బాగా సన్నిహిత బంధువు లేదా కుటుంబ సభ్యులొకరి మరణ వార్త వింటారు. మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి ఏమంటే, అనారోగ్యం వలన బాధలు కలగే అవకాశాలున్నాయి. సంపద నష్టం, ఆత్మ విశ్వాసం కోల్పోవడం, నిష్ఫలమైన ప్రయత్నాలు, మానసిక ఆందోళనలు అన్నీ కలగవచ్చును .ఇతరుల ఈర్ష్య మీకు సమస్యలకు కారణం కావచ్చును. దొంగతనం వలన కూడా ఆర్థిక నష్టం కలిగేను. అంతేకాదు, మీరు చెడు సావాసాలు, చెడు అలవాట్లకు కూడా లొంగవచ్చును.
Jan 24, 2024 - Mar 22, 2024
మీరు వెదజల్లే అమితమైన శక్తి (ఎనర్జీ) మీజీవితంలో మిమ్మల్ని సమర్థించే ఎంతో మందిని మీవైపుకు ఆకర్షిస్తుంది. మీ శతృవులు మిమ్మల్ని తలెత్తి చూడడానికి సాహసించరు. ఆర్థికంగా ఇది మీకు అత్యుత్తమ కాలం. మీ వ్యక్తిగతంగా, మీ స్నేహితులతో ఉన్నపుడు ఇంకా కుటుంబం తోను మంచిగా ఉండడానికి క్రొత్తదారులు నేర్చుకుంటున్నారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచుకుంటున్నకొద్దీ, మీ వరకు మీరు ఆత్మ శక్తిని పెంచుకుంటే మీ అవసరాలకు నిలబడగలుగుతారు. మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీ పని పరిస్థితులు తప్పనిసరిగా మెరుగవుతాయి. మీ సహోద్యోగులు అధీన పనివారు మీకు అన్నివిధాలా బాగా సహకరిస్తారు. మీరు కొంత భూమిని, లేదా యంత్రాలను కొనుగోలు చేస్తారు. మీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ అవసరం.
Mar 22, 2024 - May 13, 2024
ఆస్తి సంబంధ లావాదేవీలద్వారా మంచి ప్రయోజనాలు కలిగే కాలమిది. ఆర్థిక వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కరించబడతాయి. మీరు క్రొత్త ఆదాయ మార్గాలను గుర్తించగలుగుతారు. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న వేతనపెంపు అమలులోకి వస్తుంది. వ్యాపార ప్రయాణాలు సఫలం కావడమేకాక, ఫలవంతంగా కానవస్తాయి. ఈ కాలం ముఖ్య లక్షణం ఏమంటే, మీ స్థాయి ఏదైనా అగుగాక, మీకు లభించే గౌరవ ప్రపత్తులలో సానుకూల ఎదుగుదల కానవస్తుంది. మీరు డబ్బును విలాసాలకు ఖర్చు పెట్టడానికి, మరియు, క్రొత్త బండి కొనడానికి వెచ్చించడానికే మొగ్గు చూపుతారు.
May 13, 2024 - Jun 03, 2024
మీ వ్యాపార భాగస్థులతో లేదా సహచరులతో పథకాల అమలు విధానాలు, గురించి అయోమయం(కన్ఫ్యూజన్) భేదాభిప్రాయాలు కలిగే అవకాశం ఉన్నది. భారీ విస్తరణ మరియు దీర్ఘకాల పథకాలు అమలు హోల్డ్ లో పెట్టడం మంచిది.ఈ దశ అంతా కూడా ప్రధాన దృష్టి (ఫోకస్)అంతా ప్రస్తుతం గల వనరుల నుండి లాభాలను ఆర్జించే దిశగా ఆలోచించాలి. వీలైనంత వరకు ప్రయాణాలను మాని అవాయిడ్ చెయ్యండి. మీ శతృవులు మీకు హాని చెయ్యడానికి శాయ శక్తులా ప్రయత్నిస్తారు. మీ మిత్రుల గురించి కూడా మీరు కాస్త హెచ్చరికగా ఉండాలి. ఎందుకంటే, వారు మోసానికి సూచన కూడా. మీగురించి చక్కటి శ్రద్ధ తీసుకొండి. కారణమేమంటే అదే మీకు ,చింతకు కారణమవుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలకు అవకాశాలున్నాయి కనుక ఆరోగ్యంగురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. అలాగే, ఈ సమయంలో, వాస్తవంలో , ప్రాక్టికల్ గా ఉండడానికి యత్నింఛండి. నిజానికి మీకు పనికిరాని విధానల వైపుకు ఆకర్షితులవచ్చును. ధన నష్టం సూచన ఉన్నది. శీలం లేని వ్యక్తుల గురించి వివాదాలు ఉండవచ్చును.
Jun 03, 2024 - Aug 03, 2024
ఇంతకు ముందు లేని అధికారం మీ చేతికొస్తుంది. వ్యక్తిగతంగా మీకిష్టమైన వారు తమ ఇష్టపూర్తి కోసం, సౌకర్యాలకోసం, మీపైన ఆధారపడతారు. మీ మానసిక శక్తి చాలా గొప్పది. మరి ముఖ్యంగా మీజీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత తీయనై, బలపడుతుంది. సంతానయోగం కానవస్తున్నది. మీ క్రింద పనిచేసే వారు పూర్తి విధేయతతో మీ కు పనిచేస్తారు. మొత్తం మీద ఈ కాలం అనుకూలం. ఆహ్లాదకరం.
Aug 03, 2024 - Aug 21, 2024
జీవితం పట్ల ఉత్సాహంగా ఉంటారు. మంచి సాహసం కలిగి, తీవ్రమైన లేదా హింసాత్మక ప్రవర్తన కలిగిఉంటారు. బుద్ధి పైన అదుపు తప్పడం, మరియు విచక్షణ కోల్పోవడం జరగవచ్చును. మీకు ప్రజాదరణ తగ్గడంతో పాటు, వివాదాలతో కొంత సమస్య తలెత్తవచ్చును. ఈ కాలం ప్రేమకు, ప్రేమాయణాలకు అనుకూలం కాదు. సంతానం, మరియు, జీవిత భాగస్వామి అనారోగ్యంతో బాధపడవచ్చును. ప్రయోజనకర అంశాలను చూస్తే, సంతానప్రాప్తి, పై అధికారుల నుండి ప్రయోజనం సమకూరే అవకాశం ఉంది.
Aug 21, 2024 - Sep 21, 2024
ఈ కాలం మీకు కలిసి వస్తుంది. ఆర్థికంగా స్థిరత్వాన్ని కల్పిస్తుంది. మీ ఆశలకు,కలలనుఅనుసరించి పనిచేస్తూ వాటికొక రూపుకల్పించవచ్చును. ప్రేమకు రొమాన్స్ కి అనుకూలమైన కాలం. మీరు క్రొత్త పరిచయాలు పొందుతారు. అవి ఎంతో ఫలవంతమూ, సహాయకరము అవుతాయి.చదువరులచే మీరు ప్రశంసలు,గౌరవము పొందుతారు. దాంతో జీవితభాగస్వామితో కలిసిమరింత ప్రతిష్ఠను పొందుతారు. దూర ప్రయాణ సూచన కూడా ఉన్నది.
Sep 21, 2024 - Oct 12, 2024
స్నేహితులతోను, బంధువులతోను, సహచరులతోను జాగ్రత్తగా ఉండండి. తగువులు వచ్చే కాలం. వ్యాపారానికి ఇది మంచి సమయం కాదు. ఆకస్మిక నష్టాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రహస్య కార్యాలపైన ఖర్చు పెట్టే అవకాశం ఉంది. మానసిక వత్తిడి తోను, అలసటతోను ఇబ్బంది పడగలరు. గాయాలు, దెబ్బలు తగిలే అవకాశమున్నది కనుక జాగ్రత్తగా ఉండవలసింది..ప్రత్యేకించి బండి నడిపేటప్పుడు బహు జాగ్రత్త వహించాలి.
Oct 12, 2024 - Dec 06, 2024
మీరు మీ భాగస్వాములు/ సహచరులతోమంచి సత్సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించినా ఫలించదు. అభివృద్ధి పెరుగుదల అంత సులభం కాదు. ఈ దశ మీకు సవాళ్ళతోను, కష్టాలతోనుఆరంభమవుతుంది. వివాదం మరియు అనవసర కోపపూరిత దాడులు జరుగుతాయి. ఆకస్మిక నష్టాలు కలగవచ్చును. ఆరోగ్య సమస్యలు చికాకు పరచవచ్చును. లాభదాయకం కాని ఒప్పందాలను మీరు పూర్తి చేయవలసి రావచ్చును. వ్యతిరేకపరిస్థితులలో, నిరోధక శక్తిని, రెసిస్టెన్స్ ని పెంపొందించుకొంఇడి. రిస్క్ తీసుకోవడం ఆపాలి, అన్ని రకాల స్పెక్యులేషన్లను మాని అవాయిడ్ చెయ్యాలి.
Dec 06, 2024 - Jan 24, 2025
మీగురించి తగిన జాగ్రత్త తీసుకొండి. మితిమీరిన బాధ్యతలను నెత్తికెత్తుకోవద్దు. అలా అయితే చాలాకాలం పాటు, మీజీవితాన్ని సవ్యంగా గడపగలుగుతారు. కాకపోతే, కొన్ని నిరాశలు ఎదురుకావచ్చును. మీ ధైర్యం అంకితభావన మీ సుగుణాలు. ఇవి కొంతమందిని కించపడేలా చేయవచ్చు. పెద్ద మొత్తంపెట్టుబడులకు పోవద్దు. ఏమంటే, మీరు అనుకున్నట్లుగా పరిస్థితులు అనుకూలించక పోవచ్చును. మీ స్నేహితులు, సహచరులనుండి, అనుకున్నట్లుగా సరైన సహకారం అందకపోవచ్చును. కుటుంబ సభ్యుల దృక్పథం మీకు భిన్నంగా ఉండవచ్చును. ఆరోగ్యం కాస్త చికాకు పరచవచ్చును. తల త్రిప్పటం, జ్వరం దాడులు, చెవి ఇన్ఫెక్షన్ మరియు వాంతులు కలగవచ్చును.