మీరు మీ జీవిత భాగస్వామి అనారోగ్య సమస్యల వలన బాధ పడవచ్చును. మీ సహచరులు, సీనియర్లతో సర్దుకోవడం మీకు కష్టమవుతుంది. సంతానవిషయిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చును. జీవితంలోని ఇతర రంగాలలో కూడా, కష్టకాలాన్ని ఎదుర్కొంటారు. సిల్లీగా చిలిపి తగాదాలు, అపార్థాలు మరియు, వాదనలు మీ ప్రేమ విషయాలు, వివాహజీవితంలో విడనాడాలి. మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులతో అనంగీకారం ఉంటుంది. మానసిక మైన అదుపు ఈ సమయంలో ఎంతో అవసరం. ఎందుకంటే, మీ ఆలోచనలు అనైతికత వైపుకు మరలే అవకాశమున్నది.
Nov 21, 2025 - Dec 12, 2025
మీ పై అధికారులనుండి లేదా బాధ్యతాయుతమైన లేదా పరపతిగల వ్యక్తుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. వృత్తిపరంగా మీరు రాణిస్తారు. కుటుంబం నుండి కూడా సహకారం అందుతుండడం కనబడుతుంది. దూరప్రాంతాలలోగలవారు, లేదా విదేశీ వ్యక్తులద్వారా సహకారం అందుతుంది. అదాటుగా చేసిన వాటికి కూడా,మీకిష్టమై చేస్తే,ఇది మంచియోగదాయకమైన కాలం కాగలదు. మీకు సమాజంలో మర్యాద మరింత గౌరవం పెరుగుతుంది. క్రొత్త ఇల్లు కడతారు, అన్నివిధాల సంతోషాలను పొందుతారు.
Dec 12, 2025 - Feb 11, 2026
ఈ దశ మీకు ఎన్నోకారణాలవలన అత్యుత్తమ యోగదాయకం. ఎన్నో విషయాలు వాటంతట అవే పరిష్కరింపబడి సఫలం అయేటంతగా ఉండే మీ స్నేహశీలత అద్భుతం. మీ ఇంటికి సంబంధించిన అన్ని విషయాలను ఖచ్చితమైన పరిధిలలో సానుకూలమై పోతుంటాయి. ఈ కాలంలో మీ కుతూహలం, గాఢమైన ఇచ్ఛ మీ పనితనాన్ని ఎప్పటికంటె అత్యున్నతంగా చూపెడతాయి. ఉన్నత వర్గాల సహకారం అందుతుంది. మీ పదవిలో ఉన్నతి కలుగుతుంది. మీ శత్రువులను ఓడించడం జరుగుతుంది. మీ కుటుంబ సభ్యులు మరియు, బంధువుల అనుకూలత మీకు లభిస్తుంది. మీ చుట్టూరా, ఆహ్లాదకరమైన పరిస్థితులు కానవస్తాయి.
Feb 11, 2026 - Mar 01, 2026
చికాకుల సంసారానికి, మరింత శ్రద్ధ, జాగ్రత్త అవసరమౌతాయి. కుటుంబ విషయాలు, టెన్షన్ లను రెండింటినీ నెట్టుకుని రావడం కొంత కష్టమే. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. కుటుంబంలో ఒకరు మరణించవచ్చును. భారీగా ఆర్థిక నష్టాలు, ఆస్తి కోల్పోవడం ఉండవచ్చును. ఆర్థిక విషయాల పట్ల శ్రద్ధను వహించాలి. నోటి మరియు కంటి బాధలు, సమస్యలకు కారణం కావచ్చును.
Mar 01, 2026 - Apr 01, 2026
ఇది మీకు అత్యంత యోగదాయకమైన కాలం. ఆర్థిక విషయమై ప్రయోజనాలు ఉంటాయి. ఆకస్మిక ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుని, బంధుమిత్రులను కలిసే అవకాశం ఉన్నది. అనుకూలమైన కాలం కనుక, చక్కగా వినియోగించుకొనండి. స్త్రీలవలన, పై అధికారులవలన, ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. డబ్బుకు సంబంధించినంతవరకు కూడా మంచి ఫలదాయకమైన సమయం.
Apr 01, 2026 - Apr 22, 2026
ఆర్థిక లావాదేవీలు లాభదాయకం కాదు. మీ కుటుంబంలో మరణం సంభవించవచ్చును. కుటుంబ తగాదాలు మీకు మనో ప్రశాంతతను పోగొట్టవచ్చును. మీ కఠినమైన సంభాషణలతో లేదా ఉపన్యాసంతో స్వయంగా సమస్యలు తెచ్చుకోగలరు. వ్యాపార సంబంధమైన ఒక చెడు వార్త మీకు వస్తుంది. భారీ నష్టాలు సూచన. అనారోగ్యాలు, ఇబ్బంది పెట్టవచ్చును.
Apr 22, 2026 - Jun 16, 2026
ఇది మీకు మంచి కాలం కాదు. మీ శతృవులు మీ శతృవులు మీ ప్రతిష్టదెబ్బ తీయ చూస్తారు. ఆకస్మిక ధన నష్టం కలగవచ్చును. మీఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆహారం విషతుల్యమవడంతో, ( ఫుడ్ పాయిజనింగ్) కడుపునొప్పులకి దారితీస్తుంది. కాలం మీకు అనుకూలించదు కనుక వ్యాపారాలలో మీరు రిస్క్ తీసుకునే ప్రయత్నం చెయ్యవద్దు. మీ బంధు మిత్రులతో చిన్న విషయాల్కే వివాదాలు పెరగవచ్చును. పెద్ద/ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. లేకుంటే కష్టాలలో పడతారు. అంతే కాదు మీరు కృతజ్ఞత లేని పనిని చేయవలసి రావచ్చును.
Jun 16, 2026 - Aug 03, 2026
వృత్తిపరంగా, మరియు వ్యక్తిగతంగా కూడా, ఈ సంవత్సరం భాగస్వామ్యం కలిసివస్తుంది. ఏది ఏలాగైనా, మీరు చాలాకాలంగా ఎదురు చూస్తున్నట్టిజీవిత గమనాన్నే మార్చేసే ఉక్కిరిబిక్కిరి చేసే సంఘటన జరగవచ్చును. మీ బాధ్యతలను చక్కగా నిర్వహించి. మీ తల్లితండ్రులతోను, మీపిల్లలతోను, బంధువులతోను అదే దగ్గరితనాన్ని కొనసాగిస్తారు. కబుర్లు అందచేయడం, సంప్రదింపులు ఫలించుతాయి, మీకు క్రొత్త అవకాశాలుచేకూరుస్తాయి. వ్యాపారరీత్యా/ ఉద్యోగపరంగా వగైరా తరచు ప్రయాణాలు ఉంటాయి. మీరువిలువైన లోహాలు, రత్నాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
Aug 03, 2026 - Sep 30, 2026
మీరు వెదజల్లే అమితమైన శక్తి (ఎనర్జీ) మీజీవితంలో మిమ్మల్ని సమర్థించే ఎంతో మందిని మీవైపుకు ఆకర్షిస్తుంది. మీ శతృవులు మిమ్మల్ని తలెత్తి చూడడానికి సాహసించరు. ఆర్థికంగా ఇది మీకు అత్యుత్తమ కాలం. మీ వ్యక్తిగతంగా, మీ స్నేహితులతో ఉన్నపుడు ఇంకా కుటుంబం తోను మంచిగా ఉండడానికి క్రొత్తదారులు నేర్చుకుంటున్నారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచుకుంటున్నకొద్దీ, మీ వరకు మీరు ఆత్మ శక్తిని పెంచుకుంటే మీ అవసరాలకు నిలబడగలుగుతారు. మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీ పని పరిస్థితులు తప్పనిసరిగా మెరుగవుతాయి. మీ సహోద్యోగులు అధీన పనివారు మీకు అన్నివిధాలా బాగా సహకరిస్తారు. మీరు కొంత భూమిని, లేదా యంత్రాలను కొనుగోలు చేస్తారు. మీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ అవసరం.
Sep 30, 2026 - Nov 21, 2026
మీ పని లేదా వ్యాపారంలో ఆదాయంలేదా వృత్తి లో ఎదగడం లాభాలను పొందడం నిశ్చయం. శత్రుజయం, ఆస్తులు పెరగడం, జ్ఞానం పెరగడం, పై అధికారుల నుండి సానుకూల ఉపకారం, అలాగే సఫలతలను ఆశించవచ్చును. ఈ సమయంలో, ప్రయాణాలు లాభించడమే కాకుండా, తత్వ చింతనం, బలపడుతుంది. మీరు తెలివితో, ఇంటా బయటాబాధ్యతలనునిర్వర్తిస్తారు.