ఈ వ్యక్తి, అలవికాని లాభాలు, సంపద మొదటినుండి పొందుతారు. అది లాటరీ , స్పెక్యులేషన్ షేర్లు మొదలైనవి ఏమార్గమైనా కావచ్చును. స్నేహితులు, శ్రేయోభిలాషులు అంతా మీ వ్యవహారాలలో మిమ్మల్ని సమర్థించి, మీకు సహకరించవచ్చును .మీరు వ్యాపార వ్యవహారాల(బిజినెస్ డీలింగ్ ల)ద్వారా చెప్పుకోదగినంత సంపాదిస్తారు. మంచి స్థానం, హోదా పొందుతారు. మీరు చక్కగా గౌరవం పొందుతారు మరియు మృష్టాన్న భోజన సౌఖ్యం( రుచికరమైన భోజనం) ఆనందం కలుగుతుంది.
Aug 14, 2026 - Sep 13, 2026
మీకు అభివృద్దిని సూచిస్తున్న కాలం. మీకు ఎన్నో సంభ్రమాలు కలగనున్నాయి. అందులో ఆనందకరమే ఎక్కువ. మీ జీవిత భాగస్వామి ద్వారా మరియు బంధువుల ద్వారా సంతోషం కలగవచ్చును. వివాదాలలోను, వ్యాజ్యాలలోను, సఫలత లభిస్తుంది. మీరు గృహాన్ని కానీ వాహనాన్ని కానీ కొనుగోలు చేస్తారు. మీ కాంట్రాక్ట్ ల ద్వారా మరియు ఒప్పందాల ద్వారా చెప్పుకోదగిన లాభాలనార్జిస్తారు. మీ శత్రువులనందరినీ అధిగమిస్తారు. డబ్బుకు సంబంధించినంతవరకు కూడా మంచి ఫలదాయకమైన సమయం.
Sep 13, 2026 - Oct 04, 2026
ఆర్థిక లావాదేవీలు లాభదాయకం కాదు. మీ కుటుంబంలో మరణం సంభవించవచ్చును. కుటుంబ తగాదాలు మీకు మనో ప్రశాంతతను పోగొట్టవచ్చును. మీ కఠినమైన సంభాషణలతో లేదా ఉపన్యాసంతో స్వయంగా సమస్యలు తెచ్చుకోగలరు. వ్యాపార సంబంధమైన ఒక చెడు వార్త మీకు వస్తుంది. భారీ నష్టాలు సూచన. అనారోగ్యాలు, ఇబ్బంది పెట్టవచ్చును.
Oct 04, 2026 - Nov 28, 2026
ఈ సమయం మీకు అన్నివిధాలా (నిలువుగా) ఎదగడానికి కెరియర్ లో ఎదగడానికి ఒక చక్కని సోపానం లేదా మెట్టు గా అద్భుతంగా పనికివస్తుంది. వ్యాపార భాగస్వాములతోను, సహోద్యోగులతోను లాభసాటిగా ఉండే కాలం. అన్యాయంగా ఆర్జించడానికి మీరు మొగ్గుచూపవచ్చును. అప్పుడు మీ క్రమశిక్షణ, స్వయం పర్యవేక్షణ, ఇంకా, మీ రోజువారీ దినచర్యలపై అదుపులు, బాగా ఉపయోగపడతాయి. ఆరోగ్య సంబంధమైన చికాకులు మీ మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తాయి
Nov 28, 2026 - Jan 16, 2027
మీకు సహాయం అందించడంలో ఇతరులనుండి గట్టి ప్రభావం ఉంటుంది. ఇది మీ భౌతిక అవసరాలను నెరవేర్చడము, అలాగే, మీకు మరింత వ్యక్తిగత రక్షణ కల్పించడం జరుగుతుంది. డబ్బు ఖచ్చితంగా మీకు చేకూరుతుంది, మీ వ్యక్తిగత విశ్వాసాలను, కలలను, మరియు తత్వ విచారాలను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వం, మరియు ఉన్నత అధికారులచే గుర్తింపు పొందుతారు. మీరు స్నేహశీలత కలిగి ఉంటారు,అలాగే, వివిధ సామాజిక పరిస్థితులలో, అవసరమయే సంఘంలోని వివిధ వ్యక్తులతో పరస్పర సద్భావనలు చూపి గ్రూప్ డైనమిక్స్ చూపడాన్ని చాలా సౌకర్యవంతమైన ఎంజాయ్ మెంట్ గా తీసుకుంటారు; కాకపోతే అనారోగ్య సమస్య మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది. బాహ్యంగా కంటే, అంతర్గత మార్పు, పరివర్తన ఎంతో అవసరం.
Jan 16, 2027 - Mar 14, 2027
భౌతికంగా ను మానసికంగాను కూడా మీకీ దశ ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ బంధువులకు కూడా మంచి కాలం. మీ జీవితకాలంలో గల కెరియర్ కోసం చేసే ప్రయత్నాలను కొనసాగించండి. ఏమంటే, ఇది కలిసివచ్చే కాలం. వస్తు లాభం కూడా సూచితం. ఈ సమయంలో భూమి, యంత్ర పరికరాల కొనుగోలు కూడా జరుగుతుంది. వ్యాపారం లోను, వాణిజ్యంలోను లాభాలు నిశ్చయం. మీ శతృవులు మీముందు, తోక ఝాడించలేరు, మీకు అపకారం చేయలేరు. ప్రేమవిషయాలలో ఇది మీకు అనుకూలమైన కాలం. మీ కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ సహకారం అందుతుంది.
Mar 14, 2027 - May 05, 2027
ప్రయాణాలు ఉత్సాహవంతంగా ఉండి, సమానవ్యక్తుల పరిచయ సంబంధాల సంభ్రమాని కి దారి తీస్తుంది. మీరు తెలివితో, ఇంటా బయటాబాధ్యతలను నిర్వర్తించడమే కాకుండా ఈ రెండిటిద్వారా మీ జీవితంలోముఖ్యమైన విషయాలను నిర్వర్తిస్తారు. చాలాకాలంగా గల కలలు సాకారం అవుతాయి. అంతే కాక, కొద్దిగా కష్టమే అయినా అవి మీకు ఎదుగుదలకు కారణమౌతాయి. మంచి ఆదాయంతోపాటు, పేరుప్రతిష్ఠలు వస్తాయి. పాతస్నేహితులను కలవడం కూడా ,సూచింపబడుతోంది. స్త్రీ అయితే మరొక పురుషునితోను, మగవారైతే మరొక స్త్రీతోను పరిచయం కలుగుతుంది. పై అధికారులనుండి కొంత సాయం అందుతుంది. లేదా బాధ్యతాయుతమైన వారు లేదా పరపతిగల పదవిలో ఉండేవారి నుండి మీకు సహాయం అందుతుంది.
May 05, 2027 - May 26, 2027
ప్రయాణ అభిలాష ఉండడం వలన కొంత వరకు మీ ప్రయాణపు సరదా వలన కలిగిన అలసట ఉంటుంది. మీకు ఒకమూల ఉండిపోవడం ఇష్టం ఉండదు. దాంతో అలసట తప్పదు. మీ ఆలోచనల్ మతంవైపుకు మరలడంతో పుణ్య క్షేత్ర దర్శనం చేయగలరు. ఈ దశలో కెరీయర్ గురించి మీకు మార్పు(వొలాటిలిటీ,) , వత్తిడిలతో ఉంటుంది. మీ స్వంత మనుషులతోను, బంధువర్గంతోను, అనుబంధాలు కొంచెం పాడవుతాయి. రోజువారీ పనులు బాధ్యతలగురించి సరైన శ్రద్ధపెట్టండి. మీ కుటుంబ సభ్యుల అంచనాల మేరకు మీరు సంతృప్తి పరచలేరు. ఏ విధమైన వ్యాపార లావాదేవీల లోను మీరి చేయిపెట్టవద్దు. మీ అమ్మగారికి ఇది పరీక్షా సమయం.
May 26, 2027 - Jul 26, 2027
ఏదో విధంగా కాలం, అదృష్టం మీ పై మీ చర్యలపై దృష్టి ప్రసరించుతాయి. మీరు చేసిన పనులకు, శ్రమకు కితాబునిచ్చుకుని, ఇతరులు దానిని గుర్తించి, మీవైపు తలెత్తిచూసేటందుకు ఇది తగిన వేళ. మీ తల్లితండ్రులతోను, మీపిల్లలతోను, బంధువులతోను అదే దగ్గరితనాన్ని కొనసాగిస్తారు. కబుర్లు అందచేయడం, సంప్రదింపులు ఫలించుతాయి, మీకు క్రొత్త అవకాశాలుచేకూరుస్తాయి. వ్యాపారరీత్యా/ ఉద్యోగపరంగా వగైరా తరచు ప్రయాణాలు ఉంటాయి. మీరువిలువైన లోహాలు, రత్నాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
Jul 26, 2027 - Aug 14, 2027
ఇది మీకు విరామ కాలం. మీ దృక్పథం విశ్వాసంతో కూడి, మీకు సానుకూల లేదా, పాజిటివ్ గా అనిపిస్తుంది. మీ సోదరునికి సమస్యలు కలిగే అవకాశం ఉన్నది. అయినా, మొత్తంమీద ఇంటి విషయాలలో, మీరు సంతోషంగా ఉంటారు, మీ ఇష్టాలు నెరవేరుతాయి. ప్రయాణాలు వాహనాలపైననే. దగ్గరి ప్రయాణాలు లాభించి, అదృష్టాన్ని తీసుకుని రావచ్చును. ఆర్థిక లాభాలు సమకూడ వచ్చును. కుటుంబంతోను, స్నేహితులతోను, కలిసే అవకాశం ఉన్నది. మంచి ఆరోగ్యం కలుగుతుంది. శతృవులపై విజయం సాధిస్తారు.