ఇది మీకు బహు అనుకూలమైన కాలం, పట్టినది బంగారమయ్యే కాలం అంటే, ఇక మీరు కార్యోన్ముఖులు కావలసిన(పని చేయవలసిన కాలం). వివిధ రంగాల నుండి అనుకోని విధంగా బహుమతులు, లాభాలు వచ్చి పడిపోతుంటాయి. ఇది మీకు మరింత మెరుగైన కెరియర్ ను , సర్వతో ముఖాభివృద్ధిని అందిస్తుంది. మీ వ్యతిరేకులు, మీ దారిలో ఎదురుపడడానికి కూడా సాహసించరు. ఇక మీ వంతుగా తగినవిధంగా ఆకర్షణను, కీర్తిని పొందుతారు. పాలకుల నుండి, మీ పై అధికారులనుండి, ఉన్నతాధికారులనుండి, అభిమానాన్ని చూరగొంటారు.మీకుచక్కని ఆరోగ్యం, శరీర సౌష్టవం ఉంటాయి. ఈ ఏడాది మీకు, వాహన ప్రాప్తి కూడా సూచిస్తున్నది.
Nov 16, 2026 - Jan 04, 2027
మీరు మీ వ్యక్తిత్వంలోని కలుపుగోలుతనాన్ని, పనిచేసే చోట, స్నేహితులవద్ద, మరియు మీ మీకుటుంబంలోను, సామరస్యత నెలకొనేలా చేయడానికి మెళకువలు లేదా క్రొత్త మార్గాలు నేర్చుకుంటున్నారు. మీరు మీ వాక్చాతుర్యాన్ని, అంటే కమ్యునికేషన్ స్కిల్స్ ని, విస్తృతపరుచుకిని, మీ మనసుచెప్పినట్లు మీ వ్యక్తిగత అవసరాల అనుసారంగా నడిచి, నిజాయితీగా ఉండడంతో, గొప్ప ప్రయోజనాలు అందుకుంటారు. మీ జీవితంలో సంభవించే మార్పులను మీరు గాఢంగా సుదీర్ఘ కాలం నిలుస్తాయి. మీ శ్రమను గుర్తించలేదని ఎవరి గురించి మీరు అనుకున్నారో, వారే మీకు అత్యంత మిత్రత్వంతో సమర్థించే అస్మదీయులుగా నిలుస్తారు. కుటుంబంలో ఒక పుణ్యకార్యం చేసే అవకాశం ఉంది. ఈ సమయం, మీకు అభివృద్ధిని, మీ పిల్లలకి సఫలతని అందిస్తుంది.
Jan 04, 2027 - Mar 03, 2027
ఇది మీకు అంత సంతృప్తికరమైన కాలం కాదు. ఆర్థికంగా మీకు నష్టాలు కలగవచ్చును. వ్యాజ్యాలవలన, వివాదాలవలన, డబ్బు నష్టపోయే అవకాశమున్నది. వైఫల్యాలు మిమ్మల్నినిరాశకు గురి చేస్తాయి. పని వత్తిడికి మీరు అలసిపోతారు. కుటుంబ విషయాలు కూడా ఆందోళన కారణం కావచ్చును. క్రొత్త వ్యాపార రీత్యా రిస్క్ గల వ్యవహారాలు మానండి.. ఎందుకంటే నష్టాల కాలమిది. సమయం మీకు అనుకూలంగా లేదు. శతృవులు మీ ప్రతిష్టదెబ్బ తీయ చూస్తారు. ధననష్టం కూడా సహజం
Mar 03, 2027 - Apr 23, 2027
ఇది మీకు మంచి యోగదాయకమైన కాలం. మీరు సాధించినదానిపట్ల ఎంతో తృప్తిని, మీకు కలిగిస్తుంది. ఈసమయంలో, మీరు జీవితాన్ని పూర్తి ఆశావహంగానూ, జీవకళ ఉట్టిపడుతూ గడుపుతారు. మీకు ప్రయాణానికి, చదువుకి, జీవితంలో ఎదగడానికి కావలసినంత అవకాశం దొరుకుతుంది. మీ రు మగవారైతే, స్త్రీ వలన, స్త్రీఅయితే పురుషునివలన మీ పరిధిలో, ఉపకారం పొందుతారు. మీకు లభించవలసిన గౌరవంఅంతటి స్థాయిలోనూ,మీకు లభ్యమౌతుంది. జీవితం మరింత స్థిరపడుతుంది. స్పెక్యులేషన్ వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. స్థలం లేదా వాహనం పొందే అవకాశం ఉన్నది.
.
Apr 23, 2027 - May 15, 2027
వృత్తిలోను, వ్యక్తిగతంగాను ఆటంకాలు ఎదురౌతాయి. కష్టకాలాన్ని తెలివితోను, నిదానంగాను ఎదుర్కొనండి. ఏమంటే, ఈ సమయంలో కఠినంగా ర్యాష్ గా ఉండడం వలన ఏమీ సహాయం జరగదు. ప్రయాణం అనుకూలించదు. కనుక మానడానికి ప్రయత్నిఛండి. మీ కుటుంబం వైపునుండి పూర్తి సపోర్ట్, ఉండదు. సమర్థించరు. సంతాన సమస్యలు ఉంటాయి. మీ శతృవులు మీకు హాని కలిగించగల ఏరాయిని విసరకుండా వదలరు. మీరు ధైర్యంగా స్థైర్యంగా ఉండడం, మీ సవ్యమైన నిర్ణయాలకు కట్టుబడి ఉండడం మంచిది. పొట్టకు సంబంధించి, అసౌకర్యం కొంత ఆందోళనకు దారితీస్తుంది.
May 15, 2027 - Jul 14, 2027
మీరు ప్రయత్నించే వ్యక్తిగత సంబంధాలు అంతగా ఫలవంతంకావు పైగా, ఇంటా బయటా పనిచేసే చోట కొంతవరకు చికాకులకు దారితీయవచ్చును. మీ ఆరోగ్యం కోసం జాగ్రత్తను వహించండి. అలాగే మీ ప్రతిష్ట.ను మెరుగు పరుచుకోచూడండి. ఇంద్రియపరమైన (సెన్స్యుఅల్) ఆలోచనలు నిరాశ పరచడమే కాక కొంత అవమానకరంకూడా. ఇతర స్త్రీపురుషులతో సామరస్య ధోరణి కొంత తగ్గవచ్చును. మీ జీవితంలో మీ ఆరోగ్య సమస్యలు కొంత అస్తవ్యస్తతను కలగచేయవచ్చును. అనవసర ఖర్చులకు పాల్పడే అవకాశమున్నది. మొత్తంమీద ఇది మీకు అంతగా సంతోషదాయక కాలం కాదు. శారీరకంగా మీకు నీరసంగా నిస్పృహగా అనిపిస్తుంది.
Jul 14, 2027 - Aug 02, 2027
ఇది మీకు బహు కష్ట కాలం. మీ అదృష్టం మీకు వ్యతిరేకమౌతున్నట్లుంది. మీ వ్యాపార భాగస్వాములు మీకు బహు సమస్యలను సృష్టిస్తారు. మీ వ్యాపార సంబంధ ప్రయాణాలు లాభించకపోవచ్చును. ఇంటి విషయాలలో, మీ తీవ్ర స్వభావాన్ని అదుపులో ఉంచుకొనండి. ఆవిధంగా ఇబ్బందికర పరిస్థితులనుండి తప్పించుకొనవచ్చును. భాగస్వామి అనారోగ్యం, చీకాకులకు కారణం కావచ్చును. మీరు కూడా అనారోగ్యం, మానసిక వత్తిడులకు గురి అయే అవకాశం ఉన్నది. మీకు కూడా, తల, కంటి సంబంధ, పాదాలకు, చేతులకు సంబంధించిన సమస్యలు కలగవచ్చును.
Aug 02, 2027 - Sep 01, 2027
ఎంతో విజయవంతమైన కాలం అనుకూలమై భవిష్యత్తులో ఎదురు చూస్తున్నది. సృజనాత్మకతదృక్పథం, అదనపు ఆదాయానికిఅవకాశాలు ఎదురువస్తున్నాయన్నమాటే. మీరు మీ సీనియర్లతోను, సూపర్ వైజర్లతోను సత్సంబంధాలను కలిగి ఉంటారు.మీ ఆదాయంలో చెప్పుకోదగిన పెరుగుదలకనిపిస్తుంది. వ్యాపారం,అలాగే కీర్తి కూడా వృద్ధి చెందుతాయి.మొత్తంమీద,ఈ దశమీకు అనుకూలమనే చెప్పవచ్చును.
Sep 01, 2027 - Sep 22, 2027
కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగించవచ్చును. ప్రయాణాలు కలిసిరావు కనుక మానవలసింది. అనవసర ఖర్చులు అవుతాయి కనుక జాగ్రత్త గా ఉండాలి. స్నేహితులతోను, సహచరులతోను జాగ్రత్త, కొన్నిసార్లు, మీ న్యాయ నిర్ణయం,విచక్షణ సరిగా ఉండకపోవచ్చును. అగ్ని వలన కానీ, స్త్రీల వలనగానీ గాయపడవచ్చును. హృదయ సంబంధ సమస్యలు తలెత్తవచ్చును కనుక, ఆరోగ్య విషయమై జాగ్రత్త చూపాలి.
Sep 22, 2027 - Nov 16, 2027
ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉండి పైకి ఎదుగుతారు. మీరు ఈ కాలంలో, దాంపత్య సౌఖ్యాన్ని పొందుతారు. పరపతిగల వారితో మీ పరిచయాలు తప్పక ఇంకా పెరుగుతాయి. మీ వైరివర్గం, మీవైపుకు కనీసం ఎదురుపడడానికి కూడా సాహసంచేయలేరు. సుదీర్ఘ ప్రయాణం ప్రయోజనకరం కాబోతున్నది. ప్రేమ, రొమాన్స్ వరంగా మారనున్నాయై. మీరొక నాయకునివలె, మీ శతృవులను గెలుస్తారు. చిన్నపాటి అనారోగ్యం కాన వస్తుంది. పిల్లలతో అనుబంధాలు బాగులేకపోయినా మిగతా కుటుంబ సంబంధాలు సంతృప్తికరంగా ఉంటాయి.