ఈ రాశి వారిని విరోధులు మరియు వ్యతిరేకులు ఎదురుపడడానికి కూడా సాహసించరు. న్యాయపరమైన వివాదాలు మీకు అనుకూలంగా ఉంటాయి. పేరు, ప్రతిష్ఠ ధనలాభం ఇంకా ఆర్థికసంబంధ వ్యవహారాలలో విజయాలు మీ రు అనుభవిస్తారు. బంధువులు, సోదరుల నుండి మంచి సహకారం అందే సూచనలున్నాయి. మతపరంగా పవిత్ర స్థల దర్శనం చేస్తుండడం, ప్రజల సహాయం మీకు అందడం జరుగుతుంది. మీప్రయత్నాలు ఫలిస్తాయి, శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు.
May 25, 2026 - Jun 25, 2026
అనవసరమైన ఖర్చులకు అవకాశముంది. ప్రేమ, రొమాన్స్, సాధారణజీవితం అంతగా ప్రోత్సాహకరంగా లేదు. జీవితంలో ఎదురయే వివిధ పరిస్థితులకి ఎంతో సంయమనంతోను, ప్రశాంతతతోను ఉండమని సూచన. ఊహాలోకం(గెస్వర్క్) పనిచేయదు. కనుక అటువంటివాటిలో తలదూర్చవద్దు. కన్నులు, కఫ సంబంధ సమస్యలు మరియు స్ప్లీన్(కాలేయం) సంబంధ సమస్యలుకలగవచ్చును. అసత్యాలు పలికి, మీకు మీరే సమస్యలను సృష్టించుకుంటారు.
Jun 25, 2026 - Jul 16, 2026
మీరు తప్పించుకోవలసిన ఏకైక ప్రమాదం మీ అతిశయం, అహంకారం. ఇంటిఖర్చుగురించి, లేదా ఆరోగ్య విషయమై, కుటుంబసభ్యులకోసం చేయవలసి రావచ్చును. కుటుంబ సంబంధాలపట్ల మరింత బాధ్యతాయుతమైన దృక్పథాన్ని పెంచుకొండి. ఇతరులు మీ భావోద్వేగాల బలహీనతను సాకుగా , పైచేయిని సాధించి ,మిమ్మల్ని తరువాత చిందరవందర అయేలా చేసే అవకాశమున్నది. మీ జీవిత భాగస్వామి వలన లేదా, ప్రేమ జీవితం కారణంగా, కొంత నిరాశకలగ వచ్చును. ప్రయాణాలు నిష్పలం మరియు నష్టాలకు కూడా దారి తీయవచ్చును.
Jul 16, 2026 - Sep 09, 2026
ఇది మీకు మంచి కాలం కాదు. మీ శతృవులు మీ శతృవులు మీ ప్రతిష్టదెబ్బ తీయ చూస్తారు. ఆకస్మిక ధన నష్టం కలగవచ్చును. మీఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆహారం విషతుల్యమవడంతో, ( ఫుడ్ పాయిజనింగ్) కడుపునొప్పులకి దారితీస్తుంది. కాలం మీకు అనుకూలించదు కనుక వ్యాపారాలలో మీరు రిస్క్ తీసుకునే ప్రయత్నం చెయ్యవద్దు. మీ బంధు మిత్రులతో చిన్న విషయాల్కే వివాదాలు పెరగవచ్చును. పెద్ద/ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. లేకుంటే కష్టాలలో పడతారు. అంతే కాదు మీరు కృతజ్ఞత లేని పనిని చేయవలసి రావచ్చును.
Sep 09, 2026 - Oct 27, 2026
ఈ దశ మీకు, అన్ని పెత్తనాలను తప్పనిసరిగా తేనున్నది. ఒక విదేశీ పరిచయం, లేదా సంబంధం, మీకు ఉపయోగపడనున్నది. వారు, మీరు ఎంతోకాలంగా పొందడానికై తపన పడినట్టి స్థాయి, అధికారం మరియు అనుకోని విధంగా చక్కని ఆదాయం కలగడానికి మూలకారణం అవుతారు. మీరు స్వ శక్తిని నమ్మడం, అదే భావనని కొనసాగించండి. ఈ ఏడాది, మిమ్మల్ని సంపూర్ణంగా ఒక క్రొత్త స్థాయిని అందుకునేలా చేస్తుంది. కుటుంబ వాతావరణం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూర ప్రయాణం ప్రయోజనకరం కాగలదు. మతంపట్ల మీరు ఇష్టాన్ని చూపడం , తత్సంబంధ దానాది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.
Oct 27, 2026 - Dec 24, 2026
మీరు వెదజల్లే అమితమైన శక్తి (ఎనర్జీ) మీజీవితంలో మిమ్మల్ని సమర్థించే ఎంతో మందిని మీవైపుకు ఆకర్షిస్తుంది. మీ శతృవులు మిమ్మల్ని తలెత్తి చూడడానికి సాహసించరు. ఆర్థికంగా ఇది మీకు అత్యుత్తమ కాలం. మీ వ్యక్తిగతంగా, మీ స్నేహితులతో ఉన్నపుడు ఇంకా కుటుంబం తోను మంచిగా ఉండడానికి క్రొత్తదారులు నేర్చుకుంటున్నారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచుకుంటున్నకొద్దీ, మీ వరకు మీరు ఆత్మ శక్తిని పెంచుకుంటే మీ అవసరాలకు నిలబడగలుగుతారు. మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీ పని పరిస్థితులు తప్పనిసరిగా మెరుగవుతాయి. మీ సహోద్యోగులు అధీన పనివారు మీకు అన్నివిధాలా బాగా సహకరిస్తారు. మీరు కొంత భూమిని, లేదా యంత్రాలను కొనుగోలు చేస్తారు. మీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ అవసరం.
Dec 24, 2026 - Feb 14, 2027
ఏది ఏమైనా మీరు మరీఅంతగా అదృష్టంకోసం అర్రులు చాచడం మానాలి. మీ డబ్బు వివిధ రీతులలో చిక్కుకుపోవడం వలన మీకు ఆర్థికంగా గొప్ప ఇబ్బంది కలగవచ్చును. ఆరోగ్య సమస్యకూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చును. ప్రత్యేకించి మీరు దగ్గు, కఫ సంబంధ సమస్యలు, కంటి కలకలు, వైరల్ జ్వరం సోక వచ్చును. బంధువులు, స్నేహితులు, లేదా సహచరులతో వ్యవహరించేటప్పుడు, కాస్త జాగ్రత్త వహించండి. ప్రయాణాలు ఫలవంతం కాకపోవచ్చును. కనుక వీలైనంతవరకు తప్పించుకొండి. చిన్న విషయాలు కూడా, గొడవలకి దారితీయవచ్చును. అజాగ్రత్త వలనలేదా, నిర్లక్ష్యం కారణంగా ఈ సమయం మీకు, సమస్యలను చీకాకు పుట్టించే పరిస్థితులను తీసుకురావచ్చును. ప్రయాణాలు మానాలి. .
Feb 14, 2027 - Mar 07, 2027
మీ పై అధికారులనుండి లేదా బాధ్యతాయుతమైన లేదా పరపతిగల వ్యక్తుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. వృత్తిపరంగా మీరు రాణిస్తారు. కుటుంబం నుండి కూడా సహకారం అందుతుండడం కనబడుతుంది. దూరప్రాంతాలలోగలవారు, లేదా విదేశీ వ్యక్తులద్వారా సహకారం అందుతుంది. అదాటుగా చేసిన వాటికి కూడా,మీకిష్టమై చేస్తే,ఇది మంచియోగదాయకమైన కాలం కాగలదు. మీకు సమాజంలో మర్యాద మరింత గౌరవం పెరుగుతుంది. క్రొత్త ఇల్లు కడతారు, అన్నివిధాల సంతోషాలను పొందుతారు.
Mar 07, 2027 - May 07, 2027
పవిత్ర యాత్ర చేసే అవకాశముంది. మీకు రొమాంటిక్ ఆకర్షణీయమైన దృక్పథం ఉన్నది. ఇదిమీకు సానుకూల సంబంధాలను ఇంతవరకు లేనివారితో కూడా, పరిచయాలు పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ ఇష్టాలు కొంతవరకు నెరవేరుతాయి. అవి మీరు పనిచేసే నిచ్చెన క్రమం గల ఉన్నత పదవికి చెందిన ప్రమోషన్లు కావచ్చు, వ్యాపార లాభాలు కావచ్చును, క్రొత్తబండి లేదా క్రొత్త భూమి సాధించగల వీలుంది. మొత్తంమీద మీకిది శుభ సమయం.
May 07, 2027 - May 25, 2027
అనుకోని సమస్యలు తలెత్తవచ్చును. బంధువులతో హార్థిక సంబంధాలు నెరపడం మంచిది. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. దీర్ఘ కాల అనారోగ్యం కలగవచ్చును. జీవిత భాగస్వామి మరియు సంతానం యొక్క ఆరోగ్యం కూడా కనిపెట్టుకొని ఉండాలి. చాటుమాటు వ్యవహారాలు చేయరాదు. వ్యాపార విషయాలు కూడా నిజానిజాలు తెలుసుకొనే చేపట్టాలి. కురుపులు లేచే అవకాశమున్నది.