ఈ వ్యక్తి, అలవికాని లాభాలు, సంపద మొదటినుండి పొందుతారు. అది లాటరీ , స్పెక్యులేషన్ షేర్లు మొదలైనవి ఏమార్గమైనా కావచ్చును. స్నేహితులు, శ్రేయోభిలాషులు అంతా మీ వ్యవహారాలలో మిమ్మల్ని సమర్థించి, మీకు సహకరించవచ్చును .మీరు వ్యాపార వ్యవహారాల(బిజినెస్ డీలింగ్ ల)ద్వారా చెప్పుకోదగినంత సంపాదిస్తారు. మంచి స్థానం, హోదా పొందుతారు. మీరు చక్కగా గౌరవం పొందుతారు మరియు మృష్టాన్న భోజన సౌఖ్యం( రుచికరమైన భోజనం) ఆనందం కలుగుతుంది.
May 17, 2025 - Jun 08, 2025
ఇది మీకు కొంతవరకు మంచి భరోసా, దిలాసా ఇవ్వగల కాలం. కనుక, విజయాన్ని కోరి, కోరిన పన్ని చేపట్టవచ్చును. మరీ పట్టింపుగా లేకున్న కూడా క్రొత్త అవకాశాలు వాటంతట అవే వస్తాయి. పని చేసే చోట, ఇంటిలోను జరిగే మార్పులు అనుకూలంగా అదృష్టాన్ని తెచ్చేవిగా ,ఉంటాయి. అభివృద్ధి దిశగా నిర్ణయాత్మక అడుగులు వేస్తారు. అదుపు చేయదగినట్లుగా మీఖర్చులు పెరుగుతాయి. మీకు గమనించదగిన విధంగా ఆత్మ విశ్వాసం, శక్తి కలుగుతాయి.
Jun 08, 2025 - Aug 01, 2025
ఇది మీకు మంచి కాలం కాదు. మీ శతృవులు మీ శతృవులు మీ ప్రతిష్టదెబ్బ తీయ చూస్తారు. ఆకస్మిక ధన నష్టం కలగవచ్చును. మీఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆహారం విషతుల్యమవడంతో, ( ఫుడ్ పాయిజనింగ్) కడుపునొప్పులకి దారితీస్తుంది. కాలం మీకు అనుకూలించదు కనుక వ్యాపారాలలో మీరు రిస్క్ తీసుకునే ప్రయత్నం చెయ్యవద్దు. మీ బంధు మిత్రులతో చిన్న విషయాల్కే వివాదాలు పెరగవచ్చును. పెద్ద/ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. లేకుంటే కష్టాలలో పడతారు. అంతే కాదు మీరు కృతజ్ఞత లేని పనిని చేయవలసి రావచ్చును.
Aug 01, 2025 - Sep 19, 2025
మీగురించి తగిన జాగ్రత్త తీసుకొండి. మితిమీరిన బాధ్యతలను నెత్తికెత్తుకోవద్దు. అలా అయితే చాలాకాలం పాటు, మీజీవితాన్ని సవ్యంగా గడపగలుగుతారు. కాకపోతే, కొన్ని నిరాశలు ఎదురుకావచ్చును. మీ ధైర్యం అంకితభావన మీ సుగుణాలు. ఇవి కొంతమందిని కించపడేలా చేయవచ్చు. పెద్ద మొత్తంపెట్టుబడులకు పోవద్దు. ఏమంటే, మీరు అనుకున్నట్లుగా పరిస్థితులు అనుకూలించక పోవచ్చును. మీ స్నేహితులు, సహచరులనుండి, అనుకున్నట్లుగా సరైన సహకారం అందకపోవచ్చును. కుటుంబ సభ్యుల దృక్పథం మీకు భిన్నంగా ఉండవచ్చును. ఆరోగ్యం కాస్త చికాకు పరచవచ్చును. తల త్రిప్పటం, జ్వరం దాడులు, చెవి ఇన్ఫెక్షన్ మరియు వాంతులు కలగవచ్చును.
Sep 19, 2025 - Nov 16, 2025
ఉద్యోగ అంశాలు చాలవరకు ఆశించినకంటె తక్కువగా ఉంటాయి. మొత్తంమీద అంత సంతృప్తికరంగా ఉండదు. పనిచేసే చోట చీకాకు ఒత్తిడి ఉంటాయి. రిస్క్ ఉండే లక్షణాలు ఏవి ఉన్నాకానీ మొత్తంగా విసర్జించాలి. ఏ ముఖ్యమైన పనినీ మీరు చేపట్టవద్దు. వృత్తి పరంగా మీకు ఈ సంవత్సరం ఆటంకాలు మరియు సవాళ్ళు అనుభవంలోకి వస్తాయి. అస్థిరత, అయోమయం ఉంటాయి. మీ స్వంతమనుషులనుండి మీకు సహాయం అందదు. మీకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు జరిగే అవకాశం ఉంటుంది.మీదగ్గరి వ్యక్తుల అనారోగ్యం మీకు ఆతృతను కలిగిస్తుంది. మీకు ఈ దశలో, కుటుంబ సంబంధ సమస్యలు ఎదురవుతాయి. మీరు వీలైనంత వరకు నిరాడంబరంగాఉంటూ మార్పులేమీ చేపట్టకుండా ఉండండి.
Nov 16, 2025 - Jan 06, 2026
ఆరోగ్య సమస్యలతో బాధ పడతారు. మీ వద్ద డబ్బును నిలవ ఉంచుకోవడం కష్టమే అవుతుంది. ఏమంటే, మీకు విలాసాలకు, సుఖ సంతోషాలకోసం డబ్బును ఖర్చు పెట్టేసే గుణం ఉన్నది. ఈ సమయంలో మీరు స్పెక్యులేషన్లకు, విరివిగా ఖర్చుపెట్టడం తగదు. చిన్నపాటి తగాదాలు, అపార్థాలు, ఇంకా వాదనలు మీ కుటుంబ వాతావరణాన్ని, దాని ప్రశాంతతను దెబ్బతీస్తాయి. మీరంటే అసూయ ఉన్నవారు, సమస్యలను సృష్టిస్తారు. దాంతో, కుటుంబంలో నీలాపనిందలను, అసంతోషాన్ని ఎదుర్కొనాల్సి వస్తుంది. అటువంటివారిపట్ల జాగ్రత్త వహించండి. స్త్రీలవలన సమస్యలు రావచ్చును, హెచ్చరికగా ఉండడం అవసరం.
Jan 06, 2026 - Jan 28, 2026
మీ పై అధికారులనుండి లేదా బాధ్యతాయుతమైన లేదా పరపతిగల వ్యక్తుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. వృత్తిపరంగా మీరు రాణిస్తారు. కుటుంబం నుండి కూడా సహకారం అందుతుండడం కనబడుతుంది. దూరప్రాంతాలలోగలవారు, లేదా విదేశీ వ్యక్తులద్వారా సహకారం అందుతుంది. అదాటుగా చేసిన వాటికి కూడా,మీకిష్టమై చేస్తే,ఇది మంచియోగదాయకమైన కాలం కాగలదు. మీకు సమాజంలో మర్యాద మరింత గౌరవం పెరుగుతుంది. క్రొత్త ఇల్లు కడతారు, అన్నివిధాల సంతోషాలను పొందుతారు.
Jan 28, 2026 - Mar 30, 2026
ఏదో విధంగా కాలం, అదృష్టం మీ పై మీ చర్యలపై దృష్టి ప్రసరించుతాయి. మీరు చేసిన పనులకు, శ్రమకు కితాబునిచ్చుకుని, ఇతరులు దానిని గుర్తించి, మీవైపు తలెత్తిచూసేటందుకు ఇది తగిన వేళ. మీ తల్లితండ్రులతోను, మీపిల్లలతోను, బంధువులతోను అదే దగ్గరితనాన్ని కొనసాగిస్తారు. కబుర్లు అందచేయడం, సంప్రదింపులు ఫలించుతాయి, మీకు క్రొత్త అవకాశాలుచేకూరుస్తాయి. వ్యాపారరీత్యా/ ఉద్యోగపరంగా వగైరా తరచు ప్రయాణాలు ఉంటాయి. మీరువిలువైన లోహాలు, రత్నాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
Mar 30, 2026 - Apr 17, 2026
ఇది మీకు బహు కష్ట కాలం. మీ అదృష్టం మీకు వ్యతిరేకమౌతున్నట్లుంది. మీ వ్యాపార భాగస్వాములు మీకు బహు సమస్యలను సృష్టిస్తారు. మీ వ్యాపార సంబంధ ప్రయాణాలు లాభించకపోవచ్చును. ఇంటి విషయాలలో, మీ తీవ్ర స్వభావాన్ని అదుపులో ఉంచుకొనండి. ఆవిధంగా ఇబ్బందికర పరిస్థితులనుండి తప్పించుకొనవచ్చును. భాగస్వామి అనారోగ్యం, చీకాకులకు కారణం కావచ్చును. మీరు కూడా అనారోగ్యం, మానసిక వత్తిడులకు గురి అయే అవకాశం ఉన్నది. మీకు కూడా, తల, కంటి సంబంధ, పాదాలకు, చేతులకు సంబంధించిన సమస్యలు కలగవచ్చును.
Apr 17, 2026 - May 17, 2026
ఇది మీకు అత్యంత యోగదాయకమైన కాలం. మీరు మీ ఆలోచనలతోచక్కని ఆత్మ విశ్వాసం కలిగి ఉంటారు. ఇంకా, పదవి పెరగడం(ప్రమోషన్)పట్ల గల అవకాశాలు హెచ్చుగా ఉండడగలదు. విజయవంతమయే ఆకస్మిక ప్రయాణాల సూచనలున్నాయి. సంతానపరంగా జీవిత భాగస్వామితో ప్రేమానురాగాలు బలపడతాయి. సంతోషం మీ సోదరులకు కూడా కలిసివచ్చే కాలం. స్థలమార్పు లేదా వృత్తి మార్పు ఆలోచన విరమించవలసిఉంది.