డబ్బు విషయమై, హోదా కి సంబంధిచి, కొంత ఎగుడు దిగుళ్ళు వచ్చే సూచన కనిపిస్తున్నది. ఆర్థికంగాను, లేదా ఆస్తి నష్టాలు ఉండవచ్చును. డబ్బు విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. మీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే, సన్నిహిత సహచరులతో మరియు బంధువులతో వివాదాలు జరిగితే ఇబ్బందికరం (ఎంబరాసింగ్) కావచ్చును. మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి ఏమంటే, అనారోగ్యం కలగ వచ్చును.
Oct 29, 2024 - Nov 19, 2024
పరీక్షలలోసఫలత, లేదా ప్రమోషన్ లేదా ఉద్యోగంలో గుర్తింపు పెరగడం, నిశ్చయం. కుటుంబం నుండి కూడా సహకారం అందుతుండడం కనబడుతుంది. దూరప్రాంతాలలోగలవారు, లేదా విదేశీ వ్యక్తులద్వారా సహకారం అందుతుంది. మీకు ఎంతో ప్రయోజనకరమైన క్రొత్త పని మీకు అప్పగించబడుతుంది. మీకు ఎటువంటి వ్యతిరేక పరిస్థితులనైనా ఎదుర్కొని నిలవ గలిగే ఆత్మ విశ్వాసం ఉంటాయి. అద్భుత రీతిలో గుండె నిబ్బరం కలిగి ఉంటారు.
Nov 19, 2024 - Jan 13, 2025
లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశాలున్నవి. ఋణ అభ్యర్థనను లేదా, లోన్ అప్లికేషన్ పెడితే అప్పు పుట్టవచ్చును. చిన్నపాటి అనారోగ్య సమస్యకి అవకాశం ఉన్నది జీవితంలో ముఖ్యమైన వృత్తి మరియు ఇంటి కి చెందిన రెండు బాధ్యతలనుచాకచ్క్యంగా నిర్వర్తించి సమతుల్యత సాధించగలరు. కొద్దిపాటి కష్టంతో, మీ చిరకాల కోరికలు నెరవేరుతాయి. అవి చివరికి పేరు ప్రతిష్టలను తెచ్చిపెడతాయి. మంచి ఆదాయాన్ని లేదా లాభాలని ఆర్జిస్తాయి. పోటీలో మీరు విజేతగా అవతరించి, ఇంటర్వ్యూలలో సఫలతను సాధిస్తారు.
Jan 13, 2025 - Mar 03, 2025
మీగురించి తగిన జాగ్రత్త తీసుకొండి. మితిమీరిన బాధ్యతలను నెత్తికెత్తుకోవద్దు. అలా అయితే చాలాకాలం పాటు, మీజీవితాన్ని సవ్యంగా గడపగలుగుతారు. కాకపోతే, కొన్ని నిరాశలు ఎదురుకావచ్చును. మీ ధైర్యం అంకితభావన మీ సుగుణాలు. ఇవి కొంతమందిని కించపడేలా చేయవచ్చు. పెద్ద మొత్తంపెట్టుబడులకు పోవద్దు. ఏమంటే, మీరు అనుకున్నట్లుగా పరిస్థితులు అనుకూలించక పోవచ్చును. మీ స్నేహితులు, సహచరులనుండి, అనుకున్నట్లుగా సరైన సహకారం అందకపోవచ్చును. కుటుంబ సభ్యుల దృక్పథం మీకు భిన్నంగా ఉండవచ్చును. ఆరోగ్యం కాస్త చికాకు పరచవచ్చును. తల త్రిప్పటం, జ్వరం దాడులు, చెవి ఇన్ఫెక్షన్ మరియు వాంతులు కలగవచ్చును.
Mar 03, 2025 - Apr 29, 2025
ఉద్యోగ అంశాలు చాలవరకు ఆశించినకంటె తక్కువగా ఉంటాయి. మొత్తంమీద అంత సంతృప్తికరంగా ఉండదు. పనిచేసే చోట చీకాకు ఒత్తిడి ఉంటాయి. రిస్క్ ఉండే లక్షణాలు ఏవి ఉన్నాకానీ మొత్తంగా విసర్జించాలి. ఏ ముఖ్యమైన పనినీ మీరు చేపట్టవద్దు. వృత్తి పరంగా మీకు ఈ సంవత్సరం ఆటంకాలు మరియు సవాళ్ళు అనుభవంలోకి వస్తాయి. అస్థిరత, అయోమయం ఉంటాయి. మీ స్వంతమనుషులనుండి మీకు సహాయం అందదు. మీకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు జరిగే అవకాశం ఉంటుంది.మీదగ్గరి వ్యక్తుల అనారోగ్యం మీకు ఆతృతను కలిగిస్తుంది. మీకు ఈ దశలో, కుటుంబ సంబంధ సమస్యలు ఎదురవుతాయి. మీరు వీలైనంత వరకు నిరాడంబరంగాఉంటూ మార్పులేమీ చేపట్టకుండా ఉండండి.
Apr 29, 2025 - Jun 20, 2025
ఈ ఏడాది మీకు పనిభారం పెరిగినా ప్రశంసలు, వృత్తిపరంగా రాణించడంతో యోగిస్తుంది. మీరు మనసుపెట్టి చేసిన పనులు లాభించి విజయాలను సాధించిపెట్టే ఉత్తమమైన కాలమిది. కుటుంబసభ్యుల సహకారం అందుతుంది. కీర్తి పొందుతారు. వృత్తిపరంగాగొప్ప అభివృద్ధి కానవస్తుంది. మీ శతృవులను అధిగమిస్తారు. అందరితోనూసత్సంబంధాలు కొనసాగిస్తారు.
Jun 20, 2025 - Jul 11, 2025
మీకుఅంతగా -అనుకూలమైన సమయం కాదు. మీరు అనవసరమైన ఖర్చులు చేయవలసి రావచ్చును, అదుపు చెయ్యవలసిన అవసరం ఉంది. ఏ విధమైన స్పెక్యులేషన్ చేయరాదు. మీరు పని వత్తిడి మరీ ఎక్కువ కావడంతో స్తంభించిపోతారు. కాలం మీకు అనుకూలించదు కనుక వ్యాపారాలలో మీరు రిస్క్ తీసుకునే ప్రయత్నం చెయ్యవద్దు. మీ శతృవులు మీ ప్రతిష్టదెబ్బ తీయ చూస్తారు. కుటుంబ వాతావరణం అంత సామరస్యంగా ఉండక పోవచ్చును.మీ ఆరోగ్యం కూడా ఆందోళనకారకం కావచ్చును. మీరు మంత్రాలకు, ఆధ్యాత్మిక చింతనకు కట్టుబడే అవకాశమున్నది.
Jul 11, 2025 - Sep 10, 2025
అదృష్టం మీ వైపు ఉంటుంది. మీరు ఏ ప్రోజెక్ట్ నైనా, లేదా ఏ స్పెక్యులేషన్ నైనా మీవైపు త్రిప్పుకోగలరు. జీవితంలో ఉన్నతి దిశగా పురోభివృద్ధి జరుగుతుంది. మీరు కావాలనుకుని చేపట్టిన ఏపనైనా చక్కగా సఫలంఅయే కాలమిది. క్రొత్తగా ఆస్తులు పొందుతారు. తెలివిగా పెట్టుబడులు చేస్తారు. ఇతర స్త్రీ /పురుషులతో సంతోషంగా వినోదాన్ని పొందుతారు. కుటుంబంలో సహకారం పెంపొందడం కనపడుతుంది. రుచికరమైన అహారం పట్ల మక్కువను పెంచుకుంటారు. ఇంటిలో అందరు ఇష్టమైన సభ్యులమధ్యన గెట్ టుగెదర్ లు ఆనందిస్తారు.
Sep 10, 2025 - Sep 28, 2025
ఈ సమయంలో, మీరు మంచి విశ్వాసంతోను, సానుకూల దృక్పథంతోను ఉంటారు. మీరు ప్రభుత్వం లోను, లేదా వ్యక్తిగత జీవితంలోను శక్తిని, అధికారాన్ని కొనసాగిస్తారు. ప్రయోజనకరమైన దగ్గరి ప్రయాణాల సూచనలున్నాయి. మీరు డబ్బును విరివిగా ఖర్చు పెడతారు. మీకు లేదా మీ సన్నిహిత కుటుంబ సభ్యులలో ఒకరికి అనారోగ్య సూచన ఉన్నది. ప్రత్యేకించి, మీ జీవిత భాగస్వామికి, శిరోవేదన లేదా కంటి సంబంధమైన బాధల సూచన ఉన్నది.
Sep 28, 2025 - Oct 29, 2025
అనవసరమైన ఖర్చులకు అవకాశముంది. ప్రేమ, రొమాన్స్, సాధారణజీవితం అంతగా ప్రోత్సాహకరంగా లేదు. జీవితంలో ఎదురయే వివిధ పరిస్థితులకి ఎంతో సంయమనంతోను, ప్రశాంతతతోను ఉండమని సూచన. ఊహాలోకం(గెస్వర్క్) పనిచేయదు. కనుక అటువంటివాటిలో తలదూర్చవద్దు. కన్నులు, కఫ సంబంధ సమస్యలు మరియు స్ప్లీన్(కాలేయం) సంబంధ సమస్యలుకలగవచ్చును. అసత్యాలు పలికి, మీకు మీరే సమస్యలను సృష్టించుకుంటారు.