ఇది మీకు బహు అనుకూలమైన కాలం, పట్టినది బంగారమయ్యే కాలం అంటే, ఇక మీరు కార్యోన్ముఖులు కావలసిన(పని చేయవలసిన కాలం). వివిధ రంగాల నుండి అనుకోని విధంగా బహుమతులు, లాభాలు వచ్చి పడిపోతుంటాయి. ఇది మీకు మరింత మెరుగైన కెరియర్ ను , సర్వతో ముఖాభివృద్ధిని అందిస్తుంది. మీ వ్యతిరేకులు, మీ దారిలో ఎదురుపడడానికి కూడా సాహసించరు. ఇక మీ వంతుగా తగినవిధంగా ఆకర్షణను, కీర్తిని పొందుతారు. పాలకుల నుండి, మీ పై అధికారులనుండి, ఉన్నతాధికారులనుండి, అభిమానాన్ని చూరగొంటారు.మీకుచక్కని ఆరోగ్యం, శరీర సౌష్టవం ఉంటాయి. ఈ ఏడాది మీకు, వాహన ప్రాప్తి కూడా సూచిస్తున్నది.
Nov 20, 2025 - Jan 11, 2026
ఈ ఏడాది మీకు పనిభారం పెరిగినా ప్రశంసలు, వృత్తిపరంగా రాణించడంతో యోగిస్తుంది. మీరు మనసుపెట్టి చేసిన పనులు లాభించి విజయాలను సాధించిపెట్టే ఉత్తమమైన కాలమిది. కుటుంబసభ్యుల సహకారం అందుతుంది. కీర్తి పొందుతారు. వృత్తిపరంగాగొప్ప అభివృద్ధి కానవస్తుంది. మీ శతృవులను అధిగమిస్తారు. అందరితోనూసత్సంబంధాలు కొనసాగిస్తారు.
Jan 11, 2026 - Feb 01, 2026
మీరు మీ పై అధికారులతోమంచి సంబంధాలు నెరుపుతారు. ఇది మీకు దీర్ఘకాలంలో ప్రయోజనకరం కాగలదు. మీ స్థానభ్రంశం సూచన కోల్పోయే అవకాశం ఉన్నది. మీ మెదడులో నూతన ఆవిష్కారలు(ఇన్నొవేటివ్) మరియు, సృజనాత్మక ఆలోచనలతో నిండి ఉంటుంది. కానీ వాటిని అమలు పరిస్తే కలిగే లాభనష్టాల బేరీజు వేయనిదే, వాటిని మీరు అమలు చేయకండి. మీరు మీ కుటుంబ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యాన్నివ్వాలి. ప్రయాణసూచనలున్నాయి, అవి ఫలవంతం కాగలవు. మీ కుటుంబ సభ్యులలో అనారోగ్య అవకాశాలున్నాయి, కనుక మీది మరియు వారి ఆరోగ్యం పట్ల,శ్రద్ధ వహించండి.
Feb 01, 2026 - Apr 03, 2026
మీరీసమయంలో ఎక్కువ సొమ్మును విలాసాలకు సౌఖ్యాలకు ఖర్చు చేస్తారు. ఇది మీరు అదుపు చేస్తే మంచిది. మీకు ప్రేమవ్యవహారాలలో నిరాశకలుగుతుంది. కుటుంబజీవితాన సమస్యలు ఎదురౌతాయి. మీ శతృవులు మీకు హానిచేయగల అన్ని దారులలోను తమ ప్రయత్నాలు చేస్తారు. కనుక మీరు వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను చేసే పనులను సావధానంగా చేయండి. మీకుటుంబ సభ్యులొకరి అనారోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఆర్థికంగా మరీ చెడుకాలం కాక పోయినా కానీ మీ ఖర్చులపై అదుపుఉంచండి. మీ ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకొండి.
Apr 03, 2026 - Apr 21, 2026
ఈ సమయంలో, మీరు మంచి విశ్వాసంతోను, సానుకూల దృక్పథంతోను ఉంటారు. మీరు ప్రభుత్వం లోను, లేదా వ్యక్తిగత జీవితంలోను శక్తిని, అధికారాన్ని కొనసాగిస్తారు. ప్రయోజనకరమైన దగ్గరి ప్రయాణాల సూచనలున్నాయి. మీరు డబ్బును విరివిగా ఖర్చు పెడతారు. మీకు లేదా మీ సన్నిహిత కుటుంబ సభ్యులలో ఒకరికి అనారోగ్య సూచన ఉన్నది. ప్రత్యేకించి, మీ జీవిత భాగస్వామికి, శిరోవేదన లేదా కంటి సంబంధమైన బాధల సూచన ఉన్నది.
Apr 21, 2026 - May 21, 2026
మీరు ఎన్నో అవకాశాలున్నా కూడా, దారిలో ఎదురు రానున్న అవకాశాలను అంది పుచ్చుకోలేరు, అన్నీ వ్యర్థమే అయిపోతాయి. ఆరోగ్యపరంగా మీకు కానీ, మీ తల్లితండ్రులకు కానీ సమస్యలు ఎదురుకావచ్చును. కనుక తగిన జాగ్రత్త తీసుకొనండి. దూరప్రయాణాలు ఉన్నా ఎక్కువగా లాభించవు. కనుక మానడం మంచిది. ఇది మీకు మిశ్రమ ఫలితాల కాలం. మీ సహోద్యోగులతోను, ఇతరులతోను, వివాదాలు కలగవచ్చును. జలుబు, జ్వరం సోకగలదు. ఏ ప్రత్యేక కారణం లేకుండానే, మానసిక ఆందోళన కలగవచ్చును.
May 21, 2026 - Jun 12, 2026
మీకు మిశ్రమ ఫలితాలు కలిగే కాలమిది. చిన్న చిన్న అనారొగ్యాలే కదా అని నిర్లక్ష్యం చేయకండి, ఏమంటే, అవే పెద్దవిగా మారవచ్చును. అటువంటి శ్రద్ధ చూపవలసిన అనారోగ్యాలు, అల్సర్, కీళ్ళ సంబంధమైన రుమాటిజం, వాంతులు, తల మరియు, కంటి సంబంధ సమస్యలు, కీళ్ళ జాయింట్ల వద్ద నొప్పి, లేదా, బరువైన లోహవస్తువు పడడంవలన వచిన బొప్పి(లంప్) మొదలైనవి ఉన్నాయి. కష్టతర పరిస్థితులు ఎదురైతే, బెంబేలు పడిపోకుండా, మరల అదృష్టం మరల మిమ్మల్నివరిస్తుందని ధీమాతో నిలబడండి. ప్రభుత్వంతోను, సీనియర్ అధికారులతోను వివాదాలు కలగవచ్చును. కనుక జాగ్రత్తగా ఉండండి. స్పెక్యులేషన్లకి, రిస్క్ లకి అనుకూలమైన సమయం కాదు.
Jun 12, 2026 - Aug 05, 2026
ద్రిమ్మరితనం (త్రిప్పట, తిరగడం) కెరియర్ గురించి, దిశ గమ్యం లేనితనం, ఈ దశ్ మొదలైనపుడు కెరియర్ లో ఉంటుంది. ఈ సమయంలో, ఖచ్చితంగా మీరు ఏ ప్రాజెక్ట్ లు తీసుకోవడం కానీ, కెరియర్ లో ముఖ్యమైన మార్పులు కానీ ఒప్పుకోకూండా అవాయిడ్ చెయ్యాలి. మీ బంధువులు స్నేహితులతో సామరస్యత ను సాధించలేరు. అవాంఛనీయ పరిస్థితులు ఎదురు కాచ్చును. అవి మీజీవితంలో తగువులు, కష్టాలు తేగలవు. త్వరగా డబ్బుపొందాలని ఏ విధమైన కూడని పనులూ చేయకండి. పని పరిస్థితులు, సంతృప్తికరంగా ఉండవు. యాక్సిడెంట్ /అస్తవ్యస్థతల ప్రమాద సూచన ఉన్నది. వ్యతిరేక పరిస్థితులలో కూడా ఆత్మ విశ్వాసాన్ని పుంజుకొని ఈ కష్టకాలాన్ని అధిగమించడానికి ప్రయత్నించండి మీకు కఫ సమస్యలు, ఆస్థమా సంబంధ దురవస్థ లేదా కీళ్ళ తాలూకు రుమాటిక్ నొప్పులు కలగ వచ్చును.
Aug 05, 2026 - Sep 23, 2026
ఈ దశ మీకు, అన్ని పెత్తనాలను తప్పనిసరిగా తేనున్నది. ఒక విదేశీ పరిచయం, లేదా సంబంధం, మీకు ఉపయోగపడనున్నది. వారు, మీరు ఎంతోకాలంగా పొందడానికై తపన పడినట్టి స్థాయి, అధికారం మరియు అనుకోని విధంగా చక్కని ఆదాయం కలగడానికి మూలకారణం అవుతారు. మీరు స్వ శక్తిని నమ్మడం, అదే భావనని కొనసాగించండి. ఈ ఏడాది, మిమ్మల్ని సంపూర్ణంగా ఒక క్రొత్త స్థాయిని అందుకునేలా చేస్తుంది. కుటుంబ వాతావరణం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూర ప్రయాణం ప్రయోజనకరం కాగలదు. మతంపట్ల మీరు ఇష్టాన్ని చూపడం , తత్సంబంధ దానాది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.
Sep 23, 2026 - Nov 20, 2026
ఉద్యోగ అంశాలు చాలవరకు ఆశించినకంటె తక్కువగా ఉంటాయి. మొత్తంమీద అంత సంతృప్తికరంగా ఉండదు. పనిచేసే చోట చీకాకు ఒత్తిడి ఉంటాయి. రిస్క్ ఉండే లక్షణాలు ఏవి ఉన్నాకానీ మొత్తంగా విసర్జించాలి. ఏ ముఖ్యమైన పనినీ మీరు చేపట్టవద్దు. వృత్తి పరంగా మీకు ఈ సంవత్సరం ఆటంకాలు మరియు సవాళ్ళు అనుభవంలోకి వస్తాయి. అస్థిరత, అయోమయం ఉంటాయి. మీ స్వంతమనుషులనుండి మీకు సహాయం అందదు. మీకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు జరిగే అవకాశం ఉంటుంది.మీదగ్గరి వ్యక్తుల అనారోగ్యం మీకు ఆతృతను కలిగిస్తుంది. మీకు ఈ దశలో, కుటుంబ సంబంధ సమస్యలు ఎదురవుతాయి. మీరు వీలైనంత వరకు నిరాడంబరంగాఉంటూ మార్పులేమీ చేపట్టకుండా ఉండండి.