Kuldeep Sen
Oct 22, 1996
00:00:00
Rewa
81 E 17
24 N 31
5.5
Dirty Data
పనికిరాని సమాచారం
మీరు అందరితో కలిసిపోగల వ్యక్తి మరియు ఆనందానికి సరియైన స్థితి మిత్రులందరితో కలిసి ఉండడం అని నమ్ముతారు. ఈ మిత్రుల నుండి, మీరు ఒకరిని మీ ఆప్తులుగా భావించి, మీకు ఇదివరకే వివాహం కాకుంటే, వారిని పెళ్ళిచేసుకుంటారు. మీ స్వభావం కరుణతో నిండి ఉంటుంది. పర్యవసానంగా, మీ వివాహ జీవితం ఆనందకరంగా సాగడానికి అనేకకారణాలు ఉన్నాయి. మీరు మీ ఇల్లు, దాని వస్తువుల గురించి బాగా ఆలోచిస్తారు మరియు మీరు సౌకర్యంగా, మంచి ప్రదేశంలో ఉండాలని కోరుకుంటారు. ఇంటిలో ఏదైనా అసక్రమంగా ఉంటే అది మీ వివశతలపై క్షోభపెడుతుంది. మీ పిల్లలే మీకు సర్వస్వం. మీరు వారికొరకు కష్టపడతారు మరియు వారికి ఉత్తమమైన విద్య మరియు ఆనందాన్ని అందిస్తారు, మరియు వారిపై ఖర్చు చేసినది వ్యర్థంకాదు.
మీరు మీ సౌకర్యాలకు అధిక మూల్యాన్ని చెల్లిస్తారు. ఈ అంశం యొక్క ఫలితం వలన, మీరు రుచులు తెలిసిన వ్యక్తి మరియు మీ ఆహారాన్ని ఆనందిస్తారు. వాస్తవంగా, మీరు జీవించడానికి భుజించరు, భుజించడానికే జీవిస్తారు. మీ అజీర్ణ ప్రక్రియ మీ శరీరంలోనే తిష్టవేసుకొని ఉంటుందనుటలో అతిశయోక్తి లేదు. అది మీకు చాలా సమస్యలను కలుగజేస్తుంది. అజీర్ణం వంటి వ్యాధులను నిర్లక్ష్యం చేయకండి మరియు అవి వచ్చినపుడు మందులతో నయం చేయడానికి ప్రయత్నించకండి. ఒకమాదిరి వ్యాయామాలైన నడక మరియు స్వల్ప శారీరక వ్యాయామాలు చేయండి. తాజాశ్వాసను తీసుకోండి, మితంగా తినండి, పండ్లను ఎక్కువగా తీసుకోండి. అయినా అది కొనసాగితే వైద్యుని సంప్రదించండి. యాభై సంవత్సరాల వయస్సు తరువాత జడత్వం గురించి జాగ్రత్త వహించండి. మీరు ఇది అది అన్నీ మానేస్తే మీ జీవితంలో పట్టుకోల్పోతారు. విషయాలలో మీ ఆసక్తిని కొనసాగించడానికి, మీ అలవాట్లను వృద్ధిచేసుకోండి మరియు తమకంటే తక్కువ వయస్సు గల వారితో కలిసిపోతే ఎవరూ కూడా ముసలివారు కాలేరని గుర్తుంచుకోండి.
మీ విశ్రాంతి క్షణాలు మీ నడవడికి తగినట్టుగా గడపాలి. మీరు సౌకర్యాలు మరియు సంస్కారాలకు విలువనిస్తారు, మీరు మొరటైన లేదా శ్రమతోకూడిన ఆటలను పట్టించుకోరు. మీరు ఇతరుల సాంగత్యాన్ని ఇష్టపడతారు మరియు జీవితంలోని ప్రకాశవంతమైన క్షణాలను కోరుకుంటారు. పేకాట బహుశా మిమ్మల్ని మోహింపజేస్తుంది, కానీ ధనం లేకుండా ఆడడం ఆకర్షణీయకం కాదు. మరియు, ఈ సందర్భంగా, మీరు జూదం ఆడకూడదనే హెచ్చరికను చేయడమైనది. అనుమతిస్తే, అది మిమ్మల్నే తనగుప్పిట్లో పెట్టుకుంటుంది.