డబ్బు విషయమై, హోదా కి సంబంధిచి, కొంత ఎగుడు దిగుళ్ళు వచ్చే సూచన కనిపిస్తున్నది. ఆర్థికంగాను, లేదా ఆస్తి నష్టాలు ఉండవచ్చును. డబ్బు విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. మీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే, సన్నిహిత సహచరులతో మరియు బంధువులతో వివాదాలు జరిగితే ఇబ్బందికరం (ఎంబరాసింగ్) కావచ్చును. మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి ఏమంటే, అనారోగ్యం కలగ వచ్చును.
Dec 3, 2026 - Jan 27, 2027
క్రొత్త పెట్టుబడులు మరియు రిస్క్ లు అవాయిడ్ చెయ్యాలి. ఈ దశలో మీకు అవాంతరాలు మరియు అడ్డంకులు ఎదురు కావచ్చును. పనిచేసే ఉద్యోగస్తులైతే, అభివృద్ధిని చూస్తారు. అదికూడా కష్టపడి పనిచేసి, దీర్ఘ కాలంగా ఆశావహ దృక్పథం కలిగి ఉంటే, ఇది సాధ్యం. విజయానికి దగ్గరి దారేదీ లేదు కదా. మీరు చక్కని ఫలితాలకోసం స్థిరంగా నిరంతరంగా పనిచేస్తూ పోవాలి. సంవత్సర ప్రారంభంలో, పని పరిస్థితులు, కొద్దిగా అస్తవ్యస్థంగా వత్తిడి కలిగించేలా ఉంటాయి. ఇలాంటప్పుడు క్రొత్త అభివృద్ధిని లేదా వేగంగా పనిచెయ్యడం ఉండకూడదు. ఈ సానుకూల సమయంలో మీ ఆరోగ్య పరిస్థితులు మిమ్మల్ని సరిగా పనిచేసి మీ లక్ష్యాలను చేరుకోనివ్వవు. అందుకే ఆరోగ్య పరీక్షలు అవసరం. సాధారణంగా జ్వరం సమస్యకి చెక్ చేయించుకోవాలి.
Jan 27, 2027 - Mar 17, 2027
మీకుగల సంగీత నైపుణ్యాలను పంచుకోవడాన్ని మీరు ఆనందపడతారు. అలాగే, సరిక్రొత్త సంగీత సంబంధ కళాఖండాన్ని రూపొందించే అవకాశం కూడా లేకపోలేదు. మీ పని సంబంధమైన లేదా సమాజ పరమైన ఉన్నతమైన నియమాలు, విలువలను తెలియపరచడంలో ఎంతగానో సఫలమౌతారు. మీ పథకాలకు కార్యరూపం ఎప్పుడైతే తీసుకువస్తారో అప్పుడు, ఆదాయం వస్తుందని ఎదురు చూడవచ్చును. డబ్బు తప్పక మీ చేతికందుతుంది. మీ వ్యక్తిగత విశ్వాసాలు, స్వప్నాలు, తత్వవిచారాలను తప్పక ప్రభావితం చేస్తుంది. మీ శత్రువులు మిమ్మల్ని నిలువరించలేరు. మొత్తంమీద, ఈ కాలం మీకు మంచి సంతోషదాయకంఅనడం నిశ్చయం. మీ కుటుంబసభ్యులకు మరొకరు అదనంగా ఒకరు జతపడతారు.
Mar 17, 2027 - May 14, 2027
శుభవేళకి మహోదయం ఈ సమయం అనవచ్చును. మీరు ఉదాత్తమైన వ్యవహారాలో మీరు నిమగ్నమవడానికి అవకాశమున్నది. మీరు ఎంతో సంతోషంగా ఉంటారు.వ్యతిరేక పరిస్థితులను కూడా మీరు తట్టుకుంటారు. మీ పిల్లలకు అనారోగ్య సూచనలున్నా, కొంత సమస్యలున్నా కూడా, కుటుంబ సౌఖ్యం మీకు తప్పక అందుతుంది. మీ స్వయం కృషివలన ఆదాయం పెరుగుతుంది. మీ శతృవులు మీకు అపకారం చేయలేరు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కానరావచ్చును. మీ స్నేహితులు, సహచరులు, మీ ప్రయత్నాలలో సహకరిస్తారు.
May 14, 2027 - Jul 04, 2027
మీచుట్టూగల వ్యక్తులు మీలోగల నిజమైన శక్తిని గుర్తిస్తారు. ఇది మీకు ఎంతో సంతోషాన్ని కలిగించడమే కాక, మీకు నిరంతరంగా శాయశక్తులా కష్టపడడానికి స్ఫూర్తినిస్తుంది. ప్రయాణాలకి మీకు ఎంతో అనుకూలమైన కాలం. పదండి ఎదురైన ఆనందాన్ని ఆస్వాదించండి. ఆఖరుకు మీ విజయాలను విశ్రాంతిగా అనుభవించవచ్చును, దాంతోపాటు, ఎంతోకాలంగా మీరుపడుతున్న కష్టం ఫలించుతుందికూడా. ఈ సమయం మిమ్మల్ని పేరున్న వ్యక్తుల మధ్యన నిలబెడుతుంది. సంతానం కావాలన్న కోరిక నెరవేరుతుంది. మీ సృజనాత్మకత ఇతరుల ప్రశంసలు పొందుతుంది.
Jul 04, 2027 - Jul 26, 2027
ఒకవేళ, ఉద్యోగస్తులైతే, సంవత్సరం మహా దూకుడుగా ఉంటుంది చురుకుగా డైనమిజం మరియు ఎదుగుదల ఉంటాయి. ఏదేమైనా, పని పరిస్థితులు వత్తిడితోనే ఉంటాయి. పై అధికారులతో వాదప్రతివాదాలు, ప్రతిస్పర్థలు ఉంటూనే ఉంటాయి. సాధారణంగా ఈ దశ అంతగా బాగుండదు. ఏమంటే, దగ్గరి సహచరులు, స్నేహితులు, మరియు కుటుంబ సభ్యులు, అందరూ దూరంగా అనిపిస్తారు. పెద్దగా మార్పు ఉండదు, వాంఛితం కూడా కాదు. మీ దృక్పథం, అసభ్య భాషా పదజాలం అలవాటు, అతి దగ్గరైన వారితో, కొన్ని సమస్యలను సృష్టిస్తుంది. కనుక మీ మాటలను అదుపులో ఉంచుకొండి.
Jul 26, 2027 - Sep 24, 2027
ఇంతకు ముందు లేని అధికారం మీ చేతికొస్తుంది. వ్యక్తిగతంగా మీకిష్టమైన వారు తమ ఇష్టపూర్తి కోసం, సౌకర్యాలకోసం, మీపైన ఆధారపడతారు. మీ మానసిక శక్తి చాలా గొప్పది. మరి ముఖ్యంగా మీజీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత తీయనై, బలపడుతుంది. సంతానయోగం కానవస్తున్నది. మీ క్రింద పనిచేసే వారు పూర్తి విధేయతతో మీ కు పనిచేస్తారు. మొత్తం మీద ఈ కాలం అనుకూలం. ఆహ్లాదకరం.
Sep 24, 2027 - Oct 13, 2027
జీవితం పట్ల ఉత్సాహంగా ఉంటారు. మంచి సాహసం కలిగి, తీవ్రమైన లేదా హింసాత్మక ప్రవర్తన కలిగిఉంటారు. బుద్ధి పైన అదుపు తప్పడం, మరియు విచక్షణ కోల్పోవడం జరగవచ్చును. మీకు ప్రజాదరణ తగ్గడంతో పాటు, వివాదాలతో కొంత సమస్య తలెత్తవచ్చును. ఈ కాలం ప్రేమకు, ప్రేమాయణాలకు అనుకూలం కాదు. సంతానం, మరియు, జీవిత భాగస్వామి అనారోగ్యంతో బాధపడవచ్చును. ప్రయోజనకర అంశాలను చూస్తే, సంతానప్రాప్తి, పై అధికారుల నుండి ప్రయోజనం సమకూరే అవకాశం ఉంది.
Oct 13, 2027 - Nov 12, 2027
ఇది మీకు అత్యంత యోగదాయకమైన కాలం. మీరు మీ ఆలోచనలతోచక్కని ఆత్మ విశ్వాసం కలిగి ఉంటారు. ఇంకా, పదవి పెరగడం(ప్రమోషన్)పట్ల గల అవకాశాలు హెచ్చుగా ఉండడగలదు. విజయవంతమయే ఆకస్మిక ప్రయాణాల సూచనలున్నాయి. సంతానపరంగా జీవిత భాగస్వామితో ప్రేమానురాగాలు బలపడతాయి. సంతోషం మీ సోదరులకు కూడా కలిసివచ్చే కాలం. స్థలమార్పు లేదా వృత్తి మార్పు ఆలోచన విరమించవలసిఉంది.
Nov 12, 2027 - Dec 03, 2027
ఆర్థిక లావాదేవీలు లాభదాయకం కాదు. మీ కుటుంబంలో మరణం సంభవించవచ్చును. కుటుంబ తగాదాలు మీకు మనో ప్రశాంతతను పోగొట్టవచ్చును. మీ కఠినమైన సంభాషణలతో లేదా ఉపన్యాసంతో స్వయంగా సమస్యలు తెచ్చుకోగలరు. వ్యాపార సంబంధమైన ఒక చెడు వార్త మీకు వస్తుంది. భారీ నష్టాలు సూచన. అనారోగ్యాలు, ఇబ్బంది పెట్టవచ్చును.