ఇది మీకు బహు అనుకూలమైన కాలం, పట్టినది బంగారమయ్యే కాలం అంటే, ఇక మీరు కార్యోన్ముఖులు కావలసిన(పని చేయవలసిన కాలం). వివిధ రంగాల నుండి అనుకోని విధంగా బహుమతులు, లాభాలు వచ్చి పడిపోతుంటాయి. ఇది మీకు మరింత మెరుగైన కెరియర్ ను , సర్వతో ముఖాభివృద్ధిని అందిస్తుంది. మీ వ్యతిరేకులు, మీ దారిలో ఎదురుపడడానికి కూడా సాహసించరు. ఇక మీ వంతుగా తగినవిధంగా ఆకర్షణను, కీర్తిని పొందుతారు. పాలకుల నుండి, మీ పై అధికారులనుండి, ఉన్నతాధికారులనుండి, అభిమానాన్ని చూరగొంటారు.మీకుచక్కని ఆరోగ్యం, శరీర సౌష్టవం ఉంటాయి. ఈ ఏడాది మీకు, వాహన ప్రాప్తి కూడా సూచిస్తున్నది.
Apr 5, 2023 - Apr 26, 2023
మీకు ఇది శారీరకంగాను మానసికంగాను అనుకూలమైన కాలం . మీ బంధువులకు ప్రత్యేకించి మీ సోదరులకి ఎదగడానికి మంచి సమయం. సఫలత ఖచ్చితమే కాబట్టి, మీ జీవితానికి సంబంధించిన ప్రయత్నాలు చెయ్యండి. వస్తు సంచయం కలుగుతుంది. మీ శతృవులెవరూ మీముందు కుప్పిగంతులు వేయలేరు. ఈ సమయంలో మీ కోరిన ది నెరవేరగలదు. విజేతగా నిరూపితమౌతారు.
Apr 26, 2023 - Jun 20, 2023
ఈ ఏడాది మీరు నష్టాల భర్తీకి క్రొత్త ఆలోచనలు చేస్తారు. కానీ అవి నష్టాలకే దారితీస్తాయి. ఏమంటే, వ్యయంకూడా స్థిరంగా పెరుగుతూ వస్తున్నది. ఇది దీర్ఘకాలంలో నేరుగా అంత లాభసాటికాదు. శత్రువులనుండి, న్యాయ పరమైన సమస్యలు కలగవచ్చును. అయితే మీరు, ఉన్నచోటు నుండే నిరాడంబరంగా ఉంటూ, మీ స్థిరత్వాన్ని పైకి కనపడనివ్వండి. అయితే ఈ ఔట్ లుక్ కొద్దికాలమే పనిచేస్తుంది. మధ్యస్థం మరియు దీర్ఘకాల ప్రోజెక్ట్ లు ఒప్పుకోవడం మొదలుపెట్టడం మంచిది. మీ కంటికి సంబందించిన సమస్యలుండవచ్చును. ఇతర స్త్రీ పురుషులుల తో హార్థికమైన సంబంధాలు త్వరితంగా ఆర్థిక ప్రయోజనాలను ఇస్తాయా అని పరిశీలించుకోవడం ముఖ్యం. మీ గర్ల్ / బాయ్ ఫ్రెండ్ వలన సమస్య రావచ్చును.
Jun 20, 2023 - Aug 08, 2023
కష్టాలునిస్పృహలు కలుగుతాయి. మీరు వీటినుండి సానుకూల అంశాలనుస్వీకరించి అవసరమైన మిగిలినవాటిని సగంలో అసంపూర్తిగా వదిలెయ్యరాదు. మీ పనిచేసే చోట అన్నిటా మీరై ఉండాలి. ఆకస్మిక నష్టాలు కలగవచ్చును. విదేశీ మూలాధారంగా ఆదాయం కలగవచ్చును. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చికాకుకు గురిచేయవచ్చును. అంతగా లాభసాటికాని వ్యవహారాలలో తలపెట్టవలసి రావచ్చును. కుటుంబ వాతావరణం అంత సామరస్యంగా ఉండకపోవచ్చును. మీ శత్రువులు మీ ప్రతిష్టను ఏదోవిధంగా దెబ్బతీయడాని గల అన్ని మార్గాలలోను ప్రయత్నిస్తారు. అంతగా యోగించే కాలం కాదు.
Aug 08, 2023 - Oct 04, 2023
భౌతికంగా ను మానసికంగాను కూడా మీకీ దశ ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ బంధువులకు కూడా మంచి కాలం. మీ జీవితకాలంలో గల కెరియర్ కోసం చేసే ప్రయత్నాలను కొనసాగించండి. ఏమంటే, ఇది కలిసివచ్చే కాలం. వస్తు లాభం కూడా సూచితం. ఈ సమయంలో భూమి, యంత్ర పరికరాల కొనుగోలు కూడా జరుగుతుంది. వ్యాపారం లోను, వాణిజ్యంలోను లాభాలు నిశ్చయం. మీ శతృవులు మీముందు, తోక ఝాడించలేరు, మీకు అపకారం చేయలేరు. ప్రేమవిషయాలలో ఇది మీకు అనుకూలమైన కాలం. మీ కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ సహకారం అందుతుంది.
Oct 04, 2023 - Nov 25, 2023
ఈ ఏడాది మీకు పనిభారం పెరిగినా ప్రశంసలు, వృత్తిపరంగా రాణించడంతో యోగిస్తుంది. మీరు మనసుపెట్టి చేసిన పనులు లాభించి విజయాలను సాధించిపెట్టే ఉత్తమమైన కాలమిది. కుటుంబసభ్యుల సహకారం అందుతుంది. కీర్తి పొందుతారు. వృత్తిపరంగాగొప్ప అభివృద్ధి కానవస్తుంది. మీ శతృవులను అధిగమిస్తారు. అందరితోనూసత్సంబంధాలు కొనసాగిస్తారు.
Nov 25, 2023 - Dec 16, 2023
ఇది మీకు మిశ్రమ కాలం. ఈ సమయంలో, మీరు మానసిక వత్తిడిని, అలసటను ఎదుర్కొంటారు. మీ వ్యాపార రీత్యా భాగస్వాములతో సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఈ సమయం మంచిదికాదు. ప్రయాణాలు సఫలం కావు. మీకు అతి దగ్గరివారితో భేదాభిప్రాయాలు రావచ్చును కనుక, ఇటువంటి పరిస్థితుల నుండి తప్పించుకొండి. రిస్క్ లు తీసుకునే బుద్ధిని త్రుంచి, మానుకోవాలి.ఏదిఏమైనా, ఇదిప్రేమకు , రొమాన్స్ కు సరైన సమయం కాదు. మీరు ప్రేమ మరియు, సంబంధాలలో అతి జాగ్రగా ఉండాలి, లేకుంటే, అవి మీకు అగౌరవాన్ని కలిగించి, ఇంకా మన్ననను కూడా పోగొడతాయి
Dec 16, 2023 - Feb 15, 2024
ఈ దశ మీకు ఎన్నోకారణాలవలన అత్యుత్తమ యోగదాయకం. ఎన్నో విషయాలు వాటంతట అవే పరిష్కరింపబడి సఫలం అయేటంతగా ఉండే మీ స్నేహశీలత అద్భుతం. మీ ఇంటికి సంబంధించిన అన్ని విషయాలను ఖచ్చితమైన పరిధిలలో సానుకూలమై పోతుంటాయి. ఈ కాలంలో మీ కుతూహలం, గాఢమైన ఇచ్ఛ మీ పనితనాన్ని ఎప్పటికంటె అత్యున్నతంగా చూపెడతాయి. ఉన్నత వర్గాల సహకారం అందుతుంది. మీ పదవిలో ఉన్నతి కలుగుతుంది. మీ శత్రువులను ఓడించడం జరుగుతుంది. మీ కుటుంబ సభ్యులు మరియు, బంధువుల అనుకూలత మీకు లభిస్తుంది. మీ చుట్టూరా, ఆహ్లాదకరమైన పరిస్థితులు కానవస్తాయి.
Feb 15, 2024 - Mar 04, 2024
ప్రవర్తనలో కోపం ప్రదర్శించకండి. ఎందుకంటే, మీ కోపిష్టి స్వభావం మిమ్మల్ని కష్టతర పరిస్థితులకు గురిచేస్తుంది. మీ స్నేహితులతో అభిప్రాయ భేదాలు, తగువులు, కొట్లాటలు సంభవించవచ్చును. కనుక, చక్కటి సంబంధాలను నెరపండి లేకపోతే, వారితో సన్నిహితత్వం దెబ్బ తినే అవకాశం ఉన్నది. ఆర్థికంగా ఒడిదుడుకులు కలగవచ్చును. కుటుంబంలోనూ, అశాంతి, అపార్థాలు కలగవచ్చును. జీవితభాగస్వామితోను, తల్లితోను మనస్పర్థలు కలగవచ్చును. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ప్రత్యేక శ్రద్ధ సత్వరమే అవసరమయే అనారోగ్యాలు, రోగాలు, తలనొప్పి, కంటి తాలూకు, క్రిందిపొట్ట తాలూకు,అనారోగ్యం, పాదాల వాపులు.
Mar 04, 2024 - Apr 04, 2024
మీకు ఇది శారీరకంగాను మానసికంగాను అనుకూలమైన కాలం కాదు. ఆరోగ్య సంబంధమైన చికాకులు మీ మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తాయి. మీ వైరివర్గం వారు మీ కుటుంబ సభ్యుల ముందు, స్నేహితుల ముందు మీ ప్రతిష్ఠను కళంకపరిచే ప్రయత్నం చేయవచ్చును. కనుక మీ రు అటువంటి వారికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్య సంబంధమైన చికాకులకు అవకాశం ఉన్నందున మీరు ఎంతో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇంకా మీ జీవిత భాగస్వామియొక్క ఆరోగ్యం కూడా పాడయే అవకాశం ఉన్నది.