ఈ వ్యక్తి, అలవికాని లాభాలు, సంపద మొదటినుండి పొందుతారు. అది లాటరీ , స్పెక్యులేషన్ షేర్లు మొదలైనవి ఏమార్గమైనా కావచ్చును. స్నేహితులు, శ్రేయోభిలాషులు అంతా మీ వ్యవహారాలలో మిమ్మల్ని సమర్థించి, మీకు సహకరించవచ్చును .మీరు వ్యాపార వ్యవహారాల(బిజినెస్ డీలింగ్ ల)ద్వారా చెప్పుకోదగినంత సంపాదిస్తారు. మంచి స్థానం, హోదా పొందుతారు. మీరు చక్కగా గౌరవం పొందుతారు మరియు మృష్టాన్న భోజన సౌఖ్యం( రుచికరమైన భోజనం) ఆనందం కలుగుతుంది.
Apr 5, 2024 - Jun 02, 2024
ఆటంకాలతో మీ ఈ దశ మొదలవుతున్నది. దానికి కారణం, మీ పని ప్రదేశంలో గల పోటీ కారణంగా తెలెత్తిన వత్తిడులు . ఈ పరిస్థితులని నెట్టుకురావడానికి మీరు మరింత సరళతనుపాటించాలి. క్రొత్త ప్రాజెక్ట్ లు, రిస్క్ లు మానాలి. వివాదాలు, లేదా ఉద్యోగమార్పు ఆలోచన మానాలి. మీ మాట తీరు, కమ్యునికేషన్ లని సానుకూల (పాజిటివ్) దృక్పథంతో తోను, అహింసాయుతంగానుఉంచుకోవాలి. దీనివలన మాట, వ్రాత పలుకులవలన కలిగే ఇబ్బందులను అధిగమించవచ్చును. ఇతర స్త్రీ పురుషులతోమీకుసత్సంబంధాలు ఉండవు. జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కలత పెడుతుంది. వీలైనంతవరకు అనవసరమైన ప్రయాణాలు మానాలి. మీరు అనుకోని విచారాలు, నిరాధారమైన నీలాపనిందలు కూడా ఎదుర్కోవలసి రావచ్చును
Jun 02, 2024 - Jul 24, 2024
ఎంతోకాలంగా మీరుపడుతున్న కష్టం ఫలించుతుంది. ఇక మీరు రిలాక్స్ అయి, విజయానందాన్ని అనుకూడా. ఎందుకంటే, కష్టాల కలతల కాలం తరువాత వస్తున్న మంచి సమయం. మీకు నష్టదాయకమైన స్పెక్యులేషన్ లు మానగానే, మీ ఆర్థిక పరిస్థితిచక్కబడుతుంది. మీకు సహాయకర, మరియు ప్రయోజనకరమైన భాగస్వాములు మరియు, ప్రయాణాలలో మీకు లభిస్తారు. రాజకీయవ్యక్తులతోను లేదా ఉన్నతాధికారులతోను స్నేహాన్ని పెంపొందించుకుంటారు. ఈ సమయయంలోమీకు పుత్రసంతానంకలగవచ్చును.
Jul 24, 2024 - Aug 14, 2024
ఒకవేళ, ఉద్యోగస్తులైతే, సంవత్సరం మహా దూకుడుగా ఉంటుంది చురుకుగా డైనమిజం మరియు ఎదుగుదల ఉంటాయి. ఏదేమైనా, పని పరిస్థితులు వత్తిడితోనే ఉంటాయి. పై అధికారులతో వాదప్రతివాదాలు, ప్రతిస్పర్థలు ఉంటూనే ఉంటాయి. సాధారణంగా ఈ దశ అంతగా బాగుండదు. ఏమంటే, దగ్గరి సహచరులు, స్నేహితులు, మరియు కుటుంబ సభ్యులు, అందరూ దూరంగా అనిపిస్తారు. పెద్దగా మార్పు ఉండదు, వాంఛితం కూడా కాదు. మీ దృక్పథం, అసభ్య భాషా పదజాలం అలవాటు, అతి దగ్గరైన వారితో, కొన్ని సమస్యలను సృష్టిస్తుంది. కనుక మీ మాటలను అదుపులో ఉంచుకొండి.
Aug 14, 2024 - Oct 14, 2024
దీనికి చీకటి కోణంలో, ఇది తగువులకి దారితీసి, ప్రేమించినవారి దూరంఅవడం భగ్న ప్రేమ సంభవించవచ్చును. చేయవలసినదల్లా, ఈ సమయంలో, ఇతరుల విషయాలలో తల దూర్చవద్దు. మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, రిస్క్ లో ఉన్నాయి. ఏదైనా మచ్చవచ్చే స్కాండల్ లో ఇరుక్కోవచ్చును. మీ పరువు దెబ్బతినవచ్చును. ధనాగమనం జరిగినా, చెప్పనవసరం లేకనే ఖర్చులూ అంతగానూ కనిపిస్తాయి. ఈ సమయం ప్రమాదకరం, కనుక మీరు మరింత జాగరూకత వహించాలి. ప్రయాణాలు ఫలవంతంకావు కనుక మానాలి.
Oct 14, 2024 - Nov 01, 2024
అనుకోని సమస్యలు తలెత్తవచ్చును. బంధువులతో హార్థిక సంబంధాలు నెరపడం మంచిది. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. దీర్ఘ కాల అనారోగ్యం కలగవచ్చును. జీవిత భాగస్వామి మరియు సంతానం యొక్క ఆరోగ్యం కూడా కనిపెట్టుకొని ఉండాలి. చాటుమాటు వ్యవహారాలు చేయరాదు. వ్యాపార విషయాలు కూడా నిజానిజాలు తెలుసుకొనే చేపట్టాలి. కురుపులు లేచే అవకాశమున్నది.
Nov 01, 2024 - Dec 01, 2024
మీరు ఎంతో ఎత్తుకు ఎదగడానికి, వృత్తిలో రాణించడానికి ఈ కాలం యోగదాయకంగా ఉన్నది. వ్యాపార భాగస్వాములతోను, సహోద్యోగులతోను లాభసాటిగా ఉండే కాలం. జీవిత భాగస్వామితో అనురాగం సంతోషం కలుగుతుంది. వ్యాపార వాణిజ్యాలు మరియు విదేశీ ప్రయాణాల వలన లాభాలు కలగవచ్చును. ఆరోగ్య సంబంధమైన చికాకులు మీ మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తాయి. మీ క్రమశిక్షణ, స్వయం పర్యవేక్షణ, ఇంకా, మీ రోజువారీ దినచర్యలపై అదుపులు, బాగా ఉపయోగపడతాయి. జ్వరం, కీళ్ళనొప్పుల గురించి జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినే సూచనలున్నాయి.
Dec 01, 2024 - Dec 23, 2024
మీరు తప్పించుకోవలసిన ఏకైక ప్రమాదం మీ అతిశయం, అహంకారం. ఇంటిఖర్చుగురించి, లేదా ఆరోగ్య విషయమై, కుటుంబసభ్యులకోసం చేయవలసి రావచ్చును. కుటుంబ సంబంధాలపట్ల మరింత బాధ్యతాయుతమైన దృక్పథాన్ని పెంచుకొండి. ఇతరులు మీ భావోద్వేగాల బలహీనతను సాకుగా , పైచేయిని సాధించి ,మిమ్మల్ని తరువాత చిందరవందర అయేలా చేసే అవకాశమున్నది. మీ జీవిత భాగస్వామి వలన లేదా, ప్రేమ జీవితం కారణంగా, కొంత నిరాశకలగ వచ్చును. ప్రయాణాలు నిష్పలం మరియు నష్టాలకు కూడా దారి తీయవచ్చును.
Dec 23, 2024 - Feb 16, 2025
క్రొత్త పెట్టుబడులు మరియు రిస్క్ లు అవాయిడ్ చెయ్యాలి. ఈ దశలో మీకు అవాంతరాలు మరియు అడ్డంకులు ఎదురు కావచ్చును. పనిచేసే ఉద్యోగస్తులైతే, అభివృద్ధిని చూస్తారు. అదికూడా కష్టపడి పనిచేసి, దీర్ఘ కాలంగా ఆశావహ దృక్పథం కలిగి ఉంటే, ఇది సాధ్యం. విజయానికి దగ్గరి దారేదీ లేదు కదా. మీరు చక్కని ఫలితాలకోసం స్థిరంగా నిరంతరంగా పనిచేస్తూ పోవాలి. సంవత్సర ప్రారంభంలో, పని పరిస్థితులు, కొద్దిగా అస్తవ్యస్థంగా వత్తిడి కలిగించేలా ఉంటాయి. ఇలాంటప్పుడు క్రొత్త అభివృద్ధిని లేదా వేగంగా పనిచెయ్యడం ఉండకూడదు. ఈ సానుకూల సమయంలో మీ ఆరోగ్య పరిస్థితులు మిమ్మల్ని సరిగా పనిచేసి మీ లక్ష్యాలను చేరుకోనివ్వవు. అందుకే ఆరోగ్య పరీక్షలు అవసరం. సాధారణంగా జ్వరం సమస్యకి చెక్ చేయించుకోవాలి.
Feb 16, 2025 - Apr 05, 2025
ఈ దశ మీకు, అన్ని పెత్తనాలను తప్పనిసరిగా తేనున్నది. ఒక విదేశీ పరిచయం, లేదా సంబంధం, మీకు ఉపయోగపడనున్నది. వారు, మీరు ఎంతోకాలంగా పొందడానికై తపన పడినట్టి స్థాయి, అధికారం మరియు అనుకోని విధంగా చక్కని ఆదాయం కలగడానికి మూలకారణం అవుతారు. మీరు స్వ శక్తిని నమ్మడం, అదే భావనని కొనసాగించండి. ఈ ఏడాది, మిమ్మల్ని సంపూర్ణంగా ఒక క్రొత్త స్థాయిని అందుకునేలా చేస్తుంది. కుటుంబ వాతావరణం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూర ప్రయాణం ప్రయోజనకరం కాగలదు. మతంపట్ల మీరు ఇష్టాన్ని చూపడం , తత్సంబంధ దానాది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.