ఈ రాశి వారిని విరోధులు మరియు వ్యతిరేకులు ఎదురుపడడానికి కూడా సాహసించరు. న్యాయపరమైన వివాదాలు మీకు అనుకూలంగా ఉంటాయి. పేరు, ప్రతిష్ఠ ధనలాభం ఇంకా ఆర్థికసంబంధ వ్యవహారాలలో విజయాలు మీ రు అనుభవిస్తారు. బంధువులు, సోదరుల నుండి మంచి సహకారం అందే సూచనలున్నాయి. మతపరంగా పవిత్ర స్థల దర్శనం చేస్తుండడం, ప్రజల సహాయం మీకు అందడం జరుగుతుంది. మీప్రయత్నాలు ఫలిస్తాయి, శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు.
Dec 8, 2023 - Jan 25, 2024
వృత్తిపరంగా, మరియు వ్యక్తిగతంగా కూడా, ఈ సంవత్సరం భాగస్వామ్యం కలిసివస్తుంది. ఏది ఏలాగైనా, మీరు చాలాకాలంగా ఎదురు చూస్తున్నట్టిజీవిత గమనాన్నే మార్చేసే ఉక్కిరిబిక్కిరి చేసే సంఘటన జరగవచ్చును. మీ బాధ్యతలను చక్కగా నిర్వహించి. మీ తల్లితండ్రులతోను, మీపిల్లలతోను, బంధువులతోను అదే దగ్గరితనాన్ని కొనసాగిస్తారు. కబుర్లు అందచేయడం, సంప్రదింపులు ఫలించుతాయి, మీకు క్రొత్త అవకాశాలుచేకూరుస్తాయి. వ్యాపారరీత్యా/ ఉద్యోగపరంగా వగైరా తరచు ప్రయాణాలు ఉంటాయి. మీరువిలువైన లోహాలు, రత్నాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
Jan 25, 2024 - Mar 23, 2024
అసలు జీవితం(కెరియర్)లోనే అత్యంత కష్ట కాలంతో ఈ దశ మొదలవుతుంది. కార్యక్రమానికి(చర్యకి) అవకాశాలలో మునిగి తేలుతారు. మధ్యలో సంబంధంలేని పనులలో అభివృద్ధి కనిపించినా కెరియర్ కి అవి పనికిరావు. క్రొత్త పెట్టుబడులు, లేదా రిస్క్ గల వ్యవహారాలు మానాలి. ఎందుకంటే నష్టాల కాలమిది. కనుక అటువంటి వాటిని, తప్పించుకోవాలి. మీ పై అధికారులతో కోపావేశాలను ప్రదర్శించడం మానాలి. ఇతరుల నుండి సహాయం పొందేకంటె మీ స్వంత నైపుణ్యం శక్తియుక్తులు వాడుకోవడం మంచిది. దొంగతనం, లేదా ఇతర కారణాలవలన ధననష్టం కూడా జరగవచ్చును. మీగురించి, మీ కుటుంబ సభ్యులగురించి తగిన శ్రద్ధ తీసుకొండి. ఒకరి మరణ వార్తను కూడా వినవలసి రావచ్చును.
Mar 23, 2024 - May 14, 2024
ఆరోగ్య సమస్యలతో బాధ పడతారు. మీ వద్ద డబ్బును నిలవ ఉంచుకోవడం కష్టమే అవుతుంది. ఏమంటే, మీకు విలాసాలకు, సుఖ సంతోషాలకోసం డబ్బును ఖర్చు పెట్టేసే గుణం ఉన్నది. ఈ సమయంలో మీరు స్పెక్యులేషన్లకు, విరివిగా ఖర్చుపెట్టడం తగదు. చిన్నపాటి తగాదాలు, అపార్థాలు, ఇంకా వాదనలు మీ కుటుంబ వాతావరణాన్ని, దాని ప్రశాంతతను దెబ్బతీస్తాయి. మీరంటే అసూయ ఉన్నవారు, సమస్యలను సృష్టిస్తారు. దాంతో, కుటుంబంలో నీలాపనిందలను, అసంతోషాన్ని ఎదుర్కొనాల్సి వస్తుంది. అటువంటివారిపట్ల జాగ్రత్త వహించండి. స్త్రీలవలన సమస్యలు రావచ్చును, హెచ్చరికగా ఉండడం అవసరం.
May 14, 2024 - Jun 04, 2024
మీరు చక్కని ఫలితాలకోసం స్థిరంగా నిరంతరంగా పనిచేస్తూ పోవాలి. చురుకుగా డైనమిజం మరియు ఎదుగుదల ఉంటాయి. . మీ సహోద్యోగులతోను, పై అధికారులతోను చక్కటి సంబంధాలను, ర్యాపోర్ట్ ని నెరపగలరు. మీకు, ఆదాయ వనరులు బాగున్నాయి. మీ కుటుంబంతోజీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. ఆధ్యాత్మికంగా మీరు చాలా మంచిస్థితిలో ఉంటారు. మీరు పదోన్నతిని కోరుకుంటే కనుక , మీకు తప్పక లభిస్తుంది. మీ స్నేహ బృందం ఇంకా విస్తరిస్తుంది. ఆకస్మిక ప్రయాణం, అదృష్టాన్ని తెస్తుంది. ఈ దశలో అభివృద్దిని పొంది, దానధర్మాలు చేస్తారు.
Jun 04, 2024 - Aug 04, 2024
ఇంతకు ముందు లేని అధికారం మీ చేతికొస్తుంది. వ్యక్తిగతంగా మీకిష్టమైన వారు తమ ఇష్టపూర్తి కోసం, సౌకర్యాలకోసం, మీపైన ఆధారపడతారు. మీ మానసిక శక్తి చాలా గొప్పది. మరి ముఖ్యంగా మీజీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత తీయనై, బలపడుతుంది. సంతానయోగం కానవస్తున్నది. మీ క్రింద పనిచేసే వారు పూర్తి విధేయతతో మీ కు పనిచేస్తారు. మొత్తం మీద ఈ కాలం అనుకూలం. ఆహ్లాదకరం.
Aug 04, 2024 - Aug 22, 2024
జీవితం పట్ల ఉత్సాహంగా ఉంటారు. మంచి సాహసం కలిగి, తీవ్రమైన లేదా హింసాత్మక ప్రవర్తన కలిగిఉంటారు. బుద్ధి పైన అదుపు తప్పడం, మరియు విచక్షణ కోల్పోవడం జరగవచ్చును. మీకు ప్రజాదరణ తగ్గడంతో పాటు, వివాదాలతో కొంత సమస్య తలెత్తవచ్చును. ఈ కాలం ప్రేమకు, ప్రేమాయణాలకు అనుకూలం కాదు. సంతానం, మరియు, జీవిత భాగస్వామి అనారోగ్యంతో బాధపడవచ్చును. ప్రయోజనకర అంశాలను చూస్తే, సంతానప్రాప్తి, పై అధికారుల నుండి ప్రయోజనం సమకూరే అవకాశం ఉంది.
Aug 22, 2024 - Sep 22, 2024
ఇది మీకు అత్యంత యోగదాయకమైన కాలం. మీరు మీ ఆలోచనలతోచక్కని ఆత్మ విశ్వాసం కలిగి ఉంటారు. ఇంకా, పదవి పెరగడం(ప్రమోషన్)పట్ల గల అవకాశాలు హెచ్చుగా ఉండడగలదు. విజయవంతమయే ఆకస్మిక ప్రయాణాల సూచనలున్నాయి. సంతానపరంగా జీవిత భాగస్వామితో ప్రేమానురాగాలు బలపడతాయి. సంతోషం మీ సోదరులకు కూడా కలిసివచ్చే కాలం. స్థలమార్పు లేదా వృత్తి మార్పు ఆలోచన విరమించవలసిఉంది.
Sep 22, 2024 - Oct 13, 2024
కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగించవచ్చును. ప్రయాణాలు కలిసిరావు కనుక మానవలసింది. అనవసర ఖర్చులు అవుతాయి కనుక జాగ్రత్త గా ఉండాలి. స్నేహితులతోను, సహచరులతోను జాగ్రత్త, కొన్నిసార్లు, మీ న్యాయ నిర్ణయం,విచక్షణ సరిగా ఉండకపోవచ్చును. అగ్ని వలన కానీ, స్త్రీల వలనగానీ గాయపడవచ్చును. హృదయ సంబంధ సమస్యలు తలెత్తవచ్చును కనుక, ఆరోగ్య విషయమై జాగ్రత్త చూపాలి.
Oct 13, 2024 - Dec 07, 2024
ఇది మీకు మిశ్రమ ఫలితాలనిచ్చే కాలం. మీ వృత్తి రంగంలో మీ శాయ శక్తులా పనిచేస్తారు. మీ స్థిర నిశ్చయం అనేది ఫలితం పట్ల సవ్యమైన ఇన్ టాక్ట్ ని కలిగి ఉండాలి. అలాగే మీరు ఒకసారి నిశ్చయించుకున్నాక దానిని వదిలి పెట్టకూడదు. మీ వ్యక్తిగత ప్రవర్తనలో మీరు అహంకారపూరితమయ్యే సూచన కనిపిస్తున్నది. ఇది మిమ్మల్ని ప్రజాదరణకు , దూరం చేసి చెడ్డపేరుని తేవచ్చును. అందుకే వ్యక్తులతో మసిలేటప్పుడు, మరింత సరళతను , (ఫ్లెక్జిబిలిటీని), సౌమ్యతను అలవరచుకోండి. మీరు మీ సోదరీ సోదరులను సమర్థిస్తారు. మీ బంధువులకు సమస్యలు కలుగుతాయి.