ఇది మీకు బహు అనుకూలమైన కాలం, పట్టినది బంగారమయ్యే కాలం అంటే, ఇక మీరు కార్యోన్ముఖులు కావలసిన(పని చేయవలసిన కాలం). వివిధ రంగాల నుండి అనుకోని విధంగా బహుమతులు, లాభాలు వచ్చి పడిపోతుంటాయి. ఇది మీకు మరింత మెరుగైన కెరియర్ ను , సర్వతో ముఖాభివృద్ధిని అందిస్తుంది. మీ వ్యతిరేకులు, మీ దారిలో ఎదురుపడడానికి కూడా సాహసించరు. ఇక మీ వంతుగా తగినవిధంగా ఆకర్షణను, కీర్తిని పొందుతారు. పాలకుల నుండి, మీ పై అధికారులనుండి, ఉన్నతాధికారులనుండి, అభిమానాన్ని చూరగొంటారు.మీకుచక్కని ఆరోగ్యం, శరీర సౌష్టవం ఉంటాయి. ఈ ఏడాది మీకు, వాహన ప్రాప్తి కూడా సూచిస్తున్నది.
Jun 12, 2023 - Aug 12, 2023
ఇంతకు ముందు లేని అధికారం మీ చేతికొస్తుంది. వ్యక్తిగతంగా మీకిష్టమైన వారు తమ ఇష్టపూర్తి కోసం, సౌకర్యాలకోసం, మీపైన ఆధారపడతారు. మీ మానసిక శక్తి చాలా గొప్పది. మరి ముఖ్యంగా మీజీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత తీయనై, బలపడుతుంది. సంతానయోగం కానవస్తున్నది. మీ క్రింద పనిచేసే వారు పూర్తి విధేయతతో మీ కు పనిచేస్తారు. మొత్తం మీద ఈ కాలం అనుకూలం. ఆహ్లాదకరం.
Aug 12, 2023 - Aug 30, 2023
చికాకుల సంసారానికి, మరింత శ్రద్ధ, జాగ్రత్త అవసరమౌతాయి. కుటుంబ విషయాలు, టెన్షన్ లను రెండింటినీ నెట్టుకుని రావడం కొంత కష్టమే. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. కుటుంబంలో ఒకరు మరణించవచ్చును. భారీగా ఆర్థిక నష్టాలు, ఆస్తి కోల్పోవడం ఉండవచ్చును. ఆర్థిక విషయాల పట్ల శ్రద్ధను వహించాలి. నోటి మరియు కంటి బాధలు, సమస్యలకు కారణం కావచ్చును.
Aug 30, 2023 - Sep 29, 2023
అనవసరమైన ఖర్చులకు అవకాశముంది. ప్రేమ, రొమాన్స్, సాధారణజీవితం అంతగా ప్రోత్సాహకరంగా లేదు. జీవితంలో ఎదురయే వివిధ పరిస్థితులకి ఎంతో సంయమనంతోను, ప్రశాంతతతోను ఉండమని సూచన. ఊహాలోకం(గెస్వర్క్) పనిచేయదు. కనుక అటువంటివాటిలో తలదూర్చవద్దు. కన్నులు, కఫ సంబంధ సమస్యలు మరియు స్ప్లీన్(కాలేయం) సంబంధ సమస్యలుకలగవచ్చును. అసత్యాలు పలికి, మీకు మీరే సమస్యలను సృష్టించుకుంటారు.
Sep 29, 2023 - Oct 20, 2023
స్నేహితులతోను, బంధువులతోను, సహచరులతోను జాగ్రత్తగా ఉండండి. తగువులు వచ్చే కాలం. వ్యాపారానికి ఇది మంచి సమయం కాదు. ఆకస్మిక నష్టాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రహస్య కార్యాలపైన ఖర్చు పెట్టే అవకాశం ఉంది. మానసిక వత్తిడి తోను, అలసటతోను ఇబ్బంది పడగలరు. గాయాలు, దెబ్బలు తగిలే అవకాశమున్నది కనుక జాగ్రత్తగా ఉండవలసింది..ప్రత్యేకించి బండి నడిపేటప్పుడు బహు జాగ్రత్త వహించాలి.
Oct 20, 2023 - Dec 14, 2023
ఈ ఏడాది మీరు నష్టాల భర్తీకి క్రొత్త ఆలోచనలు చేస్తారు. కానీ అవి నష్టాలకే దారితీస్తాయి. ఏమంటే, వ్యయంకూడా స్థిరంగా పెరుగుతూ వస్తున్నది. ఇది దీర్ఘకాలంలో నేరుగా అంత లాభసాటికాదు. శత్రువులనుండి, న్యాయ పరమైన సమస్యలు కలగవచ్చును. అయితే మీరు, ఉన్నచోటు నుండే నిరాడంబరంగా ఉంటూ, మీ స్థిరత్వాన్ని పైకి కనపడనివ్వండి. అయితే ఈ ఔట్ లుక్ కొద్దికాలమే పనిచేస్తుంది. మధ్యస్థం మరియు దీర్ఘకాల ప్రోజెక్ట్ లు ఒప్పుకోవడం మొదలుపెట్టడం మంచిది. మీ కంటికి సంబందించిన సమస్యలుండవచ్చును. ఇతర స్త్రీ పురుషులుల తో హార్థికమైన సంబంధాలు త్వరితంగా ఆర్థిక ప్రయోజనాలను ఇస్తాయా అని పరిశీలించుకోవడం ముఖ్యం. మీ గర్ల్ / బాయ్ ఫ్రెండ్ వలన సమస్య రావచ్చును.
Dec 14, 2023 - Feb 01, 2024
ఆధ్యాత్మికంగా మీరు ఎంత అంకితమైతే, అంతగా మీ వ్యక్తిగత అవసరాలు నెరవేర్చుకోగలుగుతారు. ఇంకా, ఎంత గాఢంగా మీరు మీ తత్వ చింతన పరివర్తనని అంగీకరించగలిగిఉంటే, అంత శక్తివంతంగా , మీరు మీ అభివృద్ధికి అనుసంధించబడతారు. మీరు చేస్తున్న డిగ్రీ లేదా సర్టిఫికేట్ కోర్స్ ని పూర్తిచేస్తే, ఎంతో ప్రయోజనం పొందగలరు. మీ వ్యక్తిగత అభివృద్ధిలో గల గాఢమైన మార్పులను వ్యక్తపరచడానికి గల ఉత్సాహం చూపడానికి ఇదే మంచి సమయం. మీ పని సంబంధమైన లేదా సమాజ పరమైన ఉన్నతమైన నియమాలు విలువలను తెలియపరచడంలో సఫలమౌతారు. మీ దృక్పథం, ఆశావహంగా ఉంటుంది. ఈ సమయంలో, మీ శత్రువులు కష్టాలలో పడతారు. మీ పథకాలకు కార్యరూపం ఎప్పుడైతే తీసుకువస్తారో అప్పుడు, ఆదాయం వస్తుందని ఎదురు చూడవచ్చును. మీకు, ప్రభుత్వం, మంత్రివర్గం నుండి , లాభం కలుగుతుంది. పనిజరగడం కోసం, వారితో కలిసి పనికూడా చేయవచ్చును. వ్యాపారం విస్తరించడం, లేదా ఉద్యోగంలో పదోన్నతి రావడం జరుగుతుంది. కుటుంబ సౌఖ్యం తప్పక కలుగుతుంది.
Feb 01, 2024 - Mar 30, 2024
భౌతికంగా ను మానసికంగాను కూడా మీకీ దశ ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ బంధువులకు కూడా మంచి కాలం. మీ జీవితకాలంలో గల కెరియర్ కోసం చేసే ప్రయత్నాలను కొనసాగించండి. ఏమంటే, ఇది కలిసివచ్చే కాలం. వస్తు లాభం కూడా సూచితం. ఈ సమయంలో భూమి, యంత్ర పరికరాల కొనుగోలు కూడా జరుగుతుంది. వ్యాపారం లోను, వాణిజ్యంలోను లాభాలు నిశ్చయం. మీ శతృవులు మీముందు, తోక ఝాడించలేరు, మీకు అపకారం చేయలేరు. ప్రేమవిషయాలలో ఇది మీకు అనుకూలమైన కాలం. మీ కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ సహకారం అందుతుంది.
Mar 30, 2024 - May 20, 2024
మీ పని లేదా వ్యాపారంలో ఆదాయంలేదా వృత్తి లో ఎదగడం లాభాలను పొందడం నిశ్చయం. శత్రుజయం, ఆస్తులు పెరగడం, జ్ఞానం పెరగడం, పై అధికారుల నుండి సానుకూల ఉపకారం, అలాగే సఫలతలను ఆశించవచ్చును. ఈ సమయంలో, ప్రయాణాలు లాభించడమే కాకుండా, తత్వ చింతనం, బలపడుతుంది. మీరు తెలివితో, ఇంటా బయటాబాధ్యతలనునిర్వర్తిస్తారు.
May 20, 2024 - Jun 11, 2024
ఇది మీకు మిశ్రమ కాలం. ఈ సమయంలో, మీరు మానసిక వత్తిడిని, అలసటను ఎదుర్కొంటారు. మీ వ్యాపార రీత్యా భాగస్వాములతో సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఈ సమయం మంచిదికాదు. ప్రయాణాలు సఫలం కావు. మీకు అతి దగ్గరివారితో భేదాభిప్రాయాలు రావచ్చును కనుక, ఇటువంటి పరిస్థితుల నుండి తప్పించుకొండి. రిస్క్ లు తీసుకునే బుద్ధిని త్రుంచి, మానుకోవాలి.ఏదిఏమైనా, ఇదిప్రేమకు , రొమాన్స్ కు సరైన సమయం కాదు. మీరు ప్రేమ మరియు, సంబంధాలలో అతి జాగ్రగా ఉండాలి, లేకుంటే, అవి మీకు అగౌరవాన్ని కలిగించి, ఇంకా మన్ననను కూడా పోగొడతాయి