ఇది మీకు బహు అనుకూలమైన కాలం, పట్టినది బంగారమయ్యే కాలం అంటే, ఇక మీరు కార్యోన్ముఖులు కావలసిన(పని చేయవలసిన కాలం). వివిధ రంగాల నుండి అనుకోని విధంగా బహుమతులు, లాభాలు వచ్చి పడిపోతుంటాయి. ఇది మీకు మరింత మెరుగైన కెరియర్ ను , సర్వతో ముఖాభివృద్ధిని అందిస్తుంది. మీ వ్యతిరేకులు, మీ దారిలో ఎదురుపడడానికి కూడా సాహసించరు. ఇక మీ వంతుగా తగినవిధంగా ఆకర్షణను, కీర్తిని పొందుతారు. పాలకుల నుండి, మీ పై అధికారులనుండి, ఉన్నతాధికారులనుండి, అభిమానాన్ని చూరగొంటారు.మీకుచక్కని ఆరోగ్యం, శరీర సౌష్టవం ఉంటాయి. ఈ ఏడాది మీకు, వాహన ప్రాప్తి కూడా సూచిస్తున్నది.
May 19, 2025 - Jul 13, 2025
క్రొత్త పెట్టుబడులు మరియు రిస్క్ లు అవాయిడ్ చెయ్యాలి. ఈ దశలో మీకు అవాంతరాలు మరియు అడ్డంకులు ఎదురు కావచ్చును. పనిచేసే ఉద్యోగస్తులైతే, అభివృద్ధిని చూస్తారు. అదికూడా కష్టపడి పనిచేసి, దీర్ఘ కాలంగా ఆశావహ దృక్పథం కలిగి ఉంటే, ఇది సాధ్యం. విజయానికి దగ్గరి దారేదీ లేదు కదా. మీరు చక్కని ఫలితాలకోసం స్థిరంగా నిరంతరంగా పనిచేస్తూ పోవాలి. సంవత్సర ప్రారంభంలో, పని పరిస్థితులు, కొద్దిగా అస్తవ్యస్థంగా వత్తిడి కలిగించేలా ఉంటాయి. ఇలాంటప్పుడు క్రొత్త అభివృద్ధిని లేదా వేగంగా పనిచెయ్యడం ఉండకూడదు. ఈ సానుకూల సమయంలో మీ ఆరోగ్య పరిస్థితులు మిమ్మల్ని సరిగా పనిచేసి మీ లక్ష్యాలను చేరుకోనివ్వవు. అందుకే ఆరోగ్య పరీక్షలు అవసరం. సాధారణంగా జ్వరం సమస్యకి చెక్ చేయించుకోవాలి.
Jul 13, 2025 - Aug 30, 2025
కష్టాలునిస్పృహలు కలుగుతాయి. మీరు వీటినుండి సానుకూల అంశాలనుస్వీకరించి అవసరమైన మిగిలినవాటిని సగంలో అసంపూర్తిగా వదిలెయ్యరాదు. మీ పనిచేసే చోట అన్నిటా మీరై ఉండాలి. ఆకస్మిక నష్టాలు కలగవచ్చును. విదేశీ మూలాధారంగా ఆదాయం కలగవచ్చును. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చికాకుకు గురిచేయవచ్చును. అంతగా లాభసాటికాని వ్యవహారాలలో తలపెట్టవలసి రావచ్చును. కుటుంబ వాతావరణం అంత సామరస్యంగా ఉండకపోవచ్చును. మీ శత్రువులు మీ ప్రతిష్టను ఏదోవిధంగా దెబ్బతీయడాని గల అన్ని మార్గాలలోను ప్రయత్నిస్తారు. అంతగా యోగించే కాలం కాదు.
Aug 30, 2025 - Oct 27, 2025
శుభవేళకి మహోదయం ఈ సమయం అనవచ్చును. మీరు ఉదాత్తమైన వ్యవహారాలో మీరు నిమగ్నమవడానికి అవకాశమున్నది. మీరు ఎంతో సంతోషంగా ఉంటారు.వ్యతిరేక పరిస్థితులను కూడా మీరు తట్టుకుంటారు. మీ పిల్లలకు అనారోగ్య సూచనలున్నా, కొంత సమస్యలున్నా కూడా, కుటుంబ సౌఖ్యం మీకు తప్పక అందుతుంది. మీ స్వయం కృషివలన ఆదాయం పెరుగుతుంది. మీ శతృవులు మీకు అపకారం చేయలేరు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కానరావచ్చును. మీ స్నేహితులు, సహచరులు, మీ ప్రయత్నాలలో సహకరిస్తారు.
Oct 27, 2025 - Dec 18, 2025
మీరు ఒక అనంతమైన ఆశావాది. మరి అలాగే, ఈ ఏడాది మీకు ఎదురుకానున్న సంఘటనలు కూడా ఈ మీ స్వభావాన్ని మరింతగా బలపరుస్తాయి. మీ కాలాన్ని , పెట్టుబడిని మీ రాశిఫలాలకు అనుగుణంగా చూసుకుని తెలివైన పెట్టుబడి కనుక చేస్తే, మీ దశ మరింతగా మెరుగౌతుంది. మీకు ప్రియమైన వారినుండి, సహచరులనుండి, అన్నివిధాలా సహకారము సంతోషము లభించుతాయి. మీశత్రువులపై పైచేయి, మీదవుతుంది. ఇంకా వివాహాది శుభకార్యాలు, లేదా రొమాంటిక్ పరిస్థితులు , సంబరాలు కూడా ఎదురురావచ్చును. కుటుంబ వాతావరణం చాలా సంతృప్తికరంగా ఉంటుంది.
Dec 18, 2025 - Jan 08, 2026
ఒకవేళ, ఉద్యోగస్తులైతే, సంవత్సరం మహా దూకుడుగా ఉంటుంది చురుకుగా డైనమిజం మరియు ఎదుగుదల ఉంటాయి. ఏదేమైనా, పని పరిస్థితులు వత్తిడితోనే ఉంటాయి. పై అధికారులతో వాదప్రతివాదాలు, ప్రతిస్పర్థలు ఉంటూనే ఉంటాయి. సాధారణంగా ఈ దశ అంతగా బాగుండదు. ఏమంటే, దగ్గరి సహచరులు, స్నేహితులు, మరియు కుటుంబ సభ్యులు, అందరూ దూరంగా అనిపిస్తారు. పెద్దగా మార్పు ఉండదు, వాంఛితం కూడా కాదు. మీ దృక్పథం, అసభ్య భాషా పదజాలం అలవాటు, అతి దగ్గరైన వారితో, కొన్ని సమస్యలను సృష్టిస్తుంది. కనుక మీ మాటలను అదుపులో ఉంచుకొండి.
Jan 08, 2026 - Mar 10, 2026
పవిత్ర యాత్ర చేసే అవకాశముంది. మీకు రొమాంటిక్ ఆకర్షణీయమైన దృక్పథం ఉన్నది. ఇదిమీకు సానుకూల సంబంధాలను ఇంతవరకు లేనివారితో కూడా, పరిచయాలు పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ ఇష్టాలు కొంతవరకు నెరవేరుతాయి. అవి మీరు పనిచేసే నిచ్చెన క్రమం గల ఉన్నత పదవికి చెందిన ప్రమోషన్లు కావచ్చు, వ్యాపార లాభాలు కావచ్చును, క్రొత్తబండి లేదా క్రొత్త భూమి సాధించగల వీలుంది. మొత్తంమీద మీకిది శుభ సమయం.
Mar 10, 2026 - Mar 28, 2026
ఈ సంవత్సరం, మీ ప్రణయ జీవితానికి మరింత ఘుమఘుమలు చేర్చే కాలం. మీ అంగీకార పత్రాలు, ఒప్పందాలు, అన్నింటికీ, ఈ సంవత్సరంలో లాభాలు పొందడానికి ఇది అత్యుత్తమమైన సంవత్సరం. మీకు అనుకూలమైన విధంగా ఉండే ఒప్పందాలకు ఈ సంవత్సరం మీరు అంగీకరించవచ్చును. అవి మీకు అనుకూలిస్తాయి. వ్యాపార రీత్యా, ఇతర వ్యవహారాల ద్వారా, ఆదాయంలో వృద్ధి ఉంటుంది, స్థాయి, హోదా పెరుగుతాయి. ఇప్పుడు మీ వ్యక్తిగత జీవితంలో సామరస్యాన్ని సాధించడానికి అవసరమైన అన్ని అంశాలను కలిగిఉన్నారు వాహనాలను, ఇతర సౌకర్యాలను పొందుతారు. మీ కుటుంబ జీవితంలో స్థాయి, హోదాలను అదనంగా అనుభవించేకాలంఇది. స్పష్టంగా మీ ఆదాయవృద్ధి కానవస్తుంది
Mar 28, 2026 - Apr 28, 2026
మీరు ఎంతో ఎత్తుకు ఎదగడానికి, వృత్తిలో రాణించడానికి ఈ కాలం యోగదాయకంగా ఉన్నది. వ్యాపార భాగస్వాములతోను, సహోద్యోగులతోను లాభసాటిగా ఉండే కాలం. జీవిత భాగస్వామితో అనురాగం సంతోషం కలుగుతుంది. వ్యాపార వాణిజ్యాలు మరియు విదేశీ ప్రయాణాల వలన లాభాలు కలగవచ్చును. ఆరోగ్య సంబంధమైన చికాకులు మీ మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తాయి. మీ క్రమశిక్షణ, స్వయం పర్యవేక్షణ, ఇంకా, మీ రోజువారీ దినచర్యలపై అదుపులు, బాగా ఉపయోగపడతాయి. జ్వరం, కీళ్ళనొప్పుల గురించి జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినే సూచనలున్నాయి.
Apr 28, 2026 - May 19, 2026
మీకు మిశ్రమ ఫలితాలు కలిగే కాలమిది. చిన్న చిన్న అనారొగ్యాలే కదా అని నిర్లక్ష్యం చేయకండి, ఏమంటే, అవే పెద్దవిగా మారవచ్చును. అటువంటి శ్రద్ధ చూపవలసిన అనారోగ్యాలు, అల్సర్, కీళ్ళ సంబంధమైన రుమాటిజం, వాంతులు, తల మరియు, కంటి సంబంధ సమస్యలు, కీళ్ళ జాయింట్ల వద్ద నొప్పి, లేదా, బరువైన లోహవస్తువు పడడంవలన వచిన బొప్పి(లంప్) మొదలైనవి ఉన్నాయి. కష్టతర పరిస్థితులు ఎదురైతే, బెంబేలు పడిపోకుండా, మరల అదృష్టం మరల మిమ్మల్నివరిస్తుందని ధీమాతో నిలబడండి. ప్రభుత్వంతోను, సీనియర్ అధికారులతోను వివాదాలు కలగవచ్చును. కనుక జాగ్రత్తగా ఉండండి. స్పెక్యులేషన్లకి, రిస్క్ లకి అనుకూలమైన సమయం కాదు.