మీకు విభిన్న జీవితమార్గాల నుండి ప్రశంసలు , పతకాలు లభించడానికి మీ తెలివితేటలు సహాయపడతాయి. మీరు వృత్తిలోను, వ్యాపారంలోను బాగా రాణిస్తారు. కుటుంబంలో పసిబిడ్డ జన్మించడంతో మీకు సంతోషం కలగడమే కాక, కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ సమయం మీకు మంచి జ్ఞానం, మతవిషయాల బోధలు దొరకడాన్ని సూచిస్తున్నది. ఇక మీరు మత సంబంధమైన లేక వినోదాత్మక ప్రయాణాలు చేస్తారు. పాలకులనుండి, మీ పై అధికారులనుండి, గౌరవాన్ని పొందుతారు.
Sep 21, 2024 - Oct 10, 2024
మీరు ఏది చేపట్టినా విజయం సాధిస్తారు. మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. మీరు కష్టాలన్నిటినీ దాటెస్తారు. మీ శతృవులు ఓటమిని ఎదుర్కొంటారు. మీ కు ప్రమోషన్ రావచ్చును. గౌరవాన్ని, మంచి కీర్తిని పొందుతారు. వ్యాజ్యాలు గెలుస్తారు. మొత్తంమీద విజయవంతమైన కాలం. వాపులు, కంటిసంబంధ సమస్యలనుండి కాస్త జాగ్రత్త పడవలసిఉంది. తల్లికి లేదా అత్తవారి తరఫు బంధువులు ఎవరికేనా అనారోగ్యం కలగవచ్చును.
Oct 10, 2024 - Nov 09, 2024
మీరు ఎన్నో అవకాశాలున్నా కూడా, దారిలో ఎదురు రానున్న అవకాశాలను అంది పుచ్చుకోలేరు, అన్నీ వ్యర్థమే అయిపోతాయి. ఆరోగ్యపరంగా మీకు కానీ, మీ తల్లితండ్రులకు కానీ సమస్యలు ఎదురుకావచ్చును. కనుక తగిన జాగ్రత్త తీసుకొనండి. దూరప్రయాణాలు ఉన్నా ఎక్కువగా లాభించవు. కనుక మానడం మంచిది. ఇది మీకు మిశ్రమ ఫలితాల కాలం. మీ సహోద్యోగులతోను, ఇతరులతోను, వివాదాలు కలగవచ్చును. జలుబు, జ్వరం సోకగలదు. ఏ ప్రత్యేక కారణం లేకుండానే, మానసిక ఆందోళన కలగవచ్చును.
Nov 09, 2024 - Nov 30, 2024
మీకు ఇది శారీరకంగాను మానసికంగాను అనుకూలమైన కాలం . మీ బంధువులకు ప్రత్యేకించి మీ సోదరులకి ఎదగడానికి మంచి సమయం. సఫలత ఖచ్చితమే కాబట్టి, మీ జీవితానికి సంబంధించిన ప్రయత్నాలు చెయ్యండి. వస్తు సంచయం కలుగుతుంది. మీ శతృవులెవరూ మీముందు కుప్పిగంతులు వేయలేరు. ఈ సమయంలో మీ కోరిన ది నెరవేరగలదు. విజేతగా నిరూపితమౌతారు.
Nov 30, 2024 - Jan 24, 2025
ఈ కాలం ఉద్యోగంలో స్థలం కానీ, స్థానం కానీ మార్పు కలిగే అవకాశ్మున్నది మానసిక వత్తిడితో(యాంక్జైటీతో) మీరు బాధ పడతారు. మీకు అసలు మానసిక ప్రశాంతత ఉండదు. కుటుంబ సభ్యుల దృక్పథం పూర్తి భిన్నాంగా ఉంటుంది. మీ అంచనాలకు వ్యతిరేకంగా ఫలితాలు ఉంటాయి కనుక పెద్ద పెద్ద పెట్టుబడులకు పోకండి. మీ స్నేహితులు, బంధువులు, వారి వాగ్దానాలను(మాటను) నిలబెట్టుకోరు. మీ దుష్ట స్నేహితులను గురించి కాస్త జాగ్రత్త వహించండి. ఏమంటే, వారి చెడు పనులు మీ ప్రతిష్టను దెబ్బ తీస్తాయి. మీ కుటుంబం వారి ఆరోగ్యాన్ని గురించి శ్రద్ధ వహించండి. లేకపోతే వారి అనారోగ్యం తలెత్తవచ్చును. అందుకే ఇప్పుడు ఎటువంటి ప్రయాణాలు ప్లాన్ చేయవద్దు. శారీరక ఇబ్బందులు కలగవచ్చును.
Jan 24, 2025 - Mar 14, 2025
మీకుగల సంగీత నైపుణ్యాలను పంచుకోవడాన్ని మీరు ఆనందపడతారు. అలాగే, సరిక్రొత్త సంగీత సంబంధ కళాఖండాన్ని రూపొందించే అవకాశం కూడా లేకపోలేదు. మీ పని సంబంధమైన లేదా సమాజ పరమైన ఉన్నతమైన నియమాలు, విలువలను తెలియపరచడంలో ఎంతగానో సఫలమౌతారు. మీ పథకాలకు కార్యరూపం ఎప్పుడైతే తీసుకువస్తారో అప్పుడు, ఆదాయం వస్తుందని ఎదురు చూడవచ్చును. డబ్బు తప్పక మీ చేతికందుతుంది. మీ వ్యక్తిగత విశ్వాసాలు, స్వప్నాలు, తత్వవిచారాలను తప్పక ప్రభావితం చేస్తుంది. మీ శత్రువులు మిమ్మల్ని నిలువరించలేరు. మొత్తంమీద, ఈ కాలం మీకు మంచి సంతోషదాయకంఅనడం నిశ్చయం. మీ కుటుంబసభ్యులకు మరొకరు అదనంగా ఒకరు జతపడతారు.
Mar 14, 2025 - May 11, 2025
భౌతికంగా ను మానసికంగాను కూడా మీకీ దశ ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ బంధువులకు కూడా మంచి కాలం. మీ జీవితకాలంలో గల కెరియర్ కోసం చేసే ప్రయత్నాలను కొనసాగించండి. ఏమంటే, ఇది కలిసివచ్చే కాలం. వస్తు లాభం కూడా సూచితం. ఈ సమయంలో భూమి, యంత్ర పరికరాల కొనుగోలు కూడా జరుగుతుంది. వ్యాపారం లోను, వాణిజ్యంలోను లాభాలు నిశ్చయం. మీ శతృవులు మీముందు, తోక ఝాడించలేరు, మీకు అపకారం చేయలేరు. ప్రేమవిషయాలలో ఇది మీకు అనుకూలమైన కాలం. మీ కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ సహకారం అందుతుంది.
May 11, 2025 - Jul 01, 2025
మీచుట్టూగల వ్యక్తులు మీలోగల నిజమైన శక్తిని గుర్తిస్తారు. ఇది మీకు ఎంతో సంతోషాన్ని కలిగించడమే కాక, మీకు నిరంతరంగా శాయశక్తులా కష్టపడడానికి స్ఫూర్తినిస్తుంది. ప్రయాణాలకి మీకు ఎంతో అనుకూలమైన కాలం. పదండి ఎదురైన ఆనందాన్ని ఆస్వాదించండి. ఆఖరుకు మీ విజయాలను విశ్రాంతిగా అనుభవించవచ్చును, దాంతోపాటు, ఎంతోకాలంగా మీరుపడుతున్న కష్టం ఫలించుతుందికూడా. ఈ సమయం మిమ్మల్ని పేరున్న వ్యక్తుల మధ్యన నిలబెడుతుంది. సంతానం కావాలన్న కోరిక నెరవేరుతుంది. మీ సృజనాత్మకత ఇతరుల ప్రశంసలు పొందుతుంది.
Jul 01, 2025 - Jul 23, 2025
వృత్తిలోనైనా, వ్యక్తిగతంగానైనా భాగదారులు ఈ సంవత్సరానికి ఉండడం మంచిది. ఏది ఏమైనా, మీరు బహు కాలంగా ఎదురు చూస్తున్న ఉక్కిరిబిక్కిరి చేసే జీవిత గమనాన్ని మార్చేసే అనుభవం అతి ముఖ్యమైనది ఇప్పుడే పొంది ఉంటారు. వార్తా ప్రసారాలు, సంప్రదింపులు మీకు సరిపడతాయి. అనుకూలమై, మీకు క్రొత్త అవకాశాలను తీసుకొస్తాయి. మీకి దానగుణం ఉన్నది, మీరు ఇతరులకి సహాయం చేస్తారు. వృత్తిరీత్యా / ఉద్యోగరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. అవి మీకు లాభిస్తాయి. అదృష్టాన్ని తెస్తాయి. ఒకవేళ ఉద్యోగులైతే పని పరిస్థితులు మెరుగవుతాయి
Jul 23, 2025 - Sep 21, 2025
మీ తెలివికి, పరిజ్ఞానానికి సృజనాత్మకతకు ఇది శక్తినినిరూపించుకునే కాలం. మీకు చాలా ఆహ్లాదకరంగా అనిపించడంతో, మీ పనిని కళాత్మకంగా భావిస్తారు. క్రొత్త ఆలోచనలు చేస్తారు. పరిచయాలు, సంబంధాలు మరెన్నోఅవకాశాలను తెచ్చి, విస్తృతికి కారణమౌతాయి. ధైర్యంతో చేపట్టిన చర్యలు మీ తెలివికి తోడై, మీకు ఆదాయాన్నిస్తాయి. అంతే స్థాయిలో ఆధ్యాత్మికతను కలిగిస్తాయి. కుటుంబంలో సామరస్యత నెలకొంటుంది. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చును. ఇల్లుకట్టడం, వాఅనం కొనుగోలు, జరగవచ్చును. మీకిది చాలా ఆశాజనకమైన కాలం.