ఇది మీకు బహు అనుకూలమైన కాలం, పట్టినది బంగారమయ్యే కాలం అంటే, ఇక మీరు కార్యోన్ముఖులు కావలసిన(పని చేయవలసిన కాలం). వివిధ రంగాల నుండి అనుకోని విధంగా బహుమతులు, లాభాలు వచ్చి పడిపోతుంటాయి. ఇది మీకు మరింత మెరుగైన కెరియర్ ను , సర్వతో ముఖాభివృద్ధిని అందిస్తుంది. మీ వ్యతిరేకులు, మీ దారిలో ఎదురుపడడానికి కూడా సాహసించరు. ఇక మీ వంతుగా తగినవిధంగా ఆకర్షణను, కీర్తిని పొందుతారు. పాలకుల నుండి, మీ పై అధికారులనుండి, ఉన్నతాధికారులనుండి, అభిమానాన్ని చూరగొంటారు.మీకుచక్కని ఆరోగ్యం, శరీర సౌష్టవం ఉంటాయి. ఈ ఏడాది మీకు, వాహన ప్రాప్తి కూడా సూచిస్తున్నది.
Aug 7, 2025 - Sep 06, 2025
కుటుంబంలో చక్కని సామరస్యత, అవగాహనలతో అనుకూల వాతావరణం కానవస్తున్నది. మీ జ్ఞానాన్ని పెంచుకుని, మీ సహోద్యోగులనుండి కొంత నేర్చుకోవడానికిమనుకూలసమయం. స్నేహితులతోను, విదేశీయులతోను, మంచి సంబంధాలు నెరిపితే ఫలవంతమౌతాయి. ఇది స్థలాలు పొందడానికి వేళ కావచ్చును. దానధర్మాలు చేయగలరు. మీ సంతానంకూడావిజయాలు సాధించి,మీకుఆనందాన్ని కలిగించగలరు. బహు చక్కనిజీవితం మీకోసం భవిష్యత్తులో ఎదురు చూస్తున్నది.
Sep 06, 2025 - Sep 27, 2025
ఇది మీకు అతి యోగదాయకమైన సమయం కనుక వీలైనంత ప్రయోజనం పొందడానికి ప్రయత్నించండి. మీకు గల అన్ని వత్తిడులు, సమస్యలనుండి విముక్తి పొందుతారు. కుటుంబ మరియు, వృత్తి పరంగా మీకు అనుకూలం . బండి నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్త గా ఉండాలి. మీరు మీ శతృవులను సంపూర్ణంగా అణచేయాలనుకుంటారు కనుక మీ ముందుకు రావడానికి ధైర్యం చేయరు. సాహసం చూపి, వృత్తిపరమైన ఉత్తమ ఫలితాలను పొందుతారు.
Sep 27, 2025 - Nov 21, 2025
ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉండి పైకి ఎదుగుతారు. మీరు ఈ కాలంలో, దాంపత్య సౌఖ్యాన్ని పొందుతారు. పరపతిగల వారితో మీ పరిచయాలు తప్పక ఇంకా పెరుగుతాయి. మీ వైరివర్గం, మీవైపుకు కనీసం ఎదురుపడడానికి కూడా సాహసంచేయలేరు. సుదీర్ఘ ప్రయాణం ప్రయోజనకరం కాబోతున్నది. ప్రేమ, రొమాన్స్ వరంగా మారనున్నాయై. మీరొక నాయకునివలె, మీ శతృవులను గెలుస్తారు. చిన్నపాటి అనారోగ్యం కాన వస్తుంది. పిల్లలతో అనుబంధాలు బాగులేకపోయినా మిగతా కుటుంబ సంబంధాలు సంతృప్తికరంగా ఉంటాయి.
Nov 21, 2025 - Jan 09, 2026
మీకు సహాయం అందించడంలో ఇతరులనుండి గట్టి ప్రభావం ఉంటుంది. ఇది మీ భౌతిక అవసరాలను నెరవేర్చడము, అలాగే, మీకు మరింత వ్యక్తిగత రక్షణ కల్పించడం జరుగుతుంది. డబ్బు ఖచ్చితంగా మీకు చేకూరుతుంది, మీ వ్యక్తిగత విశ్వాసాలను, కలలను, మరియు తత్వ విచారాలను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వం, మరియు ఉన్నత అధికారులచే గుర్తింపు పొందుతారు. మీరు స్నేహశీలత కలిగి ఉంటారు,అలాగే, వివిధ సామాజిక పరిస్థితులలో, అవసరమయే సంఘంలోని వివిధ వ్యక్తులతో పరస్పర సద్భావనలు చూపి గ్రూప్ డైనమిక్స్ చూపడాన్ని చాలా సౌకర్యవంతమైన ఎంజాయ్ మెంట్ గా తీసుకుంటారు; కాకపోతే అనారోగ్య సమస్య మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది. బాహ్యంగా కంటే, అంతర్గత మార్పు, పరివర్తన ఎంతో అవసరం.
Jan 09, 2026 - Mar 07, 2026
ఇది మీకు అంత సంతృప్తికరమైన కాలం కాదు. ఆర్థికంగా మీకు నష్టాలు కలగవచ్చును. వ్యాజ్యాలవలన, వివాదాలవలన, డబ్బు నష్టపోయే అవకాశమున్నది. వైఫల్యాలు మిమ్మల్నినిరాశకు గురి చేస్తాయి. పని వత్తిడికి మీరు అలసిపోతారు. కుటుంబ విషయాలు కూడా ఆందోళన కారణం కావచ్చును. క్రొత్త వ్యాపార రీత్యా రిస్క్ గల వ్యవహారాలు మానండి.. ఎందుకంటే నష్టాల కాలమిది. సమయం మీకు అనుకూలంగా లేదు. శతృవులు మీ ప్రతిష్టదెబ్బ తీయ చూస్తారు. ధననష్టం కూడా సహజం
Mar 07, 2026 - Apr 28, 2026
ఆస్తి సంబంధ లావాదేవీలద్వారా మంచి ప్రయోజనాలు కలిగే కాలమిది. ఆర్థిక వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కరించబడతాయి. మీరు క్రొత్త ఆదాయ మార్గాలను గుర్తించగలుగుతారు. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న వేతనపెంపు అమలులోకి వస్తుంది. వ్యాపార ప్రయాణాలు సఫలం కావడమేకాక, ఫలవంతంగా కానవస్తాయి. ఈ కాలం ముఖ్య లక్షణం ఏమంటే, మీ స్థాయి ఏదైనా అగుగాక, మీకు లభించే గౌరవ ప్రపత్తులలో సానుకూల ఎదుగుదల కానవస్తుంది. మీరు డబ్బును విలాసాలకు ఖర్చు పెట్టడానికి, మరియు, క్రొత్త బండి కొనడానికి వెచ్చించడానికే మొగ్గు చూపుతారు.
Apr 28, 2026 - May 19, 2026
వృత్తిలోను, వ్యక్తిగతంగాను ఆటంకాలు ఎదురౌతాయి. కష్టకాలాన్ని తెలివితోను, నిదానంగాను ఎదుర్కొనండి. ఏమంటే, ఈ సమయంలో కఠినంగా ర్యాష్ గా ఉండడం వలన ఏమీ సహాయం జరగదు. ప్రయాణం అనుకూలించదు. కనుక మానడానికి ప్రయత్నిఛండి. మీ కుటుంబం వైపునుండి పూర్తి సపోర్ట్, ఉండదు. సమర్థించరు. సంతాన సమస్యలు ఉంటాయి. మీ శతృవులు మీకు హాని కలిగించగల ఏరాయిని విసరకుండా వదలరు. మీరు ధైర్యంగా స్థైర్యంగా ఉండడం, మీ సవ్యమైన నిర్ణయాలకు కట్టుబడి ఉండడం మంచిది. పొట్టకు సంబంధించి, అసౌకర్యం కొంత ఆందోళనకు దారితీస్తుంది.
May 19, 2026 - Jul 19, 2026
జనాలు మీవైపు చూస్తూ, సలహా కోసం మీవద్దకు చేరుతారు. ఎన్నో విషయాలు వాటంతట అవే పరిష్కరింపబడి సఫలం అవుతాయి. కాలం మీకు అదృష్టాన్నితెస్తుంది. శక్తిని , ధైర్యాన్ని అందిస్తుంది. ఏమైనా, అధికారులనుండి లాభదాయకమైన అంశాలు, గుర్తింపు లభిస్తాయి. కనుక ఇది మంచి కాలం. కనుక మీరు క్రొత్త వాటికోసం ప్రయత్నించడం, క్రొత్త ప్రదేశాలకు వెళ్ళడం కోసం ప్రయత్నించవచ్చు. వాహనం పొందే అవకాశం ఉన్నది. ఇచ్చిపుచ్చుకునే కొన్ని క్రొత్తపరిచయాలు సంబంధాలు బలపడతాయి. మీ సంతానానికికూడా ఈసమయంలో కలిసివస్తుంది.
Jul 19, 2026 - Aug 07, 2026
ఈ సమయంలో మీరు, శారీరకంగా బలహీనంగా ఉండటంతో, శ్రమకోర్చే పనులు చేపట్టలేరు. మీరు అనైతికమైన పనులలో నిమగ్నం అయేఅవకాశమున్నది. మీరు వ్యవసాయ సంబంధించినవారైతే, నష్టాలు కలగవచ్చును. పైఆధికారుల నుండి సమస్య ఎదురవ వచ్చును. మీ అమ్మగారిని, అనారోగ్యం చికాకు పరవచ్చును. ఇంటిలో అవాంఛనీయ మార్పు కలగవచ్చును. ర్యాష్ గా బండిని నడపవద్దు.