బాగా సన్నిహిత బంధువు లేదా కుటుంబ సభ్యులొకరి మరణ వార్త వింటారు. మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి ఏమంటే, అనారోగ్యం వలన బాధలు కలగే అవకాశాలున్నాయి. సంపద నష్టం, ఆత్మ విశ్వాసం కోల్పోవడం, నిష్ఫలమైన ప్రయత్నాలు, మానసిక ఆందోళనలు అన్నీ కలగవచ్చును .ఇతరుల ఈర్ష్య మీకు సమస్యలకు కారణం కావచ్చును. దొంగతనం వలన కూడా ఆర్థిక నష్టం కలిగేను. అంతేకాదు, మీరు చెడు సావాసాలు, చెడు అలవాట్లకు కూడా లొంగవచ్చును.
Dec 20, 2023 - Feb 19, 2024
ఇంతకు ముందు లేని అధికారం మీ చేతికొస్తుంది. వ్యక్తిగతంగా మీకిష్టమైన వారు తమ ఇష్టపూర్తి కోసం, సౌకర్యాలకోసం, మీపైన ఆధారపడతారు. మీ మానసిక శక్తి చాలా గొప్పది. మరి ముఖ్యంగా మీజీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత తీయనై, బలపడుతుంది. సంతానయోగం కానవస్తున్నది. మీ క్రింద పనిచేసే వారు పూర్తి విధేయతతో మీ కు పనిచేస్తారు. మొత్తం మీద ఈ కాలం అనుకూలం. ఆహ్లాదకరం.
Feb 19, 2024 - Mar 08, 2024
మీరు ఏది చేపట్టినా విజయం సాధిస్తారు. మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. మీరు కష్టాలన్నిటినీ దాటెస్తారు. మీ శతృవులు ఓటమిని ఎదుర్కొంటారు. మీ కు ప్రమోషన్ రావచ్చును. గౌరవాన్ని, మంచి కీర్తిని పొందుతారు. వ్యాజ్యాలు గెలుస్తారు. మొత్తంమీద విజయవంతమైన కాలం. వాపులు, కంటిసంబంధ సమస్యలనుండి కాస్త జాగ్రత్త పడవలసిఉంది. తల్లికి లేదా అత్తవారి తరఫు బంధువులు ఎవరికేనా అనారోగ్యం కలగవచ్చును.
Mar 08, 2024 - Apr 08, 2024
కుటుంబంలో చక్కని సామరస్యత, అవగాహనలతో అనుకూల వాతావరణం కానవస్తున్నది. మీ జ్ఞానాన్ని పెంచుకుని, మీ సహోద్యోగులనుండి కొంత నేర్చుకోవడానికిమనుకూలసమయం. స్నేహితులతోను, విదేశీయులతోను, మంచి సంబంధాలు నెరిపితే ఫలవంతమౌతాయి. ఇది స్థలాలు పొందడానికి వేళ కావచ్చును. దానధర్మాలు చేయగలరు. మీ సంతానంకూడావిజయాలు సాధించి,మీకుఆనందాన్ని కలిగించగలరు. బహు చక్కనిజీవితం మీకోసం భవిష్యత్తులో ఎదురు చూస్తున్నది.
Apr 08, 2024 - Apr 29, 2024
కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగించవచ్చును. ప్రయాణాలు కలిసిరావు కనుక మానవలసింది. అనవసర ఖర్చులు అవుతాయి కనుక జాగ్రత్త గా ఉండాలి. స్నేహితులతోను, సహచరులతోను జాగ్రత్త, కొన్నిసార్లు, మీ న్యాయ నిర్ణయం,విచక్షణ సరిగా ఉండకపోవచ్చును. అగ్ని వలన కానీ, స్త్రీల వలనగానీ గాయపడవచ్చును. హృదయ సంబంధ సమస్యలు తలెత్తవచ్చును కనుక, ఆరోగ్య విషయమై జాగ్రత్త చూపాలి.
Apr 29, 2024 - Jun 23, 2024
ఇది మీకు మిశ్రమ ఫలితాలనిచ్చే కాలం. మీ వృత్తి రంగంలో మీ శాయ శక్తులా పనిచేస్తారు. మీ స్థిర నిశ్చయం అనేది ఫలితం పట్ల సవ్యమైన ఇన్ టాక్ట్ ని కలిగి ఉండాలి. అలాగే మీరు ఒకసారి నిశ్చయించుకున్నాక దానిని వదిలి పెట్టకూడదు. మీ వ్యక్తిగత ప్రవర్తనలో మీరు అహంకారపూరితమయ్యే సూచన కనిపిస్తున్నది. ఇది మిమ్మల్ని ప్రజాదరణకు , దూరం చేసి చెడ్డపేరుని తేవచ్చును. అందుకే వ్యక్తులతో మసిలేటప్పుడు, మరింత సరళతను , (ఫ్లెక్జిబిలిటీని), సౌమ్యతను అలవరచుకోండి. మీరు మీ సోదరీ సోదరులను సమర్థిస్తారు. మీ బంధువులకు సమస్యలు కలుగుతాయి.
Jun 23, 2024 - Aug 11, 2024
వృత్తిపరంగా, మరియు వ్యక్తిగతంగా కూడా, ఈ సంవత్సరం భాగస్వామ్యం కలిసివస్తుంది. ఏది ఏలాగైనా, మీరు చాలాకాలంగా ఎదురు చూస్తున్నట్టిజీవిత గమనాన్నే మార్చేసే ఉక్కిరిబిక్కిరి చేసే సంఘటన జరగవచ్చును. మీ బాధ్యతలను చక్కగా నిర్వహించి. మీ తల్లితండ్రులతోను, మీపిల్లలతోను, బంధువులతోను అదే దగ్గరితనాన్ని కొనసాగిస్తారు. కబుర్లు అందచేయడం, సంప్రదింపులు ఫలించుతాయి, మీకు క్రొత్త అవకాశాలుచేకూరుస్తాయి. వ్యాపారరీత్యా/ ఉద్యోగపరంగా వగైరా తరచు ప్రయాణాలు ఉంటాయి. మీరువిలువైన లోహాలు, రత్నాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
Aug 11, 2024 - Oct 07, 2024
అసలు జీవితం(కెరియర్)లోనే అత్యంత కష్ట కాలంతో ఈ దశ మొదలవుతుంది. కార్యక్రమానికి(చర్యకి) అవకాశాలలో మునిగి తేలుతారు. మధ్యలో సంబంధంలేని పనులలో అభివృద్ధి కనిపించినా కెరియర్ కి అవి పనికిరావు. క్రొత్త పెట్టుబడులు, లేదా రిస్క్ గల వ్యవహారాలు మానాలి. ఎందుకంటే నష్టాల కాలమిది. కనుక అటువంటి వాటిని, తప్పించుకోవాలి. మీ పై అధికారులతో కోపావేశాలను ప్రదర్శించడం మానాలి. ఇతరుల నుండి సహాయం పొందేకంటె మీ స్వంత నైపుణ్యం శక్తియుక్తులు వాడుకోవడం మంచిది. దొంగతనం, లేదా ఇతర కారణాలవలన ధననష్టం కూడా జరగవచ్చును. మీగురించి, మీ కుటుంబ సభ్యులగురించి తగిన శ్రద్ధ తీసుకొండి. ఒకరి మరణ వార్తను కూడా వినవలసి రావచ్చును.
Oct 07, 2024 - Nov 28, 2024
ఆరోగ్య సమస్యలతో బాధ పడతారు. మీ వద్ద డబ్బును నిలవ ఉంచుకోవడం కష్టమే అవుతుంది. ఏమంటే, మీకు విలాసాలకు, సుఖ సంతోషాలకోసం డబ్బును ఖర్చు పెట్టేసే గుణం ఉన్నది. ఈ సమయంలో మీరు స్పెక్యులేషన్లకు, విరివిగా ఖర్చుపెట్టడం తగదు. చిన్నపాటి తగాదాలు, అపార్థాలు, ఇంకా వాదనలు మీ కుటుంబ వాతావరణాన్ని, దాని ప్రశాంతతను దెబ్బతీస్తాయి. మీరంటే అసూయ ఉన్నవారు, సమస్యలను సృష్టిస్తారు. దాంతో, కుటుంబంలో నీలాపనిందలను, అసంతోషాన్ని ఎదుర్కొనాల్సి వస్తుంది. అటువంటివారిపట్ల జాగ్రత్త వహించండి. స్త్రీలవలన సమస్యలు రావచ్చును, హెచ్చరికగా ఉండడం అవసరం.
Nov 28, 2024 - Dec 19, 2024
మీరు చక్కని ఫలితాలకోసం స్థిరంగా నిరంతరంగా పనిచేస్తూ పోవాలి. చురుకుగా డైనమిజం మరియు ఎదుగుదల ఉంటాయి. . మీ సహోద్యోగులతోను, పై అధికారులతోను చక్కటి సంబంధాలను, ర్యాపోర్ట్ ని నెరపగలరు. మీకు, ఆదాయ వనరులు బాగున్నాయి. మీ కుటుంబంతోజీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. ఆధ్యాత్మికంగా మీరు చాలా మంచిస్థితిలో ఉంటారు. మీరు పదోన్నతిని కోరుకుంటే కనుక , మీకు తప్పక లభిస్తుంది. మీ స్నేహ బృందం ఇంకా విస్తరిస్తుంది. ఆకస్మిక ప్రయాణం, అదృష్టాన్ని తెస్తుంది. ఈ దశలో అభివృద్దిని పొంది, దానధర్మాలు చేస్తారు.