ఈ వ్యక్తి, అలవికాని లాభాలు, సంపద మొదటినుండి పొందుతారు. అది లాటరీ , స్పెక్యులేషన్ షేర్లు మొదలైనవి ఏమార్గమైనా కావచ్చును. స్నేహితులు, శ్రేయోభిలాషులు అంతా మీ వ్యవహారాలలో మిమ్మల్ని సమర్థించి, మీకు సహకరించవచ్చును .మీరు వ్యాపార వ్యవహారాల(బిజినెస్ డీలింగ్ ల)ద్వారా చెప్పుకోదగినంత సంపాదిస్తారు. మంచి స్థానం, హోదా పొందుతారు. మీరు చక్కగా గౌరవం పొందుతారు మరియు మృష్టాన్న భోజన సౌఖ్యం( రుచికరమైన భోజనం) ఆనందం కలుగుతుంది.
Jul 26, 2025 - Sep 25, 2025
ఈ కాలం మీకు వచ్చే పోయే అన్ని విషయాలలోనూ సఫలతను తెస్తుంది. మీ వృత్తి ఉద్యోగాల జీవితంలో కొంత ఆహ్లాదకర వాతవరణం లోమీకు చక్కని గుర్తింపు రావడం జరుగుతుంది. విరామానికి, రొమాన్స్ కి అనుకూల సమయం. మీ సోదర సోదరులు ఈ ఏడాది అభివృద్ధిలోకి వస్తారు. మీ ఆదాయంలో పెరుగుదల మీ శ్రమకు ఫలితం కనపడుతుంది. కుటుంబ జీవితం చాలా సంతోష దాయకం. ఒక ఉత్తేజకరమైన ఉద్యోగావకాశం, ప్రశంస, గుర్తింపు, లేదా ప్రమోషన్ కి ఎక్కువ అవకాశం ఉన్నది.మీరు బంగారు వస్తువులు , విలువైన రత్నాలు కొంటారు. సాధారణంగా మీరు స్నేహితులతోను, సహచరులతోను వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులతోను చక్కగా కలిసిమెలిసి ఉంటారు.
Sep 25, 2025 - Oct 13, 2025
ఈ సమయంలో, మీరు మంచి విశ్వాసంతోను, సానుకూల దృక్పథంతోను ఉంటారు. మీరు ప్రభుత్వం లోను, లేదా వ్యక్తిగత జీవితంలోను శక్తిని, అధికారాన్ని కొనసాగిస్తారు. ప్రయోజనకరమైన దగ్గరి ప్రయాణాల సూచనలున్నాయి. మీరు డబ్బును విరివిగా ఖర్చు పెడతారు. మీకు లేదా మీ సన్నిహిత కుటుంబ సభ్యులలో ఒకరికి అనారోగ్య సూచన ఉన్నది. ప్రత్యేకించి, మీ జీవిత భాగస్వామికి, శిరోవేదన లేదా కంటి సంబంధమైన బాధల సూచన ఉన్నది.
Oct 13, 2025 - Nov 12, 2025
మీరు ఎన్నో అవకాశాలున్నా కూడా, దారిలో ఎదురు రానున్న అవకాశాలను అంది పుచ్చుకోలేరు, అన్నీ వ్యర్థమే అయిపోతాయి. ఆరోగ్యపరంగా మీకు కానీ, మీ తల్లితండ్రులకు కానీ సమస్యలు ఎదురుకావచ్చును. కనుక తగిన జాగ్రత్త తీసుకొనండి. దూరప్రయాణాలు ఉన్నా ఎక్కువగా లాభించవు. కనుక మానడం మంచిది. ఇది మీకు మిశ్రమ ఫలితాల కాలం. మీ సహోద్యోగులతోను, ఇతరులతోను, వివాదాలు కలగవచ్చును. జలుబు, జ్వరం సోకగలదు. ఏ ప్రత్యేక కారణం లేకుండానే, మానసిక ఆందోళన కలగవచ్చును.
Nov 12, 2025 - Dec 04, 2025
ఆర్థిక లావాదేవీలు లాభదాయకం కాదు. మీ కుటుంబంలో మరణం సంభవించవచ్చును. కుటుంబ తగాదాలు మీకు మనో ప్రశాంతతను పోగొట్టవచ్చును. మీ కఠినమైన సంభాషణలతో లేదా ఉపన్యాసంతో స్వయంగా సమస్యలు తెచ్చుకోగలరు. వ్యాపార సంబంధమైన ఒక చెడు వార్త మీకు వస్తుంది. భారీ నష్టాలు సూచన. అనారోగ్యాలు, ఇబ్బంది పెట్టవచ్చును.
Dec 04, 2025 - Jan 27, 2026
క్రొత్త పెట్టుబడులు మరియు రిస్క్ లు అవాయిడ్ చెయ్యాలి. ఈ దశలో మీకు అవాంతరాలు మరియు అడ్డంకులు ఎదురు కావచ్చును. పనిచేసే ఉద్యోగస్తులైతే, అభివృద్ధిని చూస్తారు. అదికూడా కష్టపడి పనిచేసి, దీర్ఘ కాలంగా ఆశావహ దృక్పథం కలిగి ఉంటే, ఇది సాధ్యం. విజయానికి దగ్గరి దారేదీ లేదు కదా. మీరు చక్కని ఫలితాలకోసం స్థిరంగా నిరంతరంగా పనిచేస్తూ పోవాలి. సంవత్సర ప్రారంభంలో, పని పరిస్థితులు, కొద్దిగా అస్తవ్యస్థంగా వత్తిడి కలిగించేలా ఉంటాయి. ఇలాంటప్పుడు క్రొత్త అభివృద్ధిని లేదా వేగంగా పనిచెయ్యడం ఉండకూడదు. ఈ సానుకూల సమయంలో మీ ఆరోగ్య పరిస్థితులు మిమ్మల్ని సరిగా పనిచేసి మీ లక్ష్యాలను చేరుకోనివ్వవు. అందుకే ఆరోగ్య పరీక్షలు అవసరం. సాధారణంగా జ్వరం సమస్యకి చెక్ చేయించుకోవాలి.
Jan 27, 2026 - Mar 17, 2026
కష్టాలునిస్పృహలు కలుగుతాయి. మీరు వీటినుండి సానుకూల అంశాలనుస్వీకరించి అవసరమైన మిగిలినవాటిని సగంలో అసంపూర్తిగా వదిలెయ్యరాదు. మీ పనిచేసే చోట అన్నిటా మీరై ఉండాలి. ఆకస్మిక నష్టాలు కలగవచ్చును. విదేశీ మూలాధారంగా ఆదాయం కలగవచ్చును. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చికాకుకు గురిచేయవచ్చును. అంతగా లాభసాటికాని వ్యవహారాలలో తలపెట్టవలసి రావచ్చును. కుటుంబ వాతావరణం అంత సామరస్యంగా ఉండకపోవచ్చును. మీ శత్రువులు మీ ప్రతిష్టను ఏదోవిధంగా దెబ్బతీయడాని గల అన్ని మార్గాలలోను ప్రయత్నిస్తారు. అంతగా యోగించే కాలం కాదు.
Mar 17, 2026 - May 14, 2026
శుభవేళకి మహోదయం ఈ సమయం అనవచ్చును. మీరు ఉదాత్తమైన వ్యవహారాలో మీరు నిమగ్నమవడానికి అవకాశమున్నది. మీరు ఎంతో సంతోషంగా ఉంటారు.వ్యతిరేక పరిస్థితులను కూడా మీరు తట్టుకుంటారు. మీ పిల్లలకు అనారోగ్య సూచనలున్నా, కొంత సమస్యలున్నా కూడా, కుటుంబ సౌఖ్యం మీకు తప్పక అందుతుంది. మీ స్వయం కృషివలన ఆదాయం పెరుగుతుంది. మీ శతృవులు మీకు అపకారం చేయలేరు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కానరావచ్చును. మీ స్నేహితులు, సహచరులు, మీ ప్రయత్నాలలో సహకరిస్తారు.
May 14, 2026 - Jul 05, 2026
ఈ ఏడాది మీకు పనిభారం పెరిగినా ప్రశంసలు, వృత్తిపరంగా రాణించడంతో యోగిస్తుంది. మీరు మనసుపెట్టి చేసిన పనులు లాభించి విజయాలను సాధించిపెట్టే ఉత్తమమైన కాలమిది. కుటుంబసభ్యుల సహకారం అందుతుంది. కీర్తి పొందుతారు. వృత్తిపరంగాగొప్ప అభివృద్ధి కానవస్తుంది. మీ శతృవులను అధిగమిస్తారు. అందరితోనూసత్సంబంధాలు కొనసాగిస్తారు.
Jul 05, 2026 - Jul 26, 2026
ఒకవేళ, ఉద్యోగస్తులైతే, సంవత్సరం మహా దూకుడుగా ఉంటుంది చురుకుగా డైనమిజం మరియు ఎదుగుదల ఉంటాయి. ఏదేమైనా, పని పరిస్థితులు వత్తిడితోనే ఉంటాయి. పై అధికారులతో వాదప్రతివాదాలు, ప్రతిస్పర్థలు ఉంటూనే ఉంటాయి. సాధారణంగా ఈ దశ అంతగా బాగుండదు. ఏమంటే, దగ్గరి సహచరులు, స్నేహితులు, మరియు కుటుంబ సభ్యులు, అందరూ దూరంగా అనిపిస్తారు. పెద్దగా మార్పు ఉండదు, వాంఛితం కూడా కాదు. మీ దృక్పథం, అసభ్య భాషా పదజాలం అలవాటు, అతి దగ్గరైన వారితో, కొన్ని సమస్యలను సృష్టిస్తుంది. కనుక మీ మాటలను అదుపులో ఉంచుకొండి.