ఇది మీకు బహు అనుకూలమైన కాలం, పట్టినది బంగారమయ్యే కాలం అంటే, ఇక మీరు కార్యోన్ముఖులు కావలసిన(పని చేయవలసిన కాలం). వివిధ రంగాల నుండి అనుకోని విధంగా బహుమతులు, లాభాలు వచ్చి పడిపోతుంటాయి. ఇది మీకు మరింత మెరుగైన కెరియర్ ను , సర్వతో ముఖాభివృద్ధిని అందిస్తుంది. మీ వ్యతిరేకులు, మీ దారిలో ఎదురుపడడానికి కూడా సాహసించరు. ఇక మీ వంతుగా తగినవిధంగా ఆకర్షణను, కీర్తిని పొందుతారు. పాలకుల నుండి, మీ పై అధికారులనుండి, ఉన్నతాధికారులనుండి, అభిమానాన్ని చూరగొంటారు.మీకుచక్కని ఆరోగ్యం, శరీర సౌష్టవం ఉంటాయి. ఈ ఏడాది మీకు, వాహన ప్రాప్తి కూడా సూచిస్తున్నది.
Oct 22, 2025 - Dec 09, 2025
వృత్తిపరంగా, మరియు వ్యక్తిగతంగా కూడా, ఈ సంవత్సరం భాగస్వామ్యం కలిసివస్తుంది. ఏది ఏలాగైనా, మీరు చాలాకాలంగా ఎదురు చూస్తున్నట్టిజీవిత గమనాన్నే మార్చేసే ఉక్కిరిబిక్కిరి చేసే సంఘటన జరగవచ్చును. మీ బాధ్యతలను చక్కగా నిర్వహించి. మీ తల్లితండ్రులతోను, మీపిల్లలతోను, బంధువులతోను అదే దగ్గరితనాన్ని కొనసాగిస్తారు. కబుర్లు అందచేయడం, సంప్రదింపులు ఫలించుతాయి, మీకు క్రొత్త అవకాశాలుచేకూరుస్తాయి. వ్యాపారరీత్యా/ ఉద్యోగపరంగా వగైరా తరచు ప్రయాణాలు ఉంటాయి. మీరువిలువైన లోహాలు, రత్నాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
Dec 09, 2025 - Feb 05, 2026
మీరు వెదజల్లే అమితమైన శక్తి (ఎనర్జీ) మీజీవితంలో మిమ్మల్ని సమర్థించే ఎంతో మందిని మీవైపుకు ఆకర్షిస్తుంది. మీ శతృవులు మిమ్మల్ని తలెత్తి చూడడానికి సాహసించరు. ఆర్థికంగా ఇది మీకు అత్యుత్తమ కాలం. మీ వ్యక్తిగతంగా, మీ స్నేహితులతో ఉన్నపుడు ఇంకా కుటుంబం తోను మంచిగా ఉండడానికి క్రొత్తదారులు నేర్చుకుంటున్నారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచుకుంటున్నకొద్దీ, మీ వరకు మీరు ఆత్మ శక్తిని పెంచుకుంటే మీ అవసరాలకు నిలబడగలుగుతారు. మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీ పని పరిస్థితులు తప్పనిసరిగా మెరుగవుతాయి. మీ సహోద్యోగులు అధీన పనివారు మీకు అన్నివిధాలా బాగా సహకరిస్తారు. మీరు కొంత భూమిని, లేదా యంత్రాలను కొనుగోలు చేస్తారు. మీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ అవసరం.
Feb 05, 2026 - Mar 29, 2026
ఈ ఏడాది మీకు పనిభారం పెరిగినా ప్రశంసలు, వృత్తిపరంగా రాణించడంతో యోగిస్తుంది. మీరు మనసుపెట్టి చేసిన పనులు లాభించి విజయాలను సాధించిపెట్టే ఉత్తమమైన కాలమిది. కుటుంబసభ్యుల సహకారం అందుతుంది. కీర్తి పొందుతారు. వృత్తిపరంగాగొప్ప అభివృద్ధి కానవస్తుంది. మీ శతృవులను అధిగమిస్తారు. అందరితోనూసత్సంబంధాలు కొనసాగిస్తారు.
Mar 29, 2026 - Apr 19, 2026
మీ పై అధికారులనుండి లేదా బాధ్యతాయుతమైన లేదా పరపతిగల వ్యక్తుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. వృత్తిపరంగా మీరు రాణిస్తారు. కుటుంబం నుండి కూడా సహకారం అందుతుండడం కనబడుతుంది. దూరప్రాంతాలలోగలవారు, లేదా విదేశీ వ్యక్తులద్వారా సహకారం అందుతుంది. అదాటుగా చేసిన వాటికి కూడా,మీకిష్టమై చేస్తే,ఇది మంచియోగదాయకమైన కాలం కాగలదు. మీకు సమాజంలో మర్యాద మరింత గౌరవం పెరుగుతుంది. క్రొత్త ఇల్లు కడతారు, అన్నివిధాల సంతోషాలను పొందుతారు.
Apr 19, 2026 - Jun 19, 2026
మీరీసమయంలో ఎక్కువ సొమ్మును విలాసాలకు సౌఖ్యాలకు ఖర్చు చేస్తారు. ఇది మీరు అదుపు చేస్తే మంచిది. మీకు ప్రేమవ్యవహారాలలో నిరాశకలుగుతుంది. కుటుంబజీవితాన సమస్యలు ఎదురౌతాయి. మీ శతృవులు మీకు హానిచేయగల అన్ని దారులలోను తమ ప్రయత్నాలు చేస్తారు. కనుక మీరు వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను చేసే పనులను సావధానంగా చేయండి. మీకుటుంబ సభ్యులొకరి అనారోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఆర్థికంగా మరీ చెడుకాలం కాక పోయినా కానీ మీ ఖర్చులపై అదుపుఉంచండి. మీ ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకొండి.
Jun 19, 2026 - Jul 07, 2026
ఈ సమయంలో, మీరు మంచి విశ్వాసంతోను, సానుకూల దృక్పథంతోను ఉంటారు. మీరు ప్రభుత్వం లోను, లేదా వ్యక్తిగత జీవితంలోను శక్తిని, అధికారాన్ని కొనసాగిస్తారు. ప్రయోజనకరమైన దగ్గరి ప్రయాణాల సూచనలున్నాయి. మీరు డబ్బును విరివిగా ఖర్చు పెడతారు. మీకు లేదా మీ సన్నిహిత కుటుంబ సభ్యులలో ఒకరికి అనారోగ్య సూచన ఉన్నది. ప్రత్యేకించి, మీ జీవిత భాగస్వామికి, శిరోవేదన లేదా కంటి సంబంధమైన బాధల సూచన ఉన్నది.
Jul 07, 2026 - Aug 07, 2026
మీరు ఎన్నో అవకాశాలున్నా కూడా, దారిలో ఎదురు రానున్న అవకాశాలను అంది పుచ్చుకోలేరు, అన్నీ వ్యర్థమే అయిపోతాయి. ఆరోగ్యపరంగా మీకు కానీ, మీ తల్లితండ్రులకు కానీ సమస్యలు ఎదురుకావచ్చును. కనుక తగిన జాగ్రత్త తీసుకొనండి. దూరప్రయాణాలు ఉన్నా ఎక్కువగా లాభించవు. కనుక మానడం మంచిది. ఇది మీకు మిశ్రమ ఫలితాల కాలం. మీ సహోద్యోగులతోను, ఇతరులతోను, వివాదాలు కలగవచ్చును. జలుబు, జ్వరం సోకగలదు. ఏ ప్రత్యేక కారణం లేకుండానే, మానసిక ఆందోళన కలగవచ్చును.
Aug 07, 2026 - Aug 28, 2026
మీకు మిశ్రమ ఫలితాలు కలిగే కాలమిది. చిన్న చిన్న అనారొగ్యాలే కదా అని నిర్లక్ష్యం చేయకండి, ఏమంటే, అవే పెద్దవిగా మారవచ్చును. అటువంటి శ్రద్ధ చూపవలసిన అనారోగ్యాలు, అల్సర్, కీళ్ళ సంబంధమైన రుమాటిజం, వాంతులు, తల మరియు, కంటి సంబంధ సమస్యలు, కీళ్ళ జాయింట్ల వద్ద నొప్పి, లేదా, బరువైన లోహవస్తువు పడడంవలన వచిన బొప్పి(లంప్) మొదలైనవి ఉన్నాయి. కష్టతర పరిస్థితులు ఎదురైతే, బెంబేలు పడిపోకుండా, మరల అదృష్టం మరల మిమ్మల్నివరిస్తుందని ధీమాతో నిలబడండి. ప్రభుత్వంతోను, సీనియర్ అధికారులతోను వివాదాలు కలగవచ్చును. కనుక జాగ్రత్తగా ఉండండి. స్పెక్యులేషన్లకి, రిస్క్ లకి అనుకూలమైన సమయం కాదు.
Aug 28, 2026 - Oct 22, 2026
ఇది మీకు మంచి కాలం కాదు. మీ శతృవులు మీ శతృవులు మీ ప్రతిష్టదెబ్బ తీయ చూస్తారు. ఆకస్మిక ధన నష్టం కలగవచ్చును. మీఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆహారం విషతుల్యమవడంతో, ( ఫుడ్ పాయిజనింగ్) కడుపునొప్పులకి దారితీస్తుంది. కాలం మీకు అనుకూలించదు కనుక వ్యాపారాలలో మీరు రిస్క్ తీసుకునే ప్రయత్నం చెయ్యవద్దు. మీ బంధు మిత్రులతో చిన్న విషయాల్కే వివాదాలు పెరగవచ్చును. పెద్ద/ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. లేకుంటే కష్టాలలో పడతారు. అంతే కాదు మీరు కృతజ్ఞత లేని పనిని చేయవలసి రావచ్చును.