బాగా సన్నిహిత బంధువు లేదా కుటుంబ సభ్యులొకరి మరణ వార్త వింటారు. మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి ఏమంటే, అనారోగ్యం వలన బాధలు కలగే అవకాశాలున్నాయి. సంపద నష్టం, ఆత్మ విశ్వాసం కోల్పోవడం, నిష్ఫలమైన ప్రయత్నాలు, మానసిక ఆందోళనలు అన్నీ కలగవచ్చును .ఇతరుల ఈర్ష్య మీకు సమస్యలకు కారణం కావచ్చును. దొంగతనం వలన కూడా ఆర్థిక నష్టం కలిగేను. అంతేకాదు, మీరు చెడు సావాసాలు, చెడు అలవాట్లకు కూడా లొంగవచ్చును.
Mar 3, 2026 - Apr 03, 2026
ఈ కాలం మీకు కలిసి వస్తుంది. ఆర్థికంగా స్థిరత్వాన్ని కల్పిస్తుంది. మీ ఆశలకు,కలలనుఅనుసరించి పనిచేస్తూ వాటికొక రూపుకల్పించవచ్చును. ప్రేమకు రొమాన్స్ కి అనుకూలమైన కాలం. మీరు క్రొత్త పరిచయాలు పొందుతారు. అవి ఎంతో ఫలవంతమూ, సహాయకరము అవుతాయి.చదువరులచే మీరు ప్రశంసలు,గౌరవము పొందుతారు. దాంతో జీవితభాగస్వామితో కలిసిమరింత ప్రతిష్ఠను పొందుతారు. దూర ప్రయాణ సూచన కూడా ఉన్నది.
Apr 03, 2026 - Apr 24, 2026
కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగించవచ్చును. ప్రయాణాలు కలిసిరావు కనుక మానవలసింది. అనవసర ఖర్చులు అవుతాయి కనుక జాగ్రత్త గా ఉండాలి. స్నేహితులతోను, సహచరులతోను జాగ్రత్త, కొన్నిసార్లు, మీ న్యాయ నిర్ణయం,విచక్షణ సరిగా ఉండకపోవచ్చును. అగ్ని వలన కానీ, స్త్రీల వలనగానీ గాయపడవచ్చును. హృదయ సంబంధ సమస్యలు తలెత్తవచ్చును కనుక, ఆరోగ్య విషయమై జాగ్రత్త చూపాలి.
Apr 24, 2026 - Jun 18, 2026
ఇది మీకు మంచి కాలం కాదు. మీ శతృవులు మీ శతృవులు మీ ప్రతిష్టదెబ్బ తీయ చూస్తారు. ఆకస్మిక ధన నష్టం కలగవచ్చును. మీఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆహారం విషతుల్యమవడంతో, ( ఫుడ్ పాయిజనింగ్) కడుపునొప్పులకి దారితీస్తుంది. కాలం మీకు అనుకూలించదు కనుక వ్యాపారాలలో మీరు రిస్క్ తీసుకునే ప్రయత్నం చెయ్యవద్దు. మీ బంధు మిత్రులతో చిన్న విషయాల్కే వివాదాలు పెరగవచ్చును. పెద్ద/ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. లేకుంటే కష్టాలలో పడతారు. అంతే కాదు మీరు కృతజ్ఞత లేని పనిని చేయవలసి రావచ్చును.
Jun 18, 2026 - Aug 06, 2026
ఈ దశ మీకు, అన్ని పెత్తనాలను తప్పనిసరిగా తేనున్నది. ఒక విదేశీ పరిచయం, లేదా సంబంధం, మీకు ఉపయోగపడనున్నది. వారు, మీరు ఎంతోకాలంగా పొందడానికై తపన పడినట్టి స్థాయి, అధికారం మరియు అనుకోని విధంగా చక్కని ఆదాయం కలగడానికి మూలకారణం అవుతారు. మీరు స్వ శక్తిని నమ్మడం, అదే భావనని కొనసాగించండి. ఈ ఏడాది, మిమ్మల్ని సంపూర్ణంగా ఒక క్రొత్త స్థాయిని అందుకునేలా చేస్తుంది. కుటుంబ వాతావరణం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూర ప్రయాణం ప్రయోజనకరం కాగలదు. మతంపట్ల మీరు ఇష్టాన్ని చూపడం , తత్సంబంధ దానాది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.
Aug 06, 2026 - Oct 02, 2026
మీరు వెదజల్లే అమితమైన శక్తి (ఎనర్జీ) మీజీవితంలో మిమ్మల్ని సమర్థించే ఎంతో మందిని మీవైపుకు ఆకర్షిస్తుంది. మీ శతృవులు మిమ్మల్ని తలెత్తి చూడడానికి సాహసించరు. ఆర్థికంగా ఇది మీకు అత్యుత్తమ కాలం. మీ వ్యక్తిగతంగా, మీ స్నేహితులతో ఉన్నపుడు ఇంకా కుటుంబం తోను మంచిగా ఉండడానికి క్రొత్తదారులు నేర్చుకుంటున్నారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచుకుంటున్నకొద్దీ, మీ వరకు మీరు ఆత్మ శక్తిని పెంచుకుంటే మీ అవసరాలకు నిలబడగలుగుతారు. మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీ పని పరిస్థితులు తప్పనిసరిగా మెరుగవుతాయి. మీ సహోద్యోగులు అధీన పనివారు మీకు అన్నివిధాలా బాగా సహకరిస్తారు. మీరు కొంత భూమిని, లేదా యంత్రాలను కొనుగోలు చేస్తారు. మీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ అవసరం.
Oct 02, 2026 - Nov 23, 2026
మీచుట్టూగల వ్యక్తులు మీలోగల నిజమైన శక్తిని గుర్తిస్తారు. ఇది మీకు ఎంతో సంతోషాన్ని కలిగించడమే కాక, మీకు నిరంతరంగా శాయశక్తులా కష్టపడడానికి స్ఫూర్తినిస్తుంది. ప్రయాణాలకి మీకు ఎంతో అనుకూలమైన కాలం. పదండి ఎదురైన ఆనందాన్ని ఆస్వాదించండి. ఆఖరుకు మీ విజయాలను విశ్రాంతిగా అనుభవించవచ్చును, దాంతోపాటు, ఎంతోకాలంగా మీరుపడుతున్న కష్టం ఫలించుతుందికూడా. ఈ సమయం మిమ్మల్ని పేరున్న వ్యక్తుల మధ్యన నిలబెడుతుంది. సంతానం కావాలన్న కోరిక నెరవేరుతుంది. మీ సృజనాత్మకత ఇతరుల ప్రశంసలు పొందుతుంది.
Nov 23, 2026 - Dec 14, 2026
మీ పై అధికారులనుండి లేదా బాధ్యతాయుతమైన లేదా పరపతిగల వ్యక్తుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. వృత్తిపరంగా మీరు రాణిస్తారు. కుటుంబం నుండి కూడా సహకారం అందుతుండడం కనబడుతుంది. దూరప్రాంతాలలోగలవారు, లేదా విదేశీ వ్యక్తులద్వారా సహకారం అందుతుంది. అదాటుగా చేసిన వాటికి కూడా,మీకిష్టమై చేస్తే,ఇది మంచియోగదాయకమైన కాలం కాగలదు. మీకు సమాజంలో మర్యాద మరింత గౌరవం పెరుగుతుంది. క్రొత్త ఇల్లు కడతారు, అన్నివిధాల సంతోషాలను పొందుతారు.
Dec 14, 2026 - Feb 13, 2027
మీరు ప్రయత్నించే వ్యక్తిగత సంబంధాలు అంతగా ఫలవంతంకావు పైగా, ఇంటా బయటా పనిచేసే చోట కొంతవరకు చికాకులకు దారితీయవచ్చును. మీ ఆరోగ్యం కోసం జాగ్రత్తను వహించండి. అలాగే మీ ప్రతిష్ట.ను మెరుగు పరుచుకోచూడండి. ఇంద్రియపరమైన (సెన్స్యుఅల్) ఆలోచనలు నిరాశ పరచడమే కాక కొంత అవమానకరంకూడా. ఇతర స్త్రీపురుషులతో సామరస్య ధోరణి కొంత తగ్గవచ్చును. మీ జీవితంలో మీ ఆరోగ్య సమస్యలు కొంత అస్తవ్యస్తతను కలగచేయవచ్చును. అనవసర ఖర్చులకు పాల్పడే అవకాశమున్నది. మొత్తంమీద ఇది మీకు అంతగా సంతోషదాయక కాలం కాదు. శారీరకంగా మీకు నీరసంగా నిస్పృహగా అనిపిస్తుంది.
Feb 13, 2027 - Mar 03, 2027
జీవితం పట్ల ఉత్సాహంగా ఉంటారు. మంచి సాహసం కలిగి, తీవ్రమైన లేదా హింసాత్మక ప్రవర్తన కలిగిఉంటారు. బుద్ధి పైన అదుపు తప్పడం, మరియు విచక్షణ కోల్పోవడం జరగవచ్చును. మీకు ప్రజాదరణ తగ్గడంతో పాటు, వివాదాలతో కొంత సమస్య తలెత్తవచ్చును. ఈ కాలం ప్రేమకు, ప్రేమాయణాలకు అనుకూలం కాదు. సంతానం, మరియు, జీవిత భాగస్వామి అనారోగ్యంతో బాధపడవచ్చును. ప్రయోజనకర అంశాలను చూస్తే, సంతానప్రాప్తి, పై అధికారుల నుండి ప్రయోజనం సమకూరే అవకాశం ఉంది.