ఈ రాశి వారిని విరోధులు మరియు వ్యతిరేకులు ఎదురుపడడానికి కూడా సాహసించరు. న్యాయపరమైన వివాదాలు మీకు అనుకూలంగా ఉంటాయి. పేరు, ప్రతిష్ఠ ధనలాభం ఇంకా ఆర్థికసంబంధ వ్యవహారాలలో విజయాలు మీ రు అనుభవిస్తారు. బంధువులు, సోదరుల నుండి మంచి సహకారం అందే సూచనలున్నాయి. మతపరంగా పవిత్ర స్థల దర్శనం చేస్తుండడం, ప్రజల సహాయం మీకు అందడం జరుగుతుంది. మీప్రయత్నాలు ఫలిస్తాయి, శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు.
Apr 14, 2022 - Jun 02, 2022
ఆరోగ్యాన్ని పరిరక్షించుకొని, మీగురించి, మీ అవసరాలను తీర్చుకోవడానికిగాను అవసరమైన శారీరక శ్రమను కలిగించే క్రీడలలో పాల్గొనడం బహుశః మంచి సాధనంగా భావించుతారు. మీయొక్క ఈ లోతైన పరిజ్ఞానం, మీరు, చురుకుగా మారి, మీశక్తిని పొందడానికి సహాయం చేస్తుంది. మీరు వెదజల్లే గొప్పశక్తి పుంజాలు తప్పనిసరిగా ఎంతోమంది తమకుతామే, ఏదోవిధంగా సహాయపడడానికి ముందుకు వచ్చేలా, వారిని మీ జీవితంలోకి ఆకర్షిస్తాయి. మీ జీవితభాగస్వామి మీ విషయానందాలకి తనవంతు కృషిని అందించుతారు. పనిచేసే చోట నాయకత్వం వహించడానికి మీకు పిలుపు వస్తుంది. అక్కడ మీ శక్తిని సమయాన్ని వెచ్చించవలసి వస్తుంది. మీరు ఎంతో గౌరవింపబడతారు, ప్రచుర కీర్తివంతులౌతారు.
Jun 02, 2022 - Jul 30, 2022
ఉద్యోగ అంశాలు చాలవరకు ఆశించినకంటె తక్కువగా ఉంటాయి. మొత్తంమీద అంత సంతృప్తికరంగా ఉండదు. పనిచేసే చోట చీకాకు ఒత్తిడి ఉంటాయి. రిస్క్ ఉండే లక్షణాలు ఏవి ఉన్నాకానీ మొత్తంగా విసర్జించాలి. ఏ ముఖ్యమైన పనినీ మీరు చేపట్టవద్దు. వృత్తి పరంగా మీకు ఈ సంవత్సరం ఆటంకాలు మరియు సవాళ్ళు అనుభవంలోకి వస్తాయి. అస్థిరత, అయోమయం ఉంటాయి. మీ స్వంతమనుషులనుండి మీకు సహాయం అందదు. మీకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు జరిగే అవకాశం ఉంటుంది.మీదగ్గరి వ్యక్తుల అనారోగ్యం మీకు ఆతృతను కలిగిస్తుంది. మీకు ఈ దశలో, కుటుంబ సంబంధ సమస్యలు ఎదురవుతాయి. మీరు వీలైనంత వరకు నిరాడంబరంగాఉంటూ మార్పులేమీ చేపట్టకుండా ఉండండి.
Jul 30, 2022 - Sep 19, 2022
ఏది ఏమైనా మీరు మరీఅంతగా అదృష్టంకోసం అర్రులు చాచడం మానాలి. మీ డబ్బు వివిధ రీతులలో చిక్కుకుపోవడం వలన మీకు ఆర్థికంగా గొప్ప ఇబ్బంది కలగవచ్చును. ఆరోగ్య సమస్యకూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చును. ప్రత్యేకించి మీరు దగ్గు, కఫ సంబంధ సమస్యలు, కంటి కలకలు, వైరల్ జ్వరం సోక వచ్చును. బంధువులు, స్నేహితులు, లేదా సహచరులతో వ్యవహరించేటప్పుడు, కాస్త జాగ్రత్త వహించండి. ప్రయాణాలు ఫలవంతం కాకపోవచ్చును. కనుక వీలైనంతవరకు తప్పించుకొండి. చిన్న విషయాలు కూడా, గొడవలకి దారితీయవచ్చును. అజాగ్రత్త వలనలేదా, నిర్లక్ష్యం కారణంగా ఈ సమయం మీకు, సమస్యలను చీకాకు పుట్టించే పరిస్థితులను తీసుకురావచ్చును. ప్రయాణాలు మానాలి. .
Sep 19, 2022 - Oct 11, 2022
ఒకవేళ, ఉద్యోగస్తులైతే, సంవత్సరం మహా దూకుడుగా ఉంటుంది చురుకుగా డైనమిజం మరియు ఎదుగుదల ఉంటాయి. ఏదేమైనా, పని పరిస్థితులు వత్తిడితోనే ఉంటాయి. పై అధికారులతో వాదప్రతివాదాలు, ప్రతిస్పర్థలు ఉంటూనే ఉంటాయి. సాధారణంగా ఈ దశ అంతగా బాగుండదు. ఏమంటే, దగ్గరి సహచరులు, స్నేహితులు, మరియు కుటుంబ సభ్యులు, అందరూ దూరంగా అనిపిస్తారు. పెద్దగా మార్పు ఉండదు, వాంఛితం కూడా కాదు. మీ దృక్పథం, అసభ్య భాషా పదజాలం అలవాటు, అతి దగ్గరైన వారితో, కొన్ని సమస్యలను సృష్టిస్తుంది. కనుక మీ మాటలను అదుపులో ఉంచుకొండి.
Oct 11, 2022 - Dec 11, 2022
మీరు ప్రయత్నించే వ్యక్తిగత సంబంధాలు అంతగా ఫలవంతంకావు పైగా, ఇంటా బయటా పనిచేసే చోట కొంతవరకు చికాకులకు దారితీయవచ్చును. మీ ఆరోగ్యం కోసం జాగ్రత్తను వహించండి. అలాగే మీ ప్రతిష్ట.ను మెరుగు పరుచుకోచూడండి. ఇంద్రియపరమైన (సెన్స్యుఅల్) ఆలోచనలు నిరాశ పరచడమే కాక కొంత అవమానకరంకూడా. ఇతర స్త్రీపురుషులతో సామరస్య ధోరణి కొంత తగ్గవచ్చును. మీ జీవితంలో మీ ఆరోగ్య సమస్యలు కొంత అస్తవ్యస్తతను కలగచేయవచ్చును. అనవసర ఖర్చులకు పాల్పడే అవకాశమున్నది. మొత్తంమీద ఇది మీకు అంతగా సంతోషదాయక కాలం కాదు. శారీరకంగా మీకు నీరసంగా నిస్పృహగా అనిపిస్తుంది.
Dec 11, 2022 - Dec 29, 2022
అనుకోని సమస్యలు తలెత్తవచ్చును. బంధువులతో హార్థిక సంబంధాలు నెరపడం మంచిది. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. దీర్ఘ కాల అనారోగ్యం కలగవచ్చును. జీవిత భాగస్వామి మరియు సంతానం యొక్క ఆరోగ్యం కూడా కనిపెట్టుకొని ఉండాలి. చాటుమాటు వ్యవహారాలు చేయరాదు. వ్యాపార విషయాలు కూడా నిజానిజాలు తెలుసుకొనే చేపట్టాలి. కురుపులు లేచే అవకాశమున్నది.
Dec 29, 2022 - Jan 28, 2023
మీరు ఎన్నో అవకాశాలున్నా కూడా, దారిలో ఎదురు రానున్న అవకాశాలను అంది పుచ్చుకోలేరు, అన్నీ వ్యర్థమే అయిపోతాయి. ఆరోగ్యపరంగా మీకు కానీ, మీ తల్లితండ్రులకు కానీ సమస్యలు ఎదురుకావచ్చును. కనుక తగిన జాగ్రత్త తీసుకొనండి. దూరప్రయాణాలు ఉన్నా ఎక్కువగా లాభించవు. కనుక మానడం మంచిది. ఇది మీకు మిశ్రమ ఫలితాల కాలం. మీ సహోద్యోగులతోను, ఇతరులతోను, వివాదాలు కలగవచ్చును. జలుబు, జ్వరం సోకగలదు. ఏ ప్రత్యేక కారణం లేకుండానే, మానసిక ఆందోళన కలగవచ్చును.
Jan 28, 2023 - Feb 19, 2023
ఇది మీకు అతి యోగదాయకమైన సమయం కనుక వీలైనంత ప్రయోజనం పొందడానికి ప్రయత్నించండి. మీకు గల అన్ని వత్తిడులు, సమస్యలనుండి విముక్తి పొందుతారు. కుటుంబ మరియు, వృత్తి పరంగా మీకు అనుకూలం . బండి నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్త గా ఉండాలి. మీరు మీ శతృవులను సంపూర్ణంగా అణచేయాలనుకుంటారు కనుక మీ ముందుకు రావడానికి ధైర్యం చేయరు. సాహసం చూపి, వృత్తిపరమైన ఉత్తమ ఫలితాలను పొందుతారు.
Feb 19, 2023 - Apr 14, 2023
క్రొత్త పెట్టుబడులు మరియు రిస్క్ లు అవాయిడ్ చెయ్యాలి. ఈ దశలో మీకు అవాంతరాలు మరియు అడ్డంకులు ఎదురు కావచ్చును. పనిచేసే ఉద్యోగస్తులైతే, అభివృద్ధిని చూస్తారు. అదికూడా కష్టపడి పనిచేసి, దీర్ఘ కాలంగా ఆశావహ దృక్పథం కలిగి ఉంటే, ఇది సాధ్యం. విజయానికి దగ్గరి దారేదీ లేదు కదా. మీరు చక్కని ఫలితాలకోసం స్థిరంగా నిరంతరంగా పనిచేస్తూ పోవాలి. సంవత్సర ప్రారంభంలో, పని పరిస్థితులు, కొద్దిగా అస్తవ్యస్థంగా వత్తిడి కలిగించేలా ఉంటాయి. ఇలాంటప్పుడు క్రొత్త అభివృద్ధిని లేదా వేగంగా పనిచెయ్యడం ఉండకూడదు. ఈ సానుకూల సమయంలో మీ ఆరోగ్య పరిస్థితులు మిమ్మల్ని సరిగా పనిచేసి మీ లక్ష్యాలను చేరుకోనివ్వవు. అందుకే ఆరోగ్య పరీక్షలు అవసరం. సాధారణంగా జ్వరం సమస్యకి చెక్ చేయించుకోవాలి.