బాగా సన్నిహిత బంధువు లేదా కుటుంబ సభ్యులొకరి మరణ వార్త వింటారు. మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి ఏమంటే, అనారోగ్యం వలన బాధలు కలగే అవకాశాలున్నాయి. సంపద నష్టం, ఆత్మ విశ్వాసం కోల్పోవడం, నిష్ఫలమైన ప్రయత్నాలు, మానసిక ఆందోళనలు అన్నీ కలగవచ్చును .ఇతరుల ఈర్ష్య మీకు సమస్యలకు కారణం కావచ్చును. దొంగతనం వలన కూడా ఆర్థిక నష్టం కలిగేను. అంతేకాదు, మీరు చెడు సావాసాలు, చెడు అలవాట్లకు కూడా లొంగవచ్చును.
Sep 19, 2025 - Oct 08, 2025
మీరు ఏది చేపట్టినా విజయం సాధిస్తారు. మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. మీరు కష్టాలన్నిటినీ దాటెస్తారు. మీ శతృవులు ఓటమిని ఎదుర్కొంటారు. మీ కు ప్రమోషన్ రావచ్చును. గౌరవాన్ని, మంచి కీర్తిని పొందుతారు. వ్యాజ్యాలు గెలుస్తారు. మొత్తంమీద విజయవంతమైన కాలం. వాపులు, కంటిసంబంధ సమస్యలనుండి కాస్త జాగ్రత్త పడవలసిఉంది. తల్లికి లేదా అత్తవారి తరఫు బంధువులు ఎవరికేనా అనారోగ్యం కలగవచ్చును.
Oct 08, 2025 - Nov 07, 2025
మీ ప్రణాళికలను అమలు పరచడానికి ఇది మీకు అనుకూలమైన కాలం. తారాబలం మీకు సానుకూలంగా ఉన్నాయి కనుక మైథునానందం మరియు వివాహ జీవితపు ఆనందాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక ద్వారాలు తెరుచుకుంటాయి. కాకపోతే, తత్సంబంధ అవకాశాలకు కొంత సంసిద్ధత అవసరం. బిడ్డను కోరుకుంటే, సుఖ ప్రసవం కూడా దారిలో ఉన్నట్లే. మీరు రాసినదానికి ప్రశంసలు లభిస్తాయి. విద్యార్థులకు తమ చదువులో సత్తా ప్రదర్శించగల కాలం, వారు బాగా రాణిస్తారు. ఈ కాలం లో, సంతానయోగం ఉన్నది, అందునా ఆడశిశువు కు అవకాశం ఎక్కువగా ఉంది.
Nov 07, 2025 - Nov 28, 2025
మీరు తప్పించుకోవలసిన ఏకైక ప్రమాదం మీ అతిశయం, అహంకారం. ఇంటిఖర్చుగురించి, లేదా ఆరోగ్య విషయమై, కుటుంబసభ్యులకోసం చేయవలసి రావచ్చును. కుటుంబ సంబంధాలపట్ల మరింత బాధ్యతాయుతమైన దృక్పథాన్ని పెంచుకొండి. ఇతరులు మీ భావోద్వేగాల బలహీనతను సాకుగా , పైచేయిని సాధించి ,మిమ్మల్ని తరువాత చిందరవందర అయేలా చేసే అవకాశమున్నది. మీ జీవిత భాగస్వామి వలన లేదా, ప్రేమ జీవితం కారణంగా, కొంత నిరాశకలగ వచ్చును. ప్రయాణాలు నిష్పలం మరియు నష్టాలకు కూడా దారి తీయవచ్చును.
Nov 28, 2025 - Jan 22, 2026
ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉండి పైకి ఎదుగుతారు. మీరు ఈ కాలంలో, దాంపత్య సౌఖ్యాన్ని పొందుతారు. పరపతిగల వారితో మీ పరిచయాలు తప్పక ఇంకా పెరుగుతాయి. మీ వైరివర్గం, మీవైపుకు కనీసం ఎదురుపడడానికి కూడా సాహసంచేయలేరు. సుదీర్ఘ ప్రయాణం ప్రయోజనకరం కాబోతున్నది. ప్రేమ, రొమాన్స్ వరంగా మారనున్నాయై. మీరొక నాయకునివలె, మీ శతృవులను గెలుస్తారు. చిన్నపాటి అనారోగ్యం కాన వస్తుంది. పిల్లలతో అనుబంధాలు బాగులేకపోయినా మిగతా కుటుంబ సంబంధాలు సంతృప్తికరంగా ఉంటాయి.
Jan 22, 2026 - Mar 12, 2026
మీకు సహాయం అందించడంలో ఇతరులనుండి గట్టి ప్రభావం ఉంటుంది. ఇది మీ భౌతిక అవసరాలను నెరవేర్చడము, అలాగే, మీకు మరింత వ్యక్తిగత రక్షణ కల్పించడం జరుగుతుంది. డబ్బు ఖచ్చితంగా మీకు చేకూరుతుంది, మీ వ్యక్తిగత విశ్వాసాలను, కలలను, మరియు తత్వ విచారాలను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వం, మరియు ఉన్నత అధికారులచే గుర్తింపు పొందుతారు. మీరు స్నేహశీలత కలిగి ఉంటారు,అలాగే, వివిధ సామాజిక పరిస్థితులలో, అవసరమయే సంఘంలోని వివిధ వ్యక్తులతో పరస్పర సద్భావనలు చూపి గ్రూప్ డైనమిక్స్ చూపడాన్ని చాలా సౌకర్యవంతమైన ఎంజాయ్ మెంట్ గా తీసుకుంటారు; కాకపోతే అనారోగ్య సమస్య మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది. బాహ్యంగా కంటే, అంతర్గత మార్పు, పరివర్తన ఎంతో అవసరం.
Mar 12, 2026 - May 09, 2026
ఇది మీకు అంత సంతృప్తికరమైన కాలం కాదు. ఆర్థికంగా మీకు నష్టాలు కలగవచ్చును. వ్యాజ్యాలవలన, వివాదాలవలన, డబ్బు నష్టపోయే అవకాశమున్నది. వైఫల్యాలు మిమ్మల్నినిరాశకు గురి చేస్తాయి. పని వత్తిడికి మీరు అలసిపోతారు. కుటుంబ విషయాలు కూడా ఆందోళన కారణం కావచ్చును. క్రొత్త వ్యాపార రీత్యా రిస్క్ గల వ్యవహారాలు మానండి.. ఎందుకంటే నష్టాల కాలమిది. సమయం మీకు అనుకూలంగా లేదు. శతృవులు మీ ప్రతిష్టదెబ్బ తీయ చూస్తారు. ధననష్టం కూడా సహజం
May 09, 2026 - Jun 29, 2026
ఆరోగ్య సమస్యలతో బాధ పడతారు. మీ వద్ద డబ్బును నిలవ ఉంచుకోవడం కష్టమే అవుతుంది. ఏమంటే, మీకు విలాసాలకు, సుఖ సంతోషాలకోసం డబ్బును ఖర్చు పెట్టేసే గుణం ఉన్నది. ఈ సమయంలో మీరు స్పెక్యులేషన్లకు, విరివిగా ఖర్చుపెట్టడం తగదు. చిన్నపాటి తగాదాలు, అపార్థాలు, ఇంకా వాదనలు మీ కుటుంబ వాతావరణాన్ని, దాని ప్రశాంతతను దెబ్బతీస్తాయి. మీరంటే అసూయ ఉన్నవారు, సమస్యలను సృష్టిస్తారు. దాంతో, కుటుంబంలో నీలాపనిందలను, అసంతోషాన్ని ఎదుర్కొనాల్సి వస్తుంది. అటువంటివారిపట్ల జాగ్రత్త వహించండి. స్త్రీలవలన సమస్యలు రావచ్చును, హెచ్చరికగా ఉండడం అవసరం.
Jun 29, 2026 - Jul 21, 2026
వృత్తిలోను, వ్యక్తిగతంగాను ఆటంకాలు ఎదురౌతాయి. కష్టకాలాన్ని తెలివితోను, నిదానంగాను ఎదుర్కొనండి. ఏమంటే, ఈ సమయంలో కఠినంగా ర్యాష్ గా ఉండడం వలన ఏమీ సహాయం జరగదు. ప్రయాణం అనుకూలించదు. కనుక మానడానికి ప్రయత్నిఛండి. మీ కుటుంబం వైపునుండి పూర్తి సపోర్ట్, ఉండదు. సమర్థించరు. సంతాన సమస్యలు ఉంటాయి. మీ శతృవులు మీకు హాని కలిగించగల ఏరాయిని విసరకుండా వదలరు. మీరు ధైర్యంగా స్థైర్యంగా ఉండడం, మీ సవ్యమైన నిర్ణయాలకు కట్టుబడి ఉండడం మంచిది. పొట్టకు సంబంధించి, అసౌకర్యం కొంత ఆందోళనకు దారితీస్తుంది.
Jul 21, 2026 - Sep 19, 2026
ఏదో విధంగా కాలం, అదృష్టం మీ పై మీ చర్యలపై దృష్టి ప్రసరించుతాయి. మీరు చేసిన పనులకు, శ్రమకు కితాబునిచ్చుకుని, ఇతరులు దానిని గుర్తించి, మీవైపు తలెత్తిచూసేటందుకు ఇది తగిన వేళ. మీ తల్లితండ్రులతోను, మీపిల్లలతోను, బంధువులతోను అదే దగ్గరితనాన్ని కొనసాగిస్తారు. కబుర్లు అందచేయడం, సంప్రదింపులు ఫలించుతాయి, మీకు క్రొత్త అవకాశాలుచేకూరుస్తాయి. వ్యాపారరీత్యా/ ఉద్యోగపరంగా వగైరా తరచు ప్రయాణాలు ఉంటాయి. మీరువిలువైన లోహాలు, రత్నాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.