ఈ వ్యక్తి, అలవికాని లాభాలు, సంపద మొదటినుండి పొందుతారు. అది లాటరీ , స్పెక్యులేషన్ షేర్లు మొదలైనవి ఏమార్గమైనా కావచ్చును. స్నేహితులు, శ్రేయోభిలాషులు అంతా మీ వ్యవహారాలలో మిమ్మల్ని సమర్థించి, మీకు సహకరించవచ్చును .మీరు వ్యాపార వ్యవహారాల(బిజినెస్ డీలింగ్ ల)ద్వారా చెప్పుకోదగినంత సంపాదిస్తారు. మంచి స్థానం, హోదా పొందుతారు. మీరు చక్కగా గౌరవం పొందుతారు మరియు మృష్టాన్న భోజన సౌఖ్యం( రుచికరమైన భోజనం) ఆనందం కలుగుతుంది.
Sep 24, 2023 - Nov 17, 2023
ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉండి పైకి ఎదుగుతారు. మీరు ఈ కాలంలో, దాంపత్య సౌఖ్యాన్ని పొందుతారు. పరపతిగల వారితో మీ పరిచయాలు తప్పక ఇంకా పెరుగుతాయి. మీ వైరివర్గం, మీవైపుకు కనీసం ఎదురుపడడానికి కూడా సాహసంచేయలేరు. సుదీర్ఘ ప్రయాణం ప్రయోజనకరం కాబోతున్నది. ప్రేమ, రొమాన్స్ వరంగా మారనున్నాయై. మీరొక నాయకునివలె, మీ శతృవులను గెలుస్తారు. చిన్నపాటి అనారోగ్యం కాన వస్తుంది. పిల్లలతో అనుబంధాలు బాగులేకపోయినా మిగతా కుటుంబ సంబంధాలు సంతృప్తికరంగా ఉంటాయి.
Nov 17, 2023 - Jan 05, 2024
ఏదో విధంగా కాలం, అదృష్టం మీ పై మీ చర్యలపై దృష్టి ప్రసరించుతాయి. మీరు చేసిన పనులకు, శ్రమకు కితాబునిచ్చుకుని, ఇతరులు దానిని గుర్తించి, మీవైపు తలెత్తిచూసేటందుకు ఇది తగిన వేళ. మీ వ్యకిగత సంబంధాలు మెరుగై ప్రోత్సాహకరంగా ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు. మీ పిల్లలు మీకు సంతోషప్రదం అవుతారు. ప్రయాణాలు ఫలవంతం, జనులు మిమ్మల్ని చూడడానికి, ఉత్సుకతతో ఉంటారు. ఈ సమయం మీకు ధ్యానం చేసి, మానవ వ్యవస్థ మనుగడయొక్క సత్యాన్ని గురించి అన్వేషించడానికి కారణం కాగలదు. కొంత ఖరీదైన మరియు అరుదైన కొనుగోలు జరుగుతుంది. మొత్తం మీద, ఈ సమయం మీకు, చాలా కలిసి వస్తుంది
Jan 05, 2024 - Mar 03, 2024
శుభవేళకి మహోదయం ఈ సమయం అనవచ్చును. మీరు ఉదాత్తమైన వ్యవహారాలో మీరు నిమగ్నమవడానికి అవకాశమున్నది. మీరు ఎంతో సంతోషంగా ఉంటారు.వ్యతిరేక పరిస్థితులను కూడా మీరు తట్టుకుంటారు. మీ పిల్లలకు అనారోగ్య సూచనలున్నా, కొంత సమస్యలున్నా కూడా, కుటుంబ సౌఖ్యం మీకు తప్పక అందుతుంది. మీ స్వయం కృషివలన ఆదాయం పెరుగుతుంది. మీ శతృవులు మీకు అపకారం చేయలేరు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కానరావచ్చును. మీ స్నేహితులు, సహచరులు, మీ ప్రయత్నాలలో సహకరిస్తారు.
Mar 03, 2024 - Apr 23, 2024
ప్రయాణాలు ఉత్సాహవంతంగా ఉండి, సమానవ్యక్తుల పరిచయ సంబంధాల సంభ్రమాని కి దారి తీస్తుంది. మీరు తెలివితో, ఇంటా బయటాబాధ్యతలను నిర్వర్తించడమే కాకుండా ఈ రెండిటిద్వారా మీ జీవితంలోముఖ్యమైన విషయాలను నిర్వర్తిస్తారు. చాలాకాలంగా గల కలలు సాకారం అవుతాయి. అంతే కాక, కొద్దిగా కష్టమే అయినా అవి మీకు ఎదుగుదలకు కారణమౌతాయి. మంచి ఆదాయంతోపాటు, పేరుప్రతిష్ఠలు వస్తాయి. పాతస్నేహితులను కలవడం కూడా ,సూచింపబడుతోంది. స్త్రీ అయితే మరొక పురుషునితోను, మగవారైతే మరొక స్త్రీతోను పరిచయం కలుగుతుంది. పై అధికారులనుండి కొంత సాయం అందుతుంది. లేదా బాధ్యతాయుతమైన వారు లేదా పరపతిగల పదవిలో ఉండేవారి నుండి మీకు సహాయం అందుతుంది.
Apr 23, 2024 - May 15, 2024
వృత్తిలోను, వ్యక్తిగతంగాను ఆటంకాలు ఎదురౌతాయి. కష్టకాలాన్ని తెలివితోను, నిదానంగాను ఎదుర్కొనండి. ఏమంటే, ఈ సమయంలో కఠినంగా ర్యాష్ గా ఉండడం వలన ఏమీ సహాయం జరగదు. ప్రయాణం అనుకూలించదు. కనుక మానడానికి ప్రయత్నిఛండి. మీ కుటుంబం వైపునుండి పూర్తి సపోర్ట్, ఉండదు. సమర్థించరు. సంతాన సమస్యలు ఉంటాయి. మీ శతృవులు మీకు హాని కలిగించగల ఏరాయిని విసరకుండా వదలరు. మీరు ధైర్యంగా స్థైర్యంగా ఉండడం, మీ సవ్యమైన నిర్ణయాలకు కట్టుబడి ఉండడం మంచిది. పొట్టకు సంబంధించి, అసౌకర్యం కొంత ఆందోళనకు దారితీస్తుంది.
May 15, 2024 - Jul 15, 2024
అదృష్టం మీ వైపు ఉంటుంది. మీరు ఏ ప్రోజెక్ట్ నైనా, లేదా ఏ స్పెక్యులేషన్ నైనా మీవైపు త్రిప్పుకోగలరు. జీవితంలో ఉన్నతి దిశగా పురోభివృద్ధి జరుగుతుంది. మీరు కావాలనుకుని చేపట్టిన ఏపనైనా చక్కగా సఫలంఅయే కాలమిది. క్రొత్తగా ఆస్తులు పొందుతారు. తెలివిగా పెట్టుబడులు చేస్తారు. ఇతర స్త్రీ /పురుషులతో సంతోషంగా వినోదాన్ని పొందుతారు. కుటుంబంలో సహకారం పెంపొందడం కనపడుతుంది. రుచికరమైన అహారం పట్ల మక్కువను పెంచుకుంటారు. ఇంటిలో అందరు ఇష్టమైన సభ్యులమధ్యన గెట్ టుగెదర్ లు ఆనందిస్తారు.
Jul 15, 2024 - Aug 02, 2024
ఈ సమయంలో మీరు, శారీరకంగా బలహీనంగా ఉండటంతో, శ్రమకోర్చే పనులు చేపట్టలేరు. మీరు అనైతికమైన పనులలో నిమగ్నం అయేఅవకాశమున్నది. మీరు వ్యవసాయ సంబంధించినవారైతే, నష్టాలు కలగవచ్చును. పైఆధికారుల నుండి సమస్య ఎదురవ వచ్చును. మీ అమ్మగారిని, అనారోగ్యం చికాకు పరవచ్చును. ఇంటిలో అవాంఛనీయ మార్పు కలగవచ్చును. ర్యాష్ గా బండిని నడపవద్దు.
Aug 02, 2024 - Sep 01, 2024
మీరు ఎంతో ఎత్తుకు ఎదగడానికి, వృత్తిలో రాణించడానికి ఈ కాలం యోగదాయకంగా ఉన్నది. వ్యాపార భాగస్వాములతోను, సహోద్యోగులతోను లాభసాటిగా ఉండే కాలం. జీవిత భాగస్వామితో అనురాగం సంతోషం కలుగుతుంది. వ్యాపార వాణిజ్యాలు మరియు విదేశీ ప్రయాణాల వలన లాభాలు కలగవచ్చును. ఆరోగ్య సంబంధమైన చికాకులు మీ మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తాయి. మీ క్రమశిక్షణ, స్వయం పర్యవేక్షణ, ఇంకా, మీ రోజువారీ దినచర్యలపై అదుపులు, బాగా ఉపయోగపడతాయి. జ్వరం, కీళ్ళనొప్పుల గురించి జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినే సూచనలున్నాయి.
Sep 01, 2024 - Sep 23, 2024
స్నేహితులతోను, బంధువులతోను, సహచరులతోను జాగ్రత్తగా ఉండండి. తగువులు వచ్చే కాలం. వ్యాపారానికి ఇది మంచి సమయం కాదు. ఆకస్మిక నష్టాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రహస్య కార్యాలపైన ఖర్చు పెట్టే అవకాశం ఉంది. మానసిక వత్తిడి తోను, అలసటతోను ఇబ్బంది పడగలరు. గాయాలు, దెబ్బలు తగిలే అవకాశమున్నది కనుక జాగ్రత్తగా ఉండవలసింది..ప్రత్యేకించి బండి నడిపేటప్పుడు బహు జాగ్రత్త వహించాలి.