డబ్బు విషయమై, హోదా కి సంబంధిచి, కొంత ఎగుడు దిగుళ్ళు వచ్చే సూచన కనిపిస్తున్నది. ఆర్థికంగాను, లేదా ఆస్తి నష్టాలు ఉండవచ్చును. డబ్బు విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. మీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే, సన్నిహిత సహచరులతో మరియు బంధువులతో వివాదాలు జరిగితే ఇబ్బందికరం (ఎంబరాసింగ్) కావచ్చును. మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి ఏమంటే, అనారోగ్యం కలగ వచ్చును.
Jun 10, 2024 - Jul 01, 2024
ప్రయాణ అభిలాష ఉండడం వలన కొంత వరకు మీ ప్రయాణపు సరదా వలన కలిగిన అలసట ఉంటుంది. మీకు ఒకమూల ఉండిపోవడం ఇష్టం ఉండదు. దాంతో అలసట తప్పదు. మీ ఆలోచనల్ మతంవైపుకు మరలడంతో పుణ్య క్షేత్ర దర్శనం చేయగలరు. ఈ దశలో కెరీయర్ గురించి మీకు మార్పు(వొలాటిలిటీ,) , వత్తిడిలతో ఉంటుంది. మీ స్వంత మనుషులతోను, బంధువర్గంతోను, అనుబంధాలు కొంచెం పాడవుతాయి. రోజువారీ పనులు బాధ్యతలగురించి సరైన శ్రద్ధపెట్టండి. మీ కుటుంబ సభ్యుల అంచనాల మేరకు మీరు సంతృప్తి పరచలేరు. ఏ విధమైన వ్యాపార లావాదేవీల లోను మీరి చేయిపెట్టవద్దు. మీ అమ్మగారికి ఇది పరీక్షా సమయం.
Jul 01, 2024 - Aug 31, 2024
మీరీసమయంలో ఎక్కువ సొమ్మును విలాసాలకు సౌఖ్యాలకు ఖర్చు చేస్తారు. ఇది మీరు అదుపు చేస్తే మంచిది. మీకు ప్రేమవ్యవహారాలలో నిరాశకలుగుతుంది. కుటుంబజీవితాన సమస్యలు ఎదురౌతాయి. మీ శతృవులు మీకు హానిచేయగల అన్ని దారులలోను తమ ప్రయత్నాలు చేస్తారు. కనుక మీరు వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను చేసే పనులను సావధానంగా చేయండి. మీకుటుంబ సభ్యులొకరి అనారోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఆర్థికంగా మరీ చెడుకాలం కాక పోయినా కానీ మీ ఖర్చులపై అదుపుఉంచండి. మీ ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకొండి.
Aug 31, 2024 - Sep 18, 2024
ప్రవర్తనలో కోపం ప్రదర్శించకండి. ఎందుకంటే, మీ కోపిష్టి స్వభావం మిమ్మల్ని కష్టతర పరిస్థితులకు గురిచేస్తుంది. మీ స్నేహితులతో అభిప్రాయ భేదాలు, తగువులు, కొట్లాటలు సంభవించవచ్చును. కనుక, చక్కటి సంబంధాలను నెరపండి లేకపోతే, వారితో సన్నిహితత్వం దెబ్బ తినే అవకాశం ఉన్నది. ఆర్థికంగా ఒడిదుడుకులు కలగవచ్చును. కుటుంబంలోనూ, అశాంతి, అపార్థాలు కలగవచ్చును. జీవితభాగస్వామితోను, తల్లితోను మనస్పర్థలు కలగవచ్చును. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ప్రత్యేక శ్రద్ధ సత్వరమే అవసరమయే అనారోగ్యాలు, రోగాలు, తలనొప్పి, కంటి తాలూకు, క్రిందిపొట్ట తాలూకు,అనారోగ్యం, పాదాల వాపులు.
Sep 18, 2024 - Oct 19, 2024
ఇది మీకు అత్యంత యోగదాయకమైన కాలం. ఆర్థిక విషయమై ప్రయోజనాలు ఉంటాయి. ఆకస్మిక ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుని, బంధుమిత్రులను కలిసే అవకాశం ఉన్నది. అనుకూలమైన కాలం కనుక, చక్కగా వినియోగించుకొనండి. స్త్రీలవలన, పై అధికారులవలన, ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. డబ్బుకు సంబంధించినంతవరకు కూడా మంచి ఫలదాయకమైన సమయం.
Oct 19, 2024 - Nov 09, 2024
మీ పై అధికారులనుండి లేదా బాధ్యతాయుతమైన లేదా పరపతిగల వ్యక్తుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. వృత్తిపరంగా మీరు రాణిస్తారు. ఉద్యోగంలోను, కుటుంబంలోనుకూడా ముఖ్యమైన బాధ్యతలను స్వీకరించవలసి ఉంటుంది. అలాగే, మీ ఉద్యోగజీవితంలో, నిష్ణాతులైనవారిని మీ ప్రయాణ సమయాలలో కలిసే చక్కటి అవకాశం వస్తుంది. మీరు విలువైన లోహాలు, రత్నాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ సంతానానికి ఈ సమయంలో మీ ప్రత్యేక శ్రద్ధ అవసరమౌతుంది.
Nov 09, 2024 - Jan 03, 2025
ఈ సమయం మీకు అన్నివిధాలా (నిలువుగా) ఎదగడానికి కెరియర్ లో ఎదగడానికి ఒక చక్కని సోపానం లేదా మెట్టు గా అద్భుతంగా పనికివస్తుంది. వ్యాపార భాగస్వాములతోను, సహోద్యోగులతోను లాభసాటిగా ఉండే కాలం. అన్యాయంగా ఆర్జించడానికి మీరు మొగ్గుచూపవచ్చును. అప్పుడు మీ క్రమశిక్షణ, స్వయం పర్యవేక్షణ, ఇంకా, మీ రోజువారీ దినచర్యలపై అదుపులు, బాగా ఉపయోగపడతాయి. ఆరోగ్య సంబంధమైన చికాకులు మీ మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తాయి
Jan 03, 2025 - Feb 20, 2025
కష్టాలునిస్పృహలు కలుగుతాయి. మీరు వీటినుండి సానుకూల అంశాలనుస్వీకరించి అవసరమైన మిగిలినవాటిని సగంలో అసంపూర్తిగా వదిలెయ్యరాదు. మీ పనిచేసే చోట అన్నిటా మీరై ఉండాలి. ఆకస్మిక నష్టాలు కలగవచ్చును. విదేశీ మూలాధారంగా ఆదాయం కలగవచ్చును. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చికాకుకు గురిచేయవచ్చును. అంతగా లాభసాటికాని వ్యవహారాలలో తలపెట్టవలసి రావచ్చును. కుటుంబ వాతావరణం అంత సామరస్యంగా ఉండకపోవచ్చును. మీ శత్రువులు మీ ప్రతిష్టను ఏదోవిధంగా దెబ్బతీయడాని గల అన్ని మార్గాలలోను ప్రయత్నిస్తారు. అంతగా యోగించే కాలం కాదు.
Feb 20, 2025 - Apr 19, 2025
శుభవేళకి మహోదయం ఈ సమయం అనవచ్చును. మీరు ఉదాత్తమైన వ్యవహారాలో మీరు నిమగ్నమవడానికి అవకాశమున్నది. మీరు ఎంతో సంతోషంగా ఉంటారు.వ్యతిరేక పరిస్థితులను కూడా మీరు తట్టుకుంటారు. మీ పిల్లలకు అనారోగ్య సూచనలున్నా, కొంత సమస్యలున్నా కూడా, కుటుంబ సౌఖ్యం మీకు తప్పక అందుతుంది. మీ స్వయం కృషివలన ఆదాయం పెరుగుతుంది. మీ శతృవులు మీకు అపకారం చేయలేరు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కానరావచ్చును. మీ స్నేహితులు, సహచరులు, మీ ప్రయత్నాలలో సహకరిస్తారు.
Apr 19, 2025 - Jun 10, 2025
ఇది మీకు అంతగా సంతృప్తినిచ్చే కాలం కాదు. ఆర్థికంగా ఆకస్మిక నష్టాలకు గురికావచ్చును. ప్రయత్న వైఫల్యాలునిస్పృహకు గురిస్తాయి. పని బరువుబాధ్యతలు, మిమ్మల్ని క్రుంగదీయవచ్చును. కుటుంబ సంబంధాలు కూడా టెన్షన్లను కలిగిస్తాయి. వ్యాపార విషయాలలో సాహసాలు చేయవద్దు. ఎందుకంటే, కాలం మీకు అనుకూలంగా లేదు. మీ ప్రతిష్ఠను దెబ్బ తీయడానికి మీ శత్రువులు ప్రయత్నిస్తారు. అనవసర ఖర్చులకు మీరు పూనుకుంటారు. ఆరోగ్యం కూడా, మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతుంది. ప్రత్యేకించి, వృద్ధులు, కాటరాక్ట్, మరియు కఫసంబంధ సమస్యలతో సతమతమయ్యే అవకాశముంది.