సంబంధించిన ఒప్పందాలు(డీలింగ్) లు, లావాదేవీలు ఎక్కువ శ్రమ లేకుండానే, సాఫీగా సాగిపోతాయి. ఇది మీ పోటీదారులనుఅవలీలగా గెలిచినందువలన సాధ్యపడింది. ఆదాయం ఒకటి కంటె ఎక్కువ మార్గాలలో లభిస్తుంది. మీ స్నేహితులు, కుటుంబం, మీ వ్యక్తిగత జీవితాన్ని మరింత సుఖవంతం ఫలవంతం చేస్తారు. మీ క్లైంట్లు యొక్క సహచరులు మరియు సంబంధిత వ్యక్తులు తప్పకుండా కాలానుగతంగా మెరుగు అవుతారు. మీరు కొన్ని విలాస వస్తువులను కొనుగోలుచేస్తారు. మొత్తం మీద ఇది మీకు కలిసి వచ్చే కాలం.
Nov 27, 2026 - Dec 15, 2026
ఇది మీకు, స్వయం వ్యక్తీకరణకు మీ కల్పనా నైపుణ్యాలకు పనిచెప్పి వృద్ధిపొందేకాలం. మీ పనిసంబంధ ప్రదేశాలలో మంచి మార్పును అనుకోనిరీతిలో వస్తుందని ఎదురు చూడవచ్చును. మరియు, వృత్తి సంబంధంగా చేసే పనులు మిమ్మల్ని, ప్రత్యేకంగా నిలబెడతాయి. పై అధికార్లనుండి, సీనియర్ల నుండి అనుకూలత లభిస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలోను, వృత్తిపరంగానూ, అనుకూల మార్పులు జరుగుతాయి. తల్లితంద్రుల తరఫున ఆస్తులు సమకూడవచ్చును. ఈ కాలంలో మీరు తప్పక విజయం సాధిస్తారు , ఇంకా మీ కల లు నెరవేరడం చూస్తారు.
Dec 15, 2026 - Jan 15, 2027
మీకు ఇది శారీరకంగాను మానసికంగాను అనుకూలమైన కాలం కాదు. ఆరోగ్య సంబంధమైన చికాకులు మీ మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తాయి. మీ వైరివర్గం వారు మీ కుటుంబ సభ్యుల ముందు, స్నేహితుల ముందు మీ ప్రతిష్ఠను కళంకపరిచే ప్రయత్నం చేయవచ్చును. కనుక మీ రు అటువంటి వారికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్య సంబంధమైన చికాకులకు అవకాశం ఉన్నందున మీరు ఎంతో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇంకా మీ జీవిత భాగస్వామియొక్క ఆరోగ్యం కూడా పాడయే అవకాశం ఉన్నది.
Jan 15, 2027 - Feb 05, 2027
పరీక్షలలోసఫలత, లేదా ప్రమోషన్ లేదా ఉద్యోగంలో గుర్తింపు పెరగడం, నిశ్చయం. కుటుంబం నుండి కూడా సహకారం అందుతుండడం కనబడుతుంది. దూరప్రాంతాలలోగలవారు, లేదా విదేశీ వ్యక్తులద్వారా సహకారం అందుతుంది. మీకు ఎంతో ప్రయోజనకరమైన క్రొత్త పని మీకు అప్పగించబడుతుంది. మీకు ఎటువంటి వ్యతిరేక పరిస్థితులనైనా ఎదుర్కొని నిలవ గలిగే ఆత్మ విశ్వాసం ఉంటాయి. అద్భుత రీతిలో గుండె నిబ్బరం కలిగి ఉంటారు.