బంధువులతోహార్దిక సంబంధాలు నెరపడం మంచిది. ఆరోగ్య విషయిక పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఏమంటే, దీర్ఘ కాలిక వ్యాధి సూచన (స్పెక్యులేషన్)ఉన్నది. ఏ చిన్న అవకాశం వచ్చినా మీ శతృవులు మీకు హాని చేయడానికి ఏరాయి దొరికినా విసరకుండా ఉండరు. అంటే దెబ్బ తీసి హాని కలిగించే ప్రయత్నాలు చేస్తుంటారు. కనుక, వారి నుండి వీలైనంత సురక్షిత దూరంలో ఉండండి.కుటుంబ సభ్యుల అనారోగ్యం కూడా మిమ్మల్ని కలతపెట్టవచ్చును. అప్పులు, చేబదుళ్ళు అదుపు చేసుకోవడం మంచిది. అందువలన ఆర్థికంగా కాస్త సంతోషంగా, ప్రశాంతంగా ఉండవచ్చును. మీకు ఖర్చు, దొంగతనం జరగడం వలన నష్టం , వివాదాలు కలగవచ్చును. అధికారులతో కూడా అభిప్రాయభేదాలు, అనంగీకారాలు పొడచూపవచ్చును.
Jan 5, 2024 - Feb 22, 2024
ఇది మీకు సరిగా అనుకూలించే సమయం కాదు. మీ వ్యతిరేకులు మీ యొక్క ప్రతిష్ఠని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. లాభదాయకం కాని ఒప్పందాలలో భాగస్తులు కావచ్చును. ఆకస్మిక ధన నష్టం సంభవించవచ్చును. రిస్క్ లు తీసుకునే బుద్ధిని త్రుంచి, మానుకోవాలి. ఏమంటే, ఇది మీకు యోగదాయకమైన కాలం కాదు. చిన్న విషయాల గురించి బంధువులతోను, స్నేహితులతోను తగాదాలు రావచ్చును. పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకోకండి, లేకుంటే, మీరు సమస్యలలో పడతారు. అంతే కాదు, దీనితోపాటు, కృతజ్ఞత లేని పనిని చేపట్ట గల అవకాశంఉన్నది. స్త్రీలకు ఋతుసంబంధవ్యాధులు, డిసెంట్రీ, ఇంకా కంటి సమస్యలు సూచింపబడుతున్నాయి.
Feb 22, 2024 - Apr 20, 2024
ప్రయాణ అభిలాష ఉండడం వలన కొంత అలసట ఉండవచ్చును. మీకు ఒకమూల కూరొనడం నచ్చదు కనుక కొంత అలసటకు కారణమౌతుంది. కెరియర్ లో మార్పుకు లోనవుతూ వత్తిడులతో మొదలవుతుంది. క్రొత్త ప్రాజెక్ట్ లు, రిస్క్లు తీసుకోకుండా ఉండడలి. క్రొత్త పెట్టుబడులు ఒప్పందాల కమిట్ మెంట్ లు ఆపాలి. లాభాలకు సూచనలున్నాకానీ ఆటు పోట్లుంటాయి. కనుక సౌకర్యవంతంగా అనిపించదు. లౌకిక సుఖాల రీత్యా,ఈ దశ అంతగా మంచిది కాదు. మత సంబంధ ,మరియు ఆధ్యాత్మిక పరంగా ఏ చర్యలు చేపట్టినా కష్టాలను ండి బయట పడెయ్యడానికి, సహాయమవుతుంది. మీ బంధువుల ద్వారా కొంత విచారం కలగ వచ్చును. ఆకస్మిక నష్టాలు, యాక్సిడెంట్లకు అవకాశమున్నది.
Apr 20, 2024 - Jun 11, 2024
ఈ ఏడాది మీకు పనిభారం పెరిగినా ప్రశంసలు, వృత్తిపరంగా రాణించడంతో యోగిస్తుంది. మీరు మనసుపెట్టి చేసిన పనులు లాభించి విజయాలను సాధించిపెట్టే ఉత్తమమైన కాలమిది. కుటుంబసభ్యుల సహకారం అందుతుంది. కీర్తి పొందుతారు. వృత్తిపరంగాగొప్ప అభివృద్ధి కానవస్తుంది. మీ శతృవులను అధిగమిస్తారు. అందరితోనూసత్సంబంధాలు కొనసాగిస్తారు.
Jun 11, 2024 - Jul 02, 2024
మీ పై అధికారులనుండి లేదా బాధ్యతాయుతమైన లేదా పరపతిగల వ్యక్తుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. వృత్తిపరంగా మీరు రాణిస్తారు. కుటుంబం నుండి కూడా సహకారం అందుతుండడం కనబడుతుంది. దూరప్రాంతాలలోగలవారు, లేదా విదేశీ వ్యక్తులద్వారా సహకారం అందుతుంది. అదాటుగా చేసిన వాటికి కూడా,మీకిష్టమై చేస్తే,ఇది మంచియోగదాయకమైన కాలం కాగలదు. మీకు సమాజంలో మర్యాద మరింత గౌరవం పెరుగుతుంది. క్రొత్త ఇల్లు కడతారు, అన్నివిధాల సంతోషాలను పొందుతారు.
Jul 02, 2024 - Sep 01, 2024
ఈ దశ మీకు ఎన్నోకారణాలవలన అత్యుత్తమ యోగదాయకం. ఎన్నో విషయాలు వాటంతట అవే పరిష్కరింపబడి సఫలం అయేటంతగా ఉండే మీ స్నేహశీలత అద్భుతం. మీ ఇంటికి సంబంధించిన అన్ని విషయాలను ఖచ్చితమైన పరిధిలలో సానుకూలమై పోతుంటాయి. ఈ కాలంలో మీ కుతూహలం, గాఢమైన ఇచ్ఛ మీ పనితనాన్ని ఎప్పటికంటె అత్యున్నతంగా చూపెడతాయి. ఉన్నత వర్గాల సహకారం అందుతుంది. మీ పదవిలో ఉన్నతి కలుగుతుంది. మీ శత్రువులను ఓడించడం జరుగుతుంది. మీ కుటుంబ సభ్యులు మరియు, బంధువుల అనుకూలత మీకు లభిస్తుంది. మీ చుట్టూరా, ఆహ్లాదకరమైన పరిస్థితులు కానవస్తాయి.
Sep 01, 2024 - Sep 19, 2024
చికాకుల సంసారానికి, మరింత శ్రద్ధ, జాగ్రత్త అవసరమౌతాయి. కుటుంబ విషయాలు, టెన్షన్ లను రెండింటినీ నెట్టుకుని రావడం కొంత కష్టమే. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. కుటుంబంలో ఒకరు మరణించవచ్చును. భారీగా ఆర్థిక నష్టాలు, ఆస్తి కోల్పోవడం ఉండవచ్చును. ఆర్థిక విషయాల పట్ల శ్రద్ధను వహించాలి. నోటి మరియు కంటి బాధలు, సమస్యలకు కారణం కావచ్చును.
Sep 19, 2024 - Oct 20, 2024
అనవసరమైన ఖర్చులకు అవకాశముంది. ప్రేమ, రొమాన్స్, సాధారణజీవితం అంతగా ప్రోత్సాహకరంగా లేదు. జీవితంలో ఎదురయే వివిధ పరిస్థితులకి ఎంతో సంయమనంతోను, ప్రశాంతతతోను ఉండమని సూచన. ఊహాలోకం(గెస్వర్క్) పనిచేయదు. కనుక అటువంటివాటిలో తలదూర్చవద్దు. కన్నులు, కఫ సంబంధ సమస్యలు మరియు స్ప్లీన్(కాలేయం) సంబంధ సమస్యలుకలగవచ్చును. అసత్యాలు పలికి, మీకు మీరే సమస్యలను సృష్టించుకుంటారు.
Oct 20, 2024 - Nov 10, 2024
ఆర్థిక లావాదేవీలు లాభదాయకం కాదు. మీ కుటుంబంలో మరణం సంభవించవచ్చును. కుటుంబ తగాదాలు మీకు మనో ప్రశాంతతను పోగొట్టవచ్చును. మీ కఠినమైన సంభాషణలతో లేదా ఉపన్యాసంతో స్వయంగా సమస్యలు తెచ్చుకోగలరు. వ్యాపార సంబంధమైన ఒక చెడు వార్త మీకు వస్తుంది. భారీ నష్టాలు సూచన. అనారోగ్యాలు, ఇబ్బంది పెట్టవచ్చును.
Nov 10, 2024 - Jan 04, 2025
ఇది మీకు మంచి కాలం కాదు. మీ శతృవులు మీ శతృవులు మీ ప్రతిష్టదెబ్బ తీయ చూస్తారు. ఆకస్మిక ధన నష్టం కలగవచ్చును. మీఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆహారం విషతుల్యమవడంతో, ( ఫుడ్ పాయిజనింగ్) కడుపునొప్పులకి దారితీస్తుంది. కాలం మీకు అనుకూలించదు కనుక వ్యాపారాలలో మీరు రిస్క్ తీసుకునే ప్రయత్నం చెయ్యవద్దు. మీ బంధు మిత్రులతో చిన్న విషయాల్కే వివాదాలు పెరగవచ్చును. పెద్ద/ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. లేకుంటే కష్టాలలో పడతారు. అంతే కాదు మీరు కృతజ్ఞత లేని పనిని చేయవలసి రావచ్చును.