డబ్బు విషయమై, హోదా కి సంబంధిచి, కొంత ఎగుడు దిగుళ్ళు వచ్చే సూచన కనిపిస్తున్నది. ఆర్థికంగాను, లేదా ఆస్తి నష్టాలు ఉండవచ్చును. డబ్బు విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. మీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే, సన్నిహిత సహచరులతో మరియు బంధువులతో వివాదాలు జరిగితే ఇబ్బందికరం (ఎంబరాసింగ్) కావచ్చును. మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి ఏమంటే, అనారోగ్యం కలగ వచ్చును.
Feb 21, 2026 - Mar 11, 2026
ఇది మీకు, స్వయం వ్యక్తీకరణకు మీ కల్పనా నైపుణ్యాలకు పనిచెప్పి వృద్ధిపొందేకాలం. మీ పనిసంబంధ ప్రదేశాలలో మంచి మార్పును అనుకోనిరీతిలో వస్తుందని ఎదురు చూడవచ్చును. మరియు, వృత్తి సంబంధంగా చేసే పనులు మిమ్మల్ని, ప్రత్యేకంగా నిలబెడతాయి. పై అధికార్లనుండి, సీనియర్ల నుండి అనుకూలత లభిస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలోను, వృత్తిపరంగానూ, అనుకూల మార్పులు జరుగుతాయి. తల్లితంద్రుల తరఫున ఆస్తులు సమకూడవచ్చును. ఈ కాలంలో మీరు తప్పక విజయం సాధిస్తారు , ఇంకా మీ కల లు నెరవేరడం చూస్తారు.
Mar 11, 2026 - Apr 11, 2026
ఈ కాలం మీకు కలిసి వస్తుంది. ఆర్థికంగా స్థిరత్వాన్ని కల్పిస్తుంది. మీ ఆశలకు,కలలనుఅనుసరించి పనిచేస్తూ వాటికొక రూపుకల్పించవచ్చును. ప్రేమకు రొమాన్స్ కి అనుకూలమైన కాలం. మీరు క్రొత్త పరిచయాలు పొందుతారు. అవి ఎంతో ఫలవంతమూ, సహాయకరము అవుతాయి.చదువరులచే మీరు ప్రశంసలు,గౌరవము పొందుతారు. దాంతో జీవితభాగస్వామితో కలిసిమరింత ప్రతిష్ఠను పొందుతారు. దూర ప్రయాణ సూచన కూడా ఉన్నది.
Apr 11, 2026 - May 02, 2026
ఇది మీకు కొంతవరకు మంచి భరోసా, దిలాసా ఇవ్వగల కాలం. కనుక, విజయాన్ని కోరి, కోరిన పన్ని చేపట్టవచ్చును. మరీ పట్టింపుగా లేకున్న కూడా క్రొత్త అవకాశాలు వాటంతట అవే వస్తాయి. పని చేసే చోట, ఇంటిలోను జరిగే మార్పులు అనుకూలంగా అదృష్టాన్ని తెచ్చేవిగా ,ఉంటాయి. అభివృద్ధి దిశగా నిర్ణయాత్మక అడుగులు వేస్తారు. అదుపు చేయదగినట్లుగా మీఖర్చులు పెరుగుతాయి. మీకు గమనించదగిన విధంగా ఆత్మ విశ్వాసం, శక్తి కలుగుతాయి.
May 02, 2026 - Jun 26, 2026
ఈ సమయం మీకు అన్నివిధాలా (నిలువుగా) ఎదగడానికి కెరియర్ లో ఎదగడానికి ఒక చక్కని సోపానం లేదా మెట్టు గా అద్భుతంగా పనికివస్తుంది. వ్యాపార భాగస్వాములతోను, సహోద్యోగులతోను లాభసాటిగా ఉండే కాలం. అన్యాయంగా ఆర్జించడానికి మీరు మొగ్గుచూపవచ్చును. అప్పుడు మీ క్రమశిక్షణ, స్వయం పర్యవేక్షణ, ఇంకా, మీ రోజువారీ దినచర్యలపై అదుపులు, బాగా ఉపయోగపడతాయి. ఆరోగ్య సంబంధమైన చికాకులు మీ మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తాయి
Jun 26, 2026 - Aug 13, 2026
మీకుగల సంగీత నైపుణ్యాలను పంచుకోవడాన్ని మీరు ఆనందపడతారు. అలాగే, సరిక్రొత్త సంగీత సంబంధ కళాఖండాన్ని రూపొందించే అవకాశం కూడా లేకపోలేదు. మీ పని సంబంధమైన లేదా సమాజ పరమైన ఉన్నతమైన నియమాలు, విలువలను తెలియపరచడంలో ఎంతగానో సఫలమౌతారు. మీ పథకాలకు కార్యరూపం ఎప్పుడైతే తీసుకువస్తారో అప్పుడు, ఆదాయం వస్తుందని ఎదురు చూడవచ్చును. డబ్బు తప్పక మీ చేతికందుతుంది. మీ వ్యక్తిగత విశ్వాసాలు, స్వప్నాలు, తత్వవిచారాలను తప్పక ప్రభావితం చేస్తుంది. మీ శత్రువులు మిమ్మల్ని నిలువరించలేరు. మొత్తంమీద, ఈ కాలం మీకు మంచి సంతోషదాయకంఅనడం నిశ్చయం. మీ కుటుంబసభ్యులకు మరొకరు అదనంగా ఒకరు జతపడతారు.
Aug 13, 2026 - Oct 10, 2026
భౌతికంగా ను మానసికంగాను కూడా మీకీ దశ ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ బంధువులకు కూడా మంచి కాలం. మీ జీవితకాలంలో గల కెరియర్ కోసం చేసే ప్రయత్నాలను కొనసాగించండి. ఏమంటే, ఇది కలిసివచ్చే కాలం. వస్తు లాభం కూడా సూచితం. ఈ సమయంలో భూమి, యంత్ర పరికరాల కొనుగోలు కూడా జరుగుతుంది. వ్యాపారం లోను, వాణిజ్యంలోను లాభాలు నిశ్చయం. మీ శతృవులు మీముందు, తోక ఝాడించలేరు, మీకు అపకారం చేయలేరు. ప్రేమవిషయాలలో ఇది మీకు అనుకూలమైన కాలం. మీ కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ సహకారం అందుతుంది.
Oct 10, 2026 - Dec 01, 2026
మీరు ఒక అనంతమైన ఆశావాది. మరి అలాగే, ఈ ఏడాది మీకు ఎదురుకానున్న సంఘటనలు కూడా ఈ మీ స్వభావాన్ని మరింతగా బలపరుస్తాయి. మీ కాలాన్ని , పెట్టుబడిని మీ రాశిఫలాలకు అనుగుణంగా చూసుకుని తెలివైన పెట్టుబడి కనుక చేస్తే, మీ దశ మరింతగా మెరుగౌతుంది. మీకు ప్రియమైన వారినుండి, సహచరులనుండి, అన్నివిధాలా సహకారము సంతోషము లభించుతాయి. మీశత్రువులపై పైచేయి, మీదవుతుంది. ఇంకా వివాహాది శుభకార్యాలు, లేదా రొమాంటిక్ పరిస్థితులు , సంబరాలు కూడా ఎదురురావచ్చును. కుటుంబ వాతావరణం చాలా సంతృప్తికరంగా ఉంటుంది.
Dec 01, 2026 - Dec 22, 2026
ప్రయాణ అభిలాష ఉండడం వలన కొంత వరకు మీ ప్రయాణపు సరదా వలన కలిగిన అలసట ఉంటుంది. మీకు ఒకమూల ఉండిపోవడం ఇష్టం ఉండదు. దాంతో అలసట తప్పదు. మీ ఆలోచనల్ మతంవైపుకు మరలడంతో పుణ్య క్షేత్ర దర్శనం చేయగలరు. ఈ దశలో కెరీయర్ గురించి మీకు మార్పు(వొలాటిలిటీ,) , వత్తిడిలతో ఉంటుంది. మీ స్వంత మనుషులతోను, బంధువర్గంతోను, అనుబంధాలు కొంచెం పాడవుతాయి. రోజువారీ పనులు బాధ్యతలగురించి సరైన శ్రద్ధపెట్టండి. మీ కుటుంబ సభ్యుల అంచనాల మేరకు మీరు సంతృప్తి పరచలేరు. ఏ విధమైన వ్యాపార లావాదేవీల లోను మీరి చేయిపెట్టవద్దు. మీ అమ్మగారికి ఇది పరీక్షా సమయం.
Dec 22, 2026 - Feb 21, 2027
మీకు ఎదురయ్యే సవాళ్ల ను అధిగమించడానికి క్రొత్త ఆలోచనలు వస్తాయి. మీకు సంబంధించిన ఒప్పందాలు(డీలింగ్) లు, లావాదేవీలు ఎక్కువ శ్రమ లేకుండానే, సాఫీగా సాగిపోతాయి. ఇది మీ పోటీదారులనుఅవలీలగా గెలిచినందువలన సాధ్యపడింది. ఆదాయం ఒకటి కంటె ఎక్కువ మార్గాలలో లభిస్తుంది. మీ స్నేహితులు, కుటుంబం, మీ వ్యక్తిగత జీవితాన్ని మరింత సుఖవంతం ఫలవంతం చేస్తారు. మీ క్లైంట్లు యొక్క సహచరులు మరియు సంబంధిత వ్యక్తులు తప్పకుండా కాలానుగతంగా మెరుగు అవుతారు. మీరు కొన్ని విలాస వస్తువులను కొనుగోలుచేస్తారు. మొత్తం మీద ఇది మీకు కలిసి వచ్చే కాలం.