ఇది మీకు బహు అనుకూలమైన కాలం, పట్టినది బంగారమయ్యే కాలం అంటే, ఇక మీరు కార్యోన్ముఖులు కావలసిన(పని చేయవలసిన కాలం). వివిధ రంగాల నుండి అనుకోని విధంగా బహుమతులు, లాభాలు వచ్చి పడిపోతుంటాయి. ఇది మీకు మరింత మెరుగైన కెరియర్ ను , సర్వతో ముఖాభివృద్ధిని అందిస్తుంది. మీ వ్యతిరేకులు, మీ దారిలో ఎదురుపడడానికి కూడా సాహసించరు. ఇక మీ వంతుగా తగినవిధంగా ఆకర్షణను, కీర్తిని పొందుతారు. పాలకుల నుండి, మీ పై అధికారులనుండి, ఉన్నతాధికారులనుండి, అభిమానాన్ని చూరగొంటారు.మీకుచక్కని ఆరోగ్యం, శరీర సౌష్టవం ఉంటాయి. ఈ ఏడాది మీకు, వాహన ప్రాప్తి కూడా సూచిస్తున్నది.
Jun 13, 2026 - Aug 06, 2026
ఈ సమయం మీకు అన్నివిధాలా (నిలువుగా) ఎదగడానికి కెరియర్ లో ఎదగడానికి ఒక చక్కని సోపానం లేదా మెట్టు గా అద్భుతంగా పనికివస్తుంది. వ్యాపార భాగస్వాములతోను, సహోద్యోగులతోను లాభసాటిగా ఉండే కాలం. అన్యాయంగా ఆర్జించడానికి మీరు మొగ్గుచూపవచ్చును. అప్పుడు మీ క్రమశిక్షణ, స్వయం పర్యవేక్షణ, ఇంకా, మీ రోజువారీ దినచర్యలపై అదుపులు, బాగా ఉపయోగపడతాయి. ఆరోగ్య సంబంధమైన చికాకులు మీ మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తాయి
Aug 06, 2026 - Sep 24, 2026
మీకు సహాయం అందించడంలో ఇతరులనుండి గట్టి ప్రభావం ఉంటుంది. ఇది మీ భౌతిక అవసరాలను నెరవేర్చడము, అలాగే, మీకు మరింత వ్యక్తిగత రక్షణ కల్పించడం జరుగుతుంది. డబ్బు ఖచ్చితంగా మీకు చేకూరుతుంది, మీ వ్యక్తిగత విశ్వాసాలను, కలలను, మరియు తత్వ విచారాలను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వం, మరియు ఉన్నత అధికారులచే గుర్తింపు పొందుతారు. మీరు స్నేహశీలత కలిగి ఉంటారు,అలాగే, వివిధ సామాజిక పరిస్థితులలో, అవసరమయే సంఘంలోని వివిధ వ్యక్తులతో పరస్పర సద్భావనలు చూపి గ్రూప్ డైనమిక్స్ చూపడాన్ని చాలా సౌకర్యవంతమైన ఎంజాయ్ మెంట్ గా తీసుకుంటారు; కాకపోతే అనారోగ్య సమస్య మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది. బాహ్యంగా కంటే, అంతర్గత మార్పు, పరివర్తన ఎంతో అవసరం.
Sep 24, 2026 - Nov 21, 2026
భౌతికంగా ను మానసికంగాను కూడా మీకీ దశ ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ బంధువులకు కూడా మంచి కాలం. మీ జీవితకాలంలో గల కెరియర్ కోసం చేసే ప్రయత్నాలను కొనసాగించండి. ఏమంటే, ఇది కలిసివచ్చే కాలం. వస్తు లాభం కూడా సూచితం. ఈ సమయంలో భూమి, యంత్ర పరికరాల కొనుగోలు కూడా జరుగుతుంది. వ్యాపారం లోను, వాణిజ్యంలోను లాభాలు నిశ్చయం. మీ శతృవులు మీముందు, తోక ఝాడించలేరు, మీకు అపకారం చేయలేరు. ప్రేమవిషయాలలో ఇది మీకు అనుకూలమైన కాలం. మీ కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ సహకారం అందుతుంది.
Nov 21, 2026 - Jan 12, 2027
మీ పని లేదా వ్యాపారంలో ఆదాయంలేదా వృత్తి లో ఎదగడం లాభాలను పొందడం నిశ్చయం. శత్రుజయం, ఆస్తులు పెరగడం, జ్ఞానం పెరగడం, పై అధికారుల నుండి సానుకూల ఉపకారం, అలాగే సఫలతలను ఆశించవచ్చును. ఈ సమయంలో, ప్రయాణాలు లాభించడమే కాకుండా, తత్వ చింతనం, బలపడుతుంది. మీరు తెలివితో, ఇంటా బయటాబాధ్యతలనునిర్వర్తిస్తారు.
Jan 12, 2027 - Feb 02, 2027
ప్రయాణ అభిలాష ఉండడం వలన కొంత వరకు మీ ప్రయాణపు సరదా వలన కలిగిన అలసట ఉంటుంది. మీకు ఒకమూల ఉండిపోవడం ఇష్టం ఉండదు. దాంతో అలసట తప్పదు. మీ ఆలోచనల్ మతంవైపుకు మరలడంతో పుణ్య క్షేత్ర దర్శనం చేయగలరు. ఈ దశలో కెరీయర్ గురించి మీకు మార్పు(వొలాటిలిటీ,) , వత్తిడిలతో ఉంటుంది. మీ స్వంత మనుషులతోను, బంధువర్గంతోను, అనుబంధాలు కొంచెం పాడవుతాయి. రోజువారీ పనులు బాధ్యతలగురించి సరైన శ్రద్ధపెట్టండి. మీ కుటుంబ సభ్యుల అంచనాల మేరకు మీరు సంతృప్తి పరచలేరు. ఏ విధమైన వ్యాపార లావాదేవీల లోను మీరి చేయిపెట్టవద్దు. మీ అమ్మగారికి ఇది పరీక్షా సమయం.
Feb 02, 2027 - Apr 04, 2027
జనాలు మీవైపు చూస్తూ, సలహా కోసం మీవద్దకు చేరుతారు. ఎన్నో విషయాలు వాటంతట అవే పరిష్కరింపబడి సఫలం అవుతాయి. కాలం మీకు అదృష్టాన్నితెస్తుంది. శక్తిని , ధైర్యాన్ని అందిస్తుంది. ఏమైనా, అధికారులనుండి లాభదాయకమైన అంశాలు, గుర్తింపు లభిస్తాయి. కనుక ఇది మంచి కాలం. కనుక మీరు క్రొత్త వాటికోసం ప్రయత్నించడం, క్రొత్త ప్రదేశాలకు వెళ్ళడం కోసం ప్రయత్నించవచ్చు. వాహనం పొందే అవకాశం ఉన్నది. ఇచ్చిపుచ్చుకునే కొన్ని క్రొత్తపరిచయాలు సంబంధాలు బలపడతాయి. మీ సంతానానికికూడా ఈసమయంలో కలిసివస్తుంది.
Apr 04, 2027 - Apr 22, 2027
ఈ సమయంలో, మీరు మంచి విశ్వాసంతోను, సానుకూల దృక్పథంతోను ఉంటారు. మీరు ప్రభుత్వం లోను, లేదా వ్యక్తిగత జీవితంలోను శక్తిని, అధికారాన్ని కొనసాగిస్తారు. ప్రయోజనకరమైన దగ్గరి ప్రయాణాల సూచనలున్నాయి. మీరు డబ్బును విరివిగా ఖర్చు పెడతారు. మీకు లేదా మీ సన్నిహిత కుటుంబ సభ్యులలో ఒకరికి అనారోగ్య సూచన ఉన్నది. ప్రత్యేకించి, మీ జీవిత భాగస్వామికి, శిరోవేదన లేదా కంటి సంబంధమైన బాధల సూచన ఉన్నది.
Apr 22, 2027 - May 22, 2027
అనవసరమైన ఖర్చులకు అవకాశముంది. ప్రేమ, రొమాన్స్, సాధారణజీవితం అంతగా ప్రోత్సాహకరంగా లేదు. జీవితంలో ఎదురయే వివిధ పరిస్థితులకి ఎంతో సంయమనంతోను, ప్రశాంతతతోను ఉండమని సూచన. ఊహాలోకం(గెస్వర్క్) పనిచేయదు. కనుక అటువంటివాటిలో తలదూర్చవద్దు. కన్నులు, కఫ సంబంధ సమస్యలు మరియు స్ప్లీన్(కాలేయం) సంబంధ సమస్యలుకలగవచ్చును. అసత్యాలు పలికి, మీకు మీరే సమస్యలను సృష్టించుకుంటారు.
May 22, 2027 - Jun 13, 2027
మీరు అల్ప సంతోషబుద్ధి, అన్నిటినీ తేలికగా తీసుకునే తత్వం వదులుకోవాలి. లేకపోతే, అది మీ ఉజ్జ్వల భవిష్యత్తును కళావిహీనం చేస్తుంది. ఇంకా, పాత పద్ధతులలో కష్టపడుతూ, జీవితంలో పైకి రావడానికి, ఎంతో కష్ట పడవలసి వస్తుంది. ఆర్థికంగా ఇది మీకు కష్ట కాలమే. ఆఖరుకుదొంగతనం మోసాలు, వివాదాలకు కూడా ఎదుర్కొని పోరాడాలేమో. మీకు పని ఒత్తిడులు పెరగడం, అక్కడ బాధ్యతలు బాగా పెరగడం చూస్తారు. ఆరోగ్యరీత్యా ఇది మీరు కొంత కలతపడవలసిన కాలం. చెవి, కన్ను సంబంధ సమస్యలు ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామి కి కూడా ఆరోగ్య పరమైన చీకాకులు ఉంటాయి. మీ మానసిక ప్రశాంతత కలతపడే ఉంటుంది.